MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Suryakumar Yadav: ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్..

Suryakumar Yadav: ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్..

Suryakumar Yadav: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాద‌వ్ చీలమండ గాయానికి గురయ్యాడు. ఫిబ్రవరి వరకు సూర్యకుమార్ క్రికెట్ కు దూరంగా ఉండ‌నున్నారు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 23 2023, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Surykuamr Yadav

Surykuamr Yadav

Surykuamr Yadav Injury: టీమిండియాకు మ‌రో బ్యాడ్ న్యూస్. స్వదేశంలో ఆస్ట్రేలియాపై 4-1తో సిరీస్ విజయం, దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను డ్రా చేసుకున్న టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ రాబోయే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు 33 ఏళ్ల ఈ ప్లేయ‌ర్ చీలమండల గాయానికి గుర‌య్యాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Surykuamr Yadav

Surykuamr Yadav

టీ20 ప్రపంచకప్ సన్నాహకాలకు ఎదురుదెబ్బ..

టీ20 వరల్డ్ క‌ప్ కు ముందు టీమిండియాకు అఫ్గానిస్థాన్ సిరీస్ చివరి టీ20 సిరీస్. టీ20 వరల్డ్ క‌ప్ కు సన్నాహకాలకు సరైన కాంబినేషన్ ను కనుగొనడానికి టీమ్ఇండియాకు మిగిలి ఉన్న ఏకైక సిరీస్ కూడా ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సిరీస్ కు సూర్య దూరం కావడంతో భారత జట్టు టీ20 ప్రపంచకప్ సన్నాహకాలు కొంతమేర దెబ్బతినడం ఖాయం. 
 

34
Suryakumar Yadav

Suryakumar Yadav

జొహన్నెస్ బర్గ్ టీ20లో గాయం

మూడు టీ20ల సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్యకుమార్ యాద‌వ్ కాలి మడమకు గాయమైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో సూర్య అద్భుత సెంచరీ సాధించాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కు వచ్చినప్పుడు మూడో ఓవర్ లో ప్రొటీస్ బ్యాట్స్ మన్ వేసిన షాట్ ను ఆపి బంతి విసురుతుండగా ఈ గాయానికి గురయ్యాడు.
 

44
suryakumar yadav

suryakumar yadav

గాయం తర్వత వెంటనే భార‌త క్రికెట్ ఫిజియో బృందం  సూర్య కుమార్ యాద‌వ్ ను మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాడు. మిగిలిన మ్యాచ్ ల్లో వైస్ కెప్టెన్ రవీంద్ర జడేజా టీం ఇండియా పగ్గాలు చేపట్టాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా 106 పరుగుల తేడాతో విజయం సాధించగా సూర్యకుమార్ యాదవ్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో సూర్యకుమార్ యాదవ్ గాయం గురించి ప్రశ్నించగా.. నేను క్షేమంగానే ఉన్నానని సమాధానమిచ్చాడు. న‌డుస్తున్నాన‌ని చెప్పాడు. దీంతో గాయం త్వ‌ర‌లోనే త‌గ్గుతుంద‌ని భావించారు. కానీ గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో రెండు నెల‌ల పాటు విశ్రాంతిలో ఉండ‌నున్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved