- Home
- Sports
- Cricket
- డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అతడితో జాగ్రత్త.. కుదురుకుంటే కంగారూలకు కష్టమే.. ఆసీస్‌కు ఇయాన్ ఛాపెల్ హెచ్చరిక
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అతడితో జాగ్రత్త.. కుదురుకుంటే కంగారూలకు కష్టమే.. ఆసీస్‌కు ఇయాన్ ఛాపెల్ హెచ్చరిక
WTC Finals 2023: వచ్చే నెల 7 నుంచి 11 వరకూ ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ జరుగనున్న విషయం తెలిసిందే. భారత్ - ఇంగ్లాండ్ ల మధ్య ఈ ఫైనల్ జరుగనుంది.

Image credit: PTI
ప్రతి రెండేండ్లకోమారు జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ కు మరో మూడు వారాలే మిగిలుంది. భారత్ - ఆస్ట్రేలియాల మధ్య ది ఓవల్ వేదికగా జరుగబోయే ఈ ఫైనల్ లో గెలిచేందుకు ఇరు జట్లూ తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.
Image credit: PTI
ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టులోని సగం కంటే ఎక్కువ మంది ఆటగాళ్లు ఇంగ్లాండ్ లోకి కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు. భారత ఆటగాళ్లు కూడా ఐపీఎల్ ముగిసిన వెంటనే దఫదఫాలుగా ద ఇంగ్లాండ్ పయనమవుతారు. ఈ క్రమంలో ఐపీఎల్ తో పాటు గత ఏడాదిన్నరగా సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తో జాగ్రత్తగా ఉండాలని ఆసీస్ జట్టుకు దిగ్గజ ఆసీస్ ఆటగాడు ఇయాన్ ఛాపెల్ సూచించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు ముందు ఆయన ఈఎస్పీఎన్ ఓ కాలమ్ రాస్తూ..‘ఆస్ట్రేలియా బౌలర్లు శుభ్‌మన్ గిల్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అతడు భయం, బెరుకు లేకుండా ఆడుతున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా గిల్ స్ట్రోక్ మేకింగ్ మారదు. ఆస్ట్రేలియా బౌలర్లకు అతడు సవాళ్లు విసురుతాడు..’ అని చెప్పాడు.
Image credit: PTI
ఇక ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ లో స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్ మీద ఎక్కువగా ఆధారపడుతుందని, దీన్నుంచి వాళ్లు ఎంత త్వరగా బయటపడితే అంత బెటర్ అని ఛాపెల్ అభిప్రాయపడ్డాడు. స్టీవ్ స్మిత్, లబూషేన్, ఖవాజాతో పాటు డేవిడ్ వార్నర్ కూడా ప్రమాదకరమైన బ్యాటర్ అని.. ఇంగ్లాండ్ లో అతడికి మెరుగైన రికార్డు లేకున్నా అతడు క్రీజులో కుదురుకుంటే ఇండియాకు కష్టాలు తప్పవని పేర్కొన్నాడు.
భారత జట్టుకు రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం పెద్ద లోటని.. హార్ధిక్ పాండ్యా కూడా అందుబాటులో లేకపోవడం భారత్ కు నష్టం చేకూర్చేదని చాఫెల్ అభిప్రాయపడ్డాడు.
Steve Smith
ఆసీస్ పేస్ విభాగంలో కీలకమైన ఆటగాళ్లుగా ఉన్న పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్వుడ్ అందుబాటులో ఉండే అది ఆసీస్ కు కొండంత బలమని.. ఈ ముగ్గురూ ఎప్పుడైనా మంచి బౌలర్లేనని ఛాపెల్ తెలిపాడు. భారత్ కూడా మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్ ల రూపంలో మంచి పేస్ అటాక్ ను కలిగి ఉన్నారని.. దీంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర సమరం ఉంటుందని ఛాపెల్ రాసుకొచ్చాడు.