MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • టీమిండియా ఫైనల్‌కి వెళ్తుంది! కానీ ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలుస్తుంది... రికీ పాంటింగ్ కామెంట్...

టీమిండియా ఫైనల్‌కి వెళ్తుంది! కానీ ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలుస్తుంది... రికీ పాంటింగ్ కామెంట్...

మరో మూడు నెలల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా జరిగిన 2021 టీ20 వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా, ఈసారి కూడా టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్, టీ20 వరల్డ్ కప్ 2022 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 27 2022, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీని పెద్దగా అంచనాలు లేకుండా ప్రారంభించింది ఆస్ట్రేలియా. వార్మప్ మ్యాచుల్లో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా, లీగ్ మ్యాచుల్లో అదరగొట్టి, సెమీస్‌లో చెలరేగి... ఫైనల్‌లో ఘన విజయాన్ని అందుకుంది...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

2021లో మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా, ఈసారి పొట్టి ప్రపంచకప్‌కి వేదికనిస్తుండడంతో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. హోం గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో ఆసీస్ వరుసగా రెండో టైటిల్ గెలవడం గ్యారెంటీ అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

38

టైటిల్ ఫెవరెట్‌గా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో అడుగుపెట్టిన భారత జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజీకే పరిమితమైంది. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో మొట్టమొదటిసారి పాక్ చేతుల్లో పరాజయాన్ని చవిచూసిన భారత జట్టు, ఆ తర్వాత న్యూజిలాండ్ చేతుల్లో ఓడి సెమీస్‌కి అర్హత సాధించలేకపోయింది...

48

‘ఈసారి నా అంచనా ప్రకారం ఇండియా, ఆస్ట్రేలియా... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఫైనల్ ఆడతాయి. అయితే ఫైనల్‌లో ఆస్ట్రేలియా, టీమిండియాని ఓడించి టైటిల్ గెలుస్తుంది...

58

ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా టోర్నీని మొదలెట్టడమే కాదు, ఆస్ట్రేలియాకి ఈసారి హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్‌తో ఫైనల్ ఆడుతున్నామనే ఒత్తిడి చాలు, ఇండియాని ఫైనల్‌లో ఓడించడానికి...

68

యూఏఈకి వేదికను మార్చినప్పుడు అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులు ఆస్ట్రేలియాకి అనుకూలించవని అనుకున్నారు. నేను కూడా అదే అనుకున్నా... అయితే ఆసీస్ అన్నింటినీ అధిగమించి టైటిల్ గెలిచింది...

78

వాస్తవానికి ఇంగ్లాండ్ జట్టు వైట్ బాల్ క్రికెట్‌లో చాలా పటిష్టంగా కనిపిస్తోంది. వాళ్లకు వైట్ బాల్ ఫార్మాట్‌లో మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉన్నారు... వాళ్లకి కూడా ఆస్ట్రేలియా పిచ్‌లపై ఆడిన అనుభవం ఉంది...

88
T20 world Cup

T20 world Cup

వాళ్లని కూడా లెక్కలోకి తీసుకుంటే ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టీమ్స్‌లో మోస్ట్ క్లాస్, మోస్ట్ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్... 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఏం జరిగిందంటే?
Recommended image2
Rishabh Pant: రిషభ్ పంత్‌కు బిగ్ షాక్.. లక్నో కెప్టెన్సీ నుంచి ఔట్.. ఏం జరుగుతోంది?
Recommended image3
IPL 2026 Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేస్.. పంజాబ్, రాజస్థాన్, కేకేఆర్ లలో ఆ లక్కీ టీమ్ ఏది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved