సిరీస్ కు ముందే భారత ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను చూసి భయపడుతున్న ఆస్ట్రేలియా - ఎందుకంటే?
India vs Australia : భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ నవంబర్ 22 నుంచి జనవరి 7 వరకు జరగనుంది. ఈ టెస్టు సిరీస్ ఆస్ట్రేలియా గడ్డపై జరగనుంది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ వరుసగా గత రెండు టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకుంది.
Rohit Sharma, Virat Kohli, Rishabh Pant
India vs Australia : సెప్టెంబర్ 19 నుండి భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. రెండు టెస్టు మ్యాచ్ ల ఈ సిరీస్ తొలి మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత భారత్ న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ రెండు సిరీస్ లు ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియాలు టెస్టు సిరీస్ ఆడనున్నాయి. అయితే, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ను దృష్టిలో ఉంచుకుని బంగ్లాదేశ్ సిరీస్ కు బీసీసీఐ బలమైన జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా పర్యటకు ముందు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్ లను గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.
Nathan Lyon
ఇక భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ నవంబర్ 22 నుంచి జనవరి 7 వరకు జరగనుంది. ఈ టెస్టు సిరీస్ ఆస్ట్రేలియా గడ్డపై జరగనుంది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ వరుసగా గత రెండు టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకుంది.
2018-19 మరియు 2020-21లో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఈసారి కూడా టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టులో భయాందోళన స్పష్టంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్‌లను చూసి ఓ కంగారూ బౌలర్లు భయపడుతున్నారు.
రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌ల మరోసారి అద్భుతంగా రాణించాలని చూస్తున్నారు. ఈ స్టార్ ప్లేయర్ల ప్రదర్శన చూడదగ్గదేనని ఆస్ట్రేలియా గ్రేట్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ అన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.
కోహ్లీ, రోహిత్, రిషబ్ పంత్ లతో పాటు విజిటింగ్ టీమ్‌లో గొప్ప బౌలింగ్, బ్యాటింగ్ లైనప్ ఉందని నాథన్ లియాన్ అన్నాడు. ఇది ఆతిథ్య జట్టుకు విషయాలు చాలా సవాలుగా చేస్తుందని చెప్పాడు. భారత్ చాలా బలమైన జట్టుగా కనిపిస్తోందని పేర్కొన్నాడు. భారత్‌లోని ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను చూసి కంగారూ బౌలర్ భయపడుతున్నాడు.
నాథన్ లియోన్ 'స్టార్ స్పోర్ట్స్'తో మాట్లాడుతూ, 'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ బహుశా ముగ్గురు చాలా పెద్ద ఆటగాళ్లు కావచ్చు, కానీ ఇప్పటికే ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడే యశస్వి జైస్వాల్ తో పాటు శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా ఉన్నారు. జట్టులో మిగతా ఐదుగురు ఆటగాళ్లు ఎవరు ఉంటారో నాకు తెలియదు. అయితే, ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ యూనిట్‌గా ఎక్కువ కాలం రాణిస్తే అది తమకు లాభదాయకంగా ఉంటుందని' నాథన్ లియాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
నాథన్ లియోన్ ఇంకా మాట్లాడుతూ, 'భారత్ కు గొప్ప లైనప్ ఉంది కాబట్టి ఇది పెద్ద సవాలుగా ఉంటుంది. నేను చెప్పినట్లు, మనం ఎక్కువ కాలం బౌలింగ్ గ్రూప్‌గా మంచిగా ఉంటే, మేము వారి రక్షణను సవాలు చేయగలమని ఆశిస్తున్నాము. వారికి గట్టి సవాలును ఇవ్వాలంటే బౌలింగ్, బ్యాటింగ్ పవర్ చూపించాలని' అన్నాడు.
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. ఆస్ట్రేలియా జట్టు 2014–15లో స్వదేశంలో చివరి సిరీస్‌ను గెలుచుకున్న తర్వాత సిరీస్‌ను గెలుచుకోవడంలో విఫలమైంది. అప్పటి నుండి, భారత జట్టు వరుసగా నాలుగు సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ను గెలుచుకుంది. రెండుసార్లు స్వదేశంలో, రెండుసార్లు విదేశాల్లో సాధించింది.
అలాగే, ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న ఏకైక ఆసియా జట్టుగా కూడా భారత జట్టు నిలిచింది. ఆ జట్టు అనేక సందర్భాల్లో టైటిల్‌ను గెలుచుకుంది. మొత్తంమీద బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గమనిస్తే టీమిండియా అత్యంత విజయవంతమైన జట్టు. మొత్తంగా 10 సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచింది.
Rishabh Pant
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రత్యేకత గమనిస్తే.. టెస్టు సిరీస్ విజేత ట్రోఫీ గెలుచుకోవడం సాధారణమే అయితే, సిరీస్ డ్రా అయితే అంతకుముందు ట్రోఫీని సొంతం చేసుకున్న దేశం దానిని నిలుపుకుంటుంది. అలాగే, భారత్-ఆస్ట్రేలియా పోటీ స్వభావం, ఇరు జట్ల ఉన్నత స్థానాల దృష్ట్యా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 5 రోజుల క్రికెట్ లో అత్యంత ప్రతిష్టాత్మక ద్వైపాక్షిక ట్రోఫీల్లో ఒకటిగా పరిగణిస్తారు.
కాగా, ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇదివరకు అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడి భారత్ కు విజయాలు అందించిన సందర్భాలు ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు.