David Warner: ఆస్ట్రేలియాకు 2 వరల్డ్ కప్ లు అందించిన స్టార్.. డేవిడ్ వార్నర్ వన్డే రికార్డులు ఇవే..
David Warner records: జనవరి 18, 2009న హోబర్ట్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా తరపున వన్డే క్రికెట్ లోకి డేవిడ్ వార్నర్ అరంగేట్రం చేసాడు. ఆసీస్ రెండు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీలను గెలుచుకోవడంలో కీలక పాత్రను పోషించాడు.
David Warner
David Warner career: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, కంగారుల జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ న్యూఇయర్ వేళ క్రికెట్ ప్రపంచానికి షాక్ ఇచ్చాడు. వన్డే క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించి సంచలనానికి తెరలేపాడు.
Image credit: Getty
ఇప్పటికే టెస్టు ఫార్మట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించగా, ప్రస్తుతం పాకిస్తాన్ తో జరుగుతున్న మూడో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ వన్డే క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్టు పేర్కొన్నాడు.
David Warner
డేవిడ్ వార్నర్ మూడు ఫార్మట్లలో ఆస్ట్రేలియా తరఫున స్టార్ బ్యాటర్. వార్నర్ వన్డే క్రికెట్ గణాంకాలు గమనిస్తే.. జనవరి 18, 2009న హోబర్ట్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా తరపున వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.
వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా డేవిడ్ వార్నర్ తన కెరీర్ ను ముగించాడు. 161 మ్యాచ్ లలో 45.30 సగటుతో 97.26 స్ట్రైక్ రేట్ లో 6932 పరుగులు చేశాడు.
అలాగే, వన్డే క్రికెట్ ఫార్మాట్ లో వార్నర్ 22 సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియా జట్టు తరఫును రెండో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా వార్నర్ రికార్డు సృష్టించాడు. అత్యధిక సెంచరీలు చేసిన లిస్టులో కంగారుల జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 29 సెంచరీలతో వార్నర్ కంటే ముందున్నాడు.
డేవిడ్ వార్నర్ తన వన్డే కెరీర్ లో మొత్తం 161 మ్యాచ్ లు ఆడాడు. 159 ఇన్నింగ్స్ లలో 45.30 సగటుతో 97.26 స్ట్రైక్ రేట్ లో 6932 పరుగులు చేశాడు.
David Warner
డేవిడ్ వార్నర్ తన వన్డే క్రికెట్ కెరీర్ లో మొత్తం 22 సెంచరీలు చేశాడు. అలాగే, 33 హాఫ్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అత్యధిక స్కోర్ 179 పరుగులు. వార్నర్ వన్డేల్లో మొత్తం 130 సిక్సర్లను కొట్టాడు.
David Warner
ప్రపంచ కప్ లోనూ వార్నర్ పలు రికార్డులు సృష్టించాడు. రెండు వరల్డ్ కప్ లు సాధించిన ఆస్ట్రేలియా జట్టులో ప్లేయర్ గా ఉన్నాడు. వరల్డ్ కప్ లో మొత్తం 29 ఇన్నింగ్స్ లు ఆడిన డేవిడ్ వార్నర్, 56.55 యావరేజ్, 101.46 స్ట్రైక్ రేటుతో 1527 పరుగులు చేశాడు. ఇందుల్లో 6 సెంచరీలు ఉన్నాయి.
వరల్డ్ కప్ లలో అత్యధిక పరుగులు సాధించిన ఆస్ట్రేలియా ప్లేయర్ల లిస్టులో రికీ పాంటింగ్ తర్వాత డేవిడ్ వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక డేవిడ్ వార్నర్ తన వన్డే కెరీర్‌లో మొత్తం 18 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకుని చరిత్ర సృష్టించాడు.