కేఎల్ రాహుల్ ఓటమి... నిరాశలో అతియా శెట్టి... ఆనందంలో అనుష్క శర్మ..!
మ్యాచ్ ఓటమి తర్వాత... అతియా శెట్టి..బాగా నిరాశకు గురయ్యారు. మరో వైపు ఆర్సీబీ విజయంతో... కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క శర్మ కూడా విపరీతమైన ఆనందంలో ఉన్నారు.

Anushka and athiyashetty
ఐపీఎల్ 2022 ట్రోఫీ పోరులో లక్నో సూపర్ జెంట్స్ పోరాటం ముగిసింది.ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో లక్నో ఓటమి పాలైంది. కాగా.. లక్నో ఓటమిని ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కి ఎంత నిరాశను కలిగించిందో... ఆయన ప్రేయసికి కూడా అంతే బాధ కలిగించిందని చెప్పాలి.
rahul and athiyashetty
మ్యాచ్ ఓటమి తర్వాత... అతియా శెట్టి..బాగా నిరాశకు గురయ్యారు. మరో వైపు ఆర్సీబీ విజయంతో... కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క శర్మ కూడా విపరీతమైన ఆనందంలో ఉన్నారు.
Rahul and athiyashetty
బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి... కేఎల్ రాహుల్ లు పీకల్లోతు ప్రేమల్లో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని కూడా అందరికీ తెలుసు. కాగా.. రాహుల్ ప్రతి మ్యాచ్ కీ.. అతియా కచ్చితంగా వచ్చేది. స్టేడియంలో కూర్చొని రాహుల్ టీమ్ గెలవాలని చీర్ చేసేది.
కాగా.. బుధవారం లక్నో, ఆర్సీబీ ల మధ్య జరిగిన మ్యాచ్ లో...19వ ఓవర్లో కేఎల్ రాహుల్‌ను హేజెల్‌వుడ్ అవుట్ చేయడంతో లక్నో పోరాటం ముగిసిందనే విషయం స్పష్టంగా అర్థమైంది. తరచుగా స్టాండ్స్ నుండి KL ని ఉత్సాహపరిచే అతియా,.. లక్నో ఓటమితో కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ గా మారాయి.
rahul and athiyashetty
కేల్ రాహుల్, అతియాలు ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో... ఈ ఐపీఎల్ విజయం వారికి మరింత ఎక్కువ ఉత్సాహాన్ని ఇచ్చేది. రాహుల్ టీమ్ కూడా ఐపీఎల్ లో చాలా ఉత్సాహంగా ఆడింది.
పెద్ద పెద్ద టీమ్ లను ఓడించి ప్లే ఆఫ్ కి చేరింది. కానీ... ప్లే ఆఫ్ లో గెలిచి క్వాలిఫయ్యర్ రౌండ్ కి వెళ్లే సమయంలో ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైంది.
దీంతో... అతియా.. స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకుంది. మరో వైపు విరాట్ కోహ్లీ జట్టు ఆర్సీబీ... విజయం సాధించడంతో... అనుష్క శర్మ చాలా ఆనందం వ్యక్తం చేశారు. మరి ఈ సారైనా.. ఆర్సీబీ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.