MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2024 : కావ్య పాప కప్ కొడుతుందా..? ఆమె జాతకమే ఎస్ఆర్‌హెచ్‌ ఆటను డిసైడ్ చేసేది: వేణు స్వామి జోస్యం

IPL 2024 : కావ్య పాప కప్ కొడుతుందా..? ఆమె జాతకమే ఎస్ఆర్‌హెచ్‌ ఆటను డిసైడ్ చేసేది: వేణు స్వామి జోస్యం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ జట్టు ఆటతీరుపై ఆ టీం ఓనర్ కావ్య మారన్ జాతక ప్రభావం వుందని జ్యోతిష్యుడు వేణు స్వామి తెలిపారు. కాబట్టి ఈసారి సన్ రైజర్స్ విజయావకావాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 18 2024, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Venu Swamy

Venu Swamy

హైదరాబాద్ : ఆయన జ్యోతిష్యం చెప్పినా, పూజలు చేయించినా, చివరకు వ్యాపారం చేసినా వివాదాస్పదమే. ఎవరూ అడక్కపోయినా సినీతారలు, రాజకీయ ప్రముఖుల జాతకాలు ఇలా వున్నాయి, అలా వున్నాయని చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ఆ జ్యోతిష్యుడు. అతడు చెప్పినవి నిజం అవుతాయో లేదో తెలీదుగానీ అతడు చెప్పే జాతకాలు మాత్రం వివాదం కావడం పక్కా. ఇలా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా కనిపిస్తూ పాపులర్ అయ్యారు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి. ఇప్పుడు సినిమాలు, రాజకీయ జాతకాలు వదిలేసి స్పోర్ట్స్ పై పడ్డారాయన. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Venu Swamy

Venu Swamy

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐపిఎస్ 2024 గురించి మాట్లాడారు వేణుస్వామి. గంతకు ముందు సీజన్లలో బాగా తడబడ్డ తెలుగు టీం సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో మాత్రం అదరగొడుతోంది. అటు ధనాధన్ బ్యాటింగ్ తో రికార్డులు సృష్టించడంతో పాటు డీసెండ్ బౌలింగ్, కళ్లుచెదిరే ఫీల్డింగ్ తో  ఎస్ఆర్‌హెచ్‌ ఆటగాళ్ళు అదరగొడుతున్నారు. దీంతో ఈసారి హైదరాబాద్ జట్టు టైటిల్ రేసులో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో సన్ రైజర్స్ ఆటగాళ్ల ప్రదర్శనకు ఓనర్ కావ్య మారన్ జాతకంలో లింక్ పెట్టాడు వేణు స్వామి. 

36
Kavya Maran

Kavya Maran

గతంలో సన్ రైజర్స్ టీం యజమాని కావ్య మారన్ జాతకం బాగాలేదని ... అందువల్లే ఆ టీం ప్రదర్శన డిజాస్టర్ గా వుందన్నారు. కానీ ప్రస్తుతం ఆమె జాతకం చాలా బాగుందని... మంచి యోగం వుందన్నారు. ఆమెది మిథున రాశి... ఆ రాశివారికి ఈ ఏడాది బాగున్నట్లుగా వేణుస్వామి పేర్కొన్నారు. కాబట్టి ఆమె యజమానిగా వున్న సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆడుతోందని వేణుస్వామి తెలిపారు. 

46
SRH

SRH

ఇప్పటివరకు జరిగిన ఐపిఎల్ టోర్నీలో ఎస్ఆర్‌హెచ్‌ మంచి మంచి జట్లను ఓడించి విజయం సాధించింది. ఇలా ఇప్పటివరకే మహేంద్ర సింగ్ ధోని వున్న చెన్నై సూపర్ కింగ్స్, రోహిత్ శర్మ వున్న ముంబై ఇండియన్స్ ను, విరాట్ కోహ్లీ కలిగివున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కూడా ఎస్ఆర్‌హెచ్‌ ఓడించింది. ఇదంతా కావ్య మారన్ జాతక ప్రభావమేనని వేణుస్వామి తెలిపారు. 
 

56
Abhishek Sharma

Abhishek Sharma

ఇక సన్ రైజర్స్ ప్లేయర్ అభిషేక్ శర్మను వేణుస్వామి ఆకాశానికి ఎత్తేసారు. మైదానంలో దిగి సిక్సర్లు, ఫోర్లు బాదుతూ అతితక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధిస్తున్న అతడిని ఆపడం ఎవరితరం కాదన్నారు. అభిషేక్ ఆడుతుంటే ఎంత తోపు ఆటగాళ్లయినా చూస్తూ వుండిపోవాల్సిందేనని అన్నారు. అతడి బ్యాట్ నుండి పరుగుల ప్రవాహం పారుతుంటే ఎస్ఆర్‌హెచ్‌ విజయాన్ని ఆపలేమన్నారు. 

66
SRH

SRH

మొత్తంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును, యువ ప్లేయర్ అభిషేక్ శర్మను వేణుస్వామి ప్రశంసించారు. అలాగే ఎస్ఆర్‌హెచ్‌ యజమాని కావ్య మారన్ జాతకం అద్భుతంగా వుందని చెబుతున్నారు. ఇలా వేణుస్వామి మాటలు వింటుంటే ఈసారి ఐపిఎల్ ట్రోపీ ఎస్ఆర్‌హెచ్‌ దే అని పరోక్షంగా కన్ఫర్మ్ చేసినట్లుగా వుంది. ఏదేమైనా వేణుస్వామి మాటలు ఎస్ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాయి. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు ది బిగ్ షో గుడ్ బై.. గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ కు కారణం ఏమిటి?
Recommended image2
IPL 2027: రూ.14 కోట్ల ప్లేయర్ కు సీఎస్కే గుడ్ బై.. ధోని టీమ్ ఏం ప్లాన్ చేస్తోంది?
Recommended image3
ఐదో టీ20లో భారత్‌కు ఓటమి.. 3-2తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved