ఇండియా- శ్రీలంక వన్డే మ్యాచ్ చూసేందుకు సెలవిచ్చిన ప్రభుత్వం... ఈ మ్యాచ్‌కి కూడా ఇంత క్రేజా?
శ్రీలంకతో టీ20 సిరీస్‌ని 2-1 తేడాతో సొంతం చేసుకున్న భారత జట్టు, వన్డే సిరీస్‌కి సిద్ధమవుతోంది. జనవరి 10 నుంచి మొదలయ్యే వన్డే సిరీస్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి మొదటి సన్నాహకంగా మారింది. టీ20 సిరీస్‌కి దూరంగా ఉన్న సీనియర్లు వన్డే సిరీస్‌లో బరిలో దిగబోతున్నారు..
భారత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలతో పాటు భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా కూడా వన్డే సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ కూడా వన్డే సిరీస్‌లో ఆడబోతున్నారు..
Jasprit Bumrah
గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత జట్టుకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా... నాలుగు నెలల తర్వాత వన్డే సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలాగే రవీంద్ర జడేజా కూడా వన్డే సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇస్తాడని భావించినా అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు...
టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత వన్డే సిరీస్‌లను పట్టించుకోవడం మానేశారు జనాలు. భారత జట్టు కూడా టెస్టులు, టీ20లకు ఇచ్చిన ప్రాధాన్యం వన్డేలకు ఇవ్వడం లేదు. గత రెండేళ్లలో కలిపి డజను వన్డే సిరీసులు కూడా ఆడలేదు భారత జట్టు...
అయితే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ నేపథ్యంలో ఈ ఏడాది పూర్తిగా వన్డేలపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యింది బీసీసీఐ. బంగ్లాతో మూడో వన్డేలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేయడంతో రోహిత్‌తో కలిసి ఎవరు ఓపెనింగ్ చేస్తారనే విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది...
తాజాగా ఇండియా- శ్రీలంక మధ్య మొదటి వన్డే మ్యాచ్ చూసేందుకు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పూట సెలవు ప్రకటించిందట. అస్సాంలోని కామ్‌రప్ మెట్రోపాలిటిన్ జిల్లాలో మ్యాచ్ చూసేందుకు హాఫ్ డే సెలవు ప్రకటించినట్టు సమాచారం..
అస్సాంలోని గౌహతిలో బర్సపరా స్టేడియంలో ఇండియా వర్సెస్ శ్రీలంక మొదటి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా జనాలు వస్తారని అంచనా వేసిన అస్సాం ప్రభుత్వం, వారి కోసం హాఫ్ డే హాలీ డే ప్రకటించేసింది..
ind vs sri
వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అయితే సెలవు ఇచ్చినా అనుకోవచ్చు కానీ మరీ శ్రీలంకతో వన్డే మ్యాచ్‌కి సెలవు ఇవ్వడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కొందరు అభిమానులు..