MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • శ్రీలంక vs పాకిస్తాన్ : డూ ఆర్ డై మ్యాచ్.. గెలిచేది ఎవరు?

శ్రీలంక vs పాకిస్తాన్ : డూ ఆర్ డై మ్యాచ్.. గెలిచేది ఎవరు?

Pakistan vs Sri Lanka : ఆసియా కప్ టోర్నీ సూపర్-4 లో కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డైగా మారింది. గెలిచిన జట్టుకు ఫైనల్ అవకాశాలు మిగిలి ఉంటాయి. గెలిచేది ఎవరు?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 23 2025, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
శ్రీలంక పాకిస్థాన్: సూపర్ 4లో డూ ఆర్ డై పోరు
Image Credit : Getty

శ్రీలంక-పాకిస్థాన్: సూపర్-4లో డూ ఆర్ డై పోరు

ఆసియా కప్ 2025 సూపర్-4 లో పాకిస్తాన్, శ్రీలంకా జట్లు మంగళవారం పోటీ పడుతున్నాయి. యూఏఈలోని అబుదాబి షేక్ జాయెద్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌ను ఇరు జట్లకు మస్ట్ విన్ అని చెప్పొచ్చు. ఓడిన జట్టుకు ఫైనల్‌లో చేరే అవకాశాలు దాదాపు పూర్తిగా ముగిసిపోతాయి. సూపర్ 4 లో రెండు జట్లు కూడా తమ మొదటి మ్యాచ్‌లను గెలుచుకోలేదు. పాకిస్తాన్ భారత్ చేతిలో, శ్రీలంక బంగ్లాదేశ్ చేతిలో ఓడింది. అందుకే ఈ పోరు పాక్, శ్రీలంకలకు డూ ఆర్ డై గా మారింది.

26
పాకిస్తాన్ జట్టు ముందున్న సవాళ్లు ఏంటి?
Image Credit : X/@sony_tark_

పాకిస్తాన్ జట్టు ముందున్న సవాళ్లు ఏంటి?

పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్ చాలా ఒత్తిడితో కూడుకున్నది. ఎందుకంటే వారి బ్యాటింగ్ విభాగంలో స్థిరత్వం లేదు. ఓపెనర్లు వరుసగా విఫలమవుతున్నారు. పెద్ద ఇన్నింగ్స్ లను ఆడటం లేదు. అలాగే, మిడిలార్డర్ నుంచి కూడా రన్స్ రావడం లేదు. 

బౌలింగ్‌లో శాహీన్ అఫ్రిదీ, హారిస్ రౌఫ్‌లు గొప్ప ఫామ్‌లో లేరు. భారత్ మ్యాచ్‌లో చివరి ఓవర్లలో బౌలర్ల నియంత్రణ కోల్పోవడం వారిని దెబ్బకొట్టింది. ఈ అంశాలన్నీ కలిపి పాక్ కు గట్టి సవాళ్లుగా ఉన్నాయి. 

Related Articles

Related image1
ఆ ఓవరాక్షనే వద్దనేది.. హారిస్ రౌఫ్ భార్యకు దిమ్మదిరిగింది !
Related image2
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ vs పాక్ తలపడే ఛాన్స్ ఉందా?
36
శ్రీలంకా పాక్ ముందు నిలిచేనా?
Image Credit : X/ACCMedia1

శ్రీలంకా పాక్ ముందు నిలిచేనా?

శ్రీలంక కూడా ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ తో ఇబ్బంది పడుతోంది. వారి బ్యాటింగ్ లైనప్‌లో సమన్వయం లేకపోవడం జట్టుకు నష్టం కలిగిస్తోంది. యువ ఆటగాళ్లు ఒత్తిడి సమయంలో తడబడుతున్నారు. బౌలింగ్‌లో హసరంగ, దసున్ శానక ఫామ్‌లోకి రావాలి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్లలో రాణించడంలో విఫలమయ్యారు. ఈ లోపాలను అధిగమించకపోతే లంక జట్టుకు ఫైనల్ రేసు కష్టమవుతుంది.

46
పాకిస్తాన్ vs శ్రీలంక: పిచ్, టాస్, డ్యూ ప్రభావం ఎలా ఉంటుంది?
Image Credit : Getty

పాకిస్తాన్ vs శ్రీలంక: పిచ్, టాస్, డ్యూ ప్రభావం ఎలా ఉంటుంది?

షేక్ జాయెద్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం మ్యాచ్‌లలో డ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 165 నుంచి 175 మధ్య స్కోరు చేస్తే మ్యాచ్ ను తమవైపు నిలుపుకోవచ్చు. డ్యూ కారణంగా చాలా జట్లు టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో టాస్ కూడా ప్రభావం చూపనుంది.

56
పాకిస్తాన్ vs శ్రీలంక: లైవ్ ఎక్కడ చూడొచ్చు?
Image Credit : Getty

పాకిస్తాన్ vs శ్రీలంక: లైవ్ ఎక్కడ చూడొచ్చు?

ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. Sony Sports, Sony Liv, FanCode, YuppTV ప్లాట్‌ఫామ్ లలో లైవ్ అందుబాటులో ఉంటుంది.

66
పాకిస్తాన్ vs శ్రీలంక: ఎవరు గెలుస్తారు?
Image Credit : stockPhoto

పాకిస్తాన్ vs శ్రీలంక: ఎవరు గెలుస్తారు?

పాకిస్తాన్ vs శ్రీలంక హెడ్ టు హెడ్ రికార్డులో పాకిస్తాన్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. కానీ గత కొన్ని సిరీస్‌లలో శ్రీలంక పాక్‌పై మంచి ప్రదర్శన చేసింది. పాక్ బలమైన ఫాస్ట్ బౌలింగ్‌తో వస్తోంది. లంకా స్పిన్ బౌలింగ్‌లో బలంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గత రికార్డులు, తాజా ఫామ్ గమనిస్తే ఇరు జట్ల మధ్య మంచి పోటీ ఉంటుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
పాకిస్తాన్
ఆసియా కప్ 2025
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India : గంభీర్ టార్గెట్‌గా పాక్ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్.. టీమిండియాలో పాలిటిక్స్ నిజమేనా?
Recommended image2
ఇషాన్ కిషన్ నెట్ వర్త్ ఎంతో తెలుసా? మతిపోగొట్టే కార్ కలెక్షన్
Recommended image3
T20 World Cup 2026 : రింకూ సింగ్‌ను పక్కన పెట్టాల్సిందేనా? సెమీస్ చేరాలంటే భారత్ ఏం చేయాలి?
Related Stories
Recommended image1
ఆ ఓవరాక్షనే వద్దనేది.. హారిస్ రౌఫ్ భార్యకు దిమ్మదిరిగింది !
Recommended image2
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ vs పాక్ తలపడే ఛాన్స్ ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved