ఆసియా కప్ 2025: కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ మ్యాజిక్.. 57 పరుగులకే కుప్పకూలిన యూఏఈ
Asia Cup 2025, IND vs UAE: కుల్దీప్ యాదవ్ ఒకేఓవర్ లో హ్యాట్రిక్ వికెట్ల బౌలింగ్‌తో యూఏఈ కుప్పకూలింది. భారత్ బౌలర్ల దాడి ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 57 పరుగులకే ఆలౌట్ అయింది.

ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్ లో భారత బౌలర్ల విశ్వరూపం
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన భారత్ vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కొత్తగా ఉందని, వాతావరణం తేమగా ఉండటంతో బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని ఆయన తెలిపారు.
భారత జట్టులో అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీమ్ కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ చేయాలని అనుకున్నట్టు చెప్పారు. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు దుమ్మురేపే ప్రదర్శన ఇచ్చారు. దీంతో యూఏఈ 57 పరుగులకే ఆలౌట్ అయింది.
పవర్‌ప్లేలో యూఏఈ దూకుడు
అలీషాన్ శరఫు దూకుడుగా ఆడుతూ యూఏఈకి మంచి ఆరంభం ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా తొలి ఓవర్‌లో 10 పరుగులు ఇచ్చాడు. అక్షర్ 9 పరుగులు ఇచ్చాడు. కానీ 3.4 ఓవర్లో బుమ్రా తన పర్ఫెక్ట్ యార్కర్‌తో శరఫును (22) బౌల్డ్ చేశాడు. 4.4 ఓవర్లో వరుణ్ చక్రవర్తి జొహైబ్ (2)ను ఔట్ చేశాడు. పవర్‌ప్లేలో యూఏఈ స్కోర్ కొంత బాగానే ఉన్నప్పటికీ, కీలక వికెట్లు కోల్పోయింది. బుమ్రా మూడో ఓవర్‌లో వసీమ్ వరుసగా మూడు ఫోర్లు బాదినా, యూఏఈ ఒత్తిడి నుంచి బయటపడలేకపోయింది.
It's Jasprit Bumrah and it's a Timber Strike ⚡️
First success with the ball for #TeamIndia! 👏 👏
Follow The Match ▶️ https://t.co/Bmq1j2LGnG#AsiaCup2025 | #INDvUAE | @Jaspritbumrah93pic.twitter.com/q2S0iTg6iE— BCCI (@BCCI) September 10, 2025
కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ స్పెల్
8.1 ఓవర్లో కుల్దీప్ యాదవ్ తొలి వికెట్ సాధించాడు. రాహుల్ చోప్రా (3) ఔట్ అయ్యాడు. అదే ఓవర్‌లో కెప్టెన్ మహ్మద్ వసీమ్ (19)ను కూడా వెనక్కి పంపించాడు. ఒకే ఓవర్ (9వ ఓవర్)లో హ్యాట్రిక్ మాదిరిగా మూడు వికెట్లు తీసి యూఏఈని కోలుకోని దెబ్బకొట్టాడు. హర్షిత్ కౌశిక్ (2)ను బౌల్డ్ చేస్తూ తన మూడో వికెట్ సాధించాడు. ఆ ఓవర్ స్కోర్‌కార్డ్ W 1 0 W 2 W. కుల్దీప్ 2.1 ఓవర్లలో 7 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
𝙄𝙣𝙣𝙞𝙣𝙜𝙨 𝘽𝙧𝙚𝙖𝙠!
Stunning bowling display from #TeamIndia! 🔥
4⃣ wickets for Kuldeep Yadav
3⃣ wickets for Shivam Dube
1⃣ wicket each for Varun Chakaravarthy, Axar Patel & Jasprit Bumrah
Scorecard ▶️ https://t.co/Bmq1j2LGnG#AsiaCup2025 | #INDvUAEpic.twitter.com/cvs2anfip6— BCCI (@BCCI) September 10, 2025
యూఏఈ పై శివమ్ దూబే దెబ్బ
కుల్దీప్ యాదవ్ తర్వాత శివమ్ దూబే కూడా బౌలింగ్‌లో మెరుపులు మెరిపించాడు. అద్భుతమైన బౌలింగ్ తో అసిఫ్ ఖాన్ (53/7)ను సంజు శాంసన్ చేతిలో క్యాచ్ ఆడేలా చేసి అవుట్ చేశాడు. అతను తన రెండు ఓవర్లలో కేవలం 4 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు సాధించాడు.
Shivam Dube & Axar Patel have joined the wicket-taking party! 🤝
UAE 8⃣ down.
Follow The Match ▶️ https://t.co/Bmq1j2LGnG#TeamIndia | #AsiaCup2025 | #INDvUAE | @IamShivamDube | @akshar2026pic.twitter.com/g8eV2hDSbi— BCCI (@BCCI) September 10, 2025
57 పరుగులకు యూఏఈ ఇన్నింగ్స్ ముగింపు
బుమ్రా (1 వికెట్), వరుణ్ చక్రవర్తి (1 వికెట్), కుల్దీప్ యాదవ్ (4 వికెట్లు), శివమ్ దూబే (3 వికెట్లు) సమిష్టి ప్రదర్శనతో యూఏఈ బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. మొత్తం 13.1 ఓవర్లలో యుఏఈ 57 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పుడు భారత్ ముందు లక్ష్యం కేవలం 58 పరుగులు మాత్రమే. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ స్పెల్ భారత్ ఆధిపత్యానికి బాటలు వేసింది.
One way traffic 🔴
India steamroll their way in the first essay, knocking over UAE for a paltry 57.
Will 🇦🇪 make it difficult for the Indian batter?#INDvUAE#DPWorldAsiaCup2025#ACCpic.twitter.com/xa6QC4QjRh— AsianCricketCouncil (@ACCMedia1) September 10, 2025