MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మనకంటే శ్రీలంక బోర్డు చాలా బెటర్... హెయిర్ డ్రైయర్స్, ఇస్త్రీ పెట్టెలకు బదులుగా..

మనకంటే శ్రీలంక బోర్డు చాలా బెటర్... హెయిర్ డ్రైయర్స్, ఇస్త్రీ పెట్టెలకు బదులుగా..

వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా పేరు తప్ప, బీసీసీఐ పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదు. స్టేడియాల్లో వసతులు, సీట్ల పరిస్థితి చూస్తే అధ్వాన్నం అనే పదం కూడా చిన్నదైపోతుంది. తాజాగా ఆసియా కప్ 2023 టోర్నీ, బీసీసీఐపై మరోసారి విమర్శలు రావడానికి కారణమవుతోంది..  

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 10 2023, 09:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్‌లో జరిగిన అన్ని మ్యాచులు సజావుగా ముగిశాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో మాత్రం సాంకేతిక కారణాలతో ఆట పావుగంట సేపు ఆగిపోయింది..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

లాహోర్‌లోని ఓ ఫ్లడ్ లైట్ పనిచేయకపోవడం వల్ల ఆటకు అంతరాయం కలిగింది. అయితే పాక్ క్రికెట్ బోర్డు, లాహోర్ ఎలక్ట్రిసిటీ బోర్డుకు బకాయిలు కట్టకపోవడం వల్లే కరెంటు నిలిపివేసినట్టు సమాచారం. అయితే పావుగంటలో పావు వంతు బకాయిలు చెల్లించడంతో మళ్లీ పవర్ సప్లై చేసినట్టు వార్తలు వచ్చాయి..
 

37

పాక్ క్రికెట్ బోర్డు పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. పాక్ ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు. అయినా పాక్ సూపర్ లీగ్‌లో పిచ్‌ని ఆరబెట్టేందుకు ఏకంగా హెలికాఫ్టర్‌లను వాడింది పీసీబీ..  ఆ ఫోటోలను చూసి లక్ష కోట్ల బ్రాండ్ వాల్యూ ఉన్న ఐపీఎల్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు..

47
Wet Pitch

Wet Pitch

అయితే బీసీసీఐ కేవలం ఐపీఎల్ మీడియా రైట్స్ ద్వారానే రూ.43 వేల కోట్లు ఖాతాలో వేసుకుంది. అలాంటి బీసీసీఐ, గ్రౌండ్‌లో అవుట్ ఫీల్డ్ ఆరబెట్టేందుకు హెయిర్ డ్రైయర్లు, ఇస్త్రీ పెట్టెలు వాడింది..

57

ఆర్థిక మాంద్యంతో ఆసియా కప్ 2022 టోర్నీని యూఏఈకి తరలించిన శ్రీలంక క్రికెట్ బోర్డు మాత్రం అవుట్ ఫీల్డ్ ఆరబెట్టేందుకు బీసీసీఐ కంటే అధునాతన పద్ధతులను వాడింది... బీసీసీఐ గ్రౌండ్‌లో నిలిచిన నీటిని తీసేందుకు స్పంజీలను వాడుతోంది..
 

67

కానీ లంక క్రికెట్ బోర్డు, బీసీసీఐ కంటే బెటర్ షీట్లను వాడింది. అలాగే తడిగా ఉన్న అవుట్ ఫీల్డ్‌ని ఆరబెట్టేందుకు గ్రౌండ్‌లోకి ఫ్యాన్స్‌ను తీసుకొచ్చింది. దీని కంటే త్వరగానే పిచ్ సిద్ధమైంది కూడా...

77

వచ్చే నెలలో ఇండయాలో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం దేశంలోని స్టేడియాలన్నింటిలో మరమ్మత్తులు చేస్తోంది బీసీసీఐ. వరల్డ్ కప్‌లో హెయిర్ డ్రైయర్స్, ఇస్త్రీ పెట్టెలు కనిపిస్తే మాత్రం, బీసీసీఐ పరువుతో పాటు దేశం పరువు పోవడం ఖాయం..

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gen Z cricketers India: రోహిత్, కోహ్లీ తర్వాత వీళ్లే కింగ్స్.. వీళ్ల సంపాదన చూస్తే దిమ్మతిరిగిపోతుంది భయ్యా!
Recommended image2
Abhishek Sharma Weakness: అభిషేక్ శర్మ సీక్రెట్ లీక్? విండీస్ బౌలర్లు పట్టిన వీక్ పాయింట్ ఇదే
Recommended image3
IPL 2027 Auction: 4 ఏళ్ల తర్వాత ఇండియాకి ఐపీఎల్ ఆక్షన్.. గోవాలో వేలం తేదీ ఫిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved