అతనొక్కడూ ఉండి ఉంటే విజయం మాదే... షాహీన్ ఆఫ్రిదీపై షోయబ్ మాలిక్ కామెంట్...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాక్ చేతుల్లో ఎదురైన పరాభవానికి ఏడాది తర్వాత ప్రతీకారం తీర్చుకుంది భారత జట్టు. ఆసియా కప్ 2022 టోర్నీలో పాక్‌పై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది టీమిండియా. 148 పరుగుల లక్ష్యఛేదనలో 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు, ఆఖరి ఓవర్‌లో గెలిచి స్వీట్ రివెంజ్ తీర్చుకుంది...

bhuvneshwar
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మహమ్మద్ రిజ్వాన్ 43 పరుగులతో పాక్ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలవగా హార్ధిక్ పాండ్యా 3, భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీశారు...
hardik
148 పరుగుల లక్ష్యఛేదనలో కెఎల్ రాహుల్ డకౌట్ కాగా రోహిత్ శర్మ 12 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 35, రవీంద్ర జడేజా 35, సూర్యకుమార్ యాదవ్ 18 చేసి అవుట్ కాగా హార్ధిక్ పాండ్యా 33 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు...
Shoaib Malik
అయితే తమ టీమ్‌లో ఒక్క ప్లేయర్ ఉంటే తామే గెలిచేవాళ్లమని షాకింగ్ కామెంట్లు చేశాడు పాక్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్. ‘మనం ఓ ప్లేయర్‌ని బాగా మిస్ అవుతున్నాం... ’ అంటూ తన పక్కనే ఉన్న షాహీద్ షా ఆఫ్రిదీని చూపించాడు షోయబ్ మాలిక్...
shaheen
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అవుట్ చేసిన షాహీన్ షా ఆఫ్రిదీ... పాక్‌కి ఐసీసీ వరల్డ్ కప్ ఈవెంట్లలో టీమిండియాపై మొట్టమొదటి విజయం దక్కడంలో కీలక పాత్ర పోషించాడు...
మోకాలి గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమయ్యాడు షాహీన్ షా ఆఫ్రిదీ. అతను లేకపోయినా పాక్ బౌలర్లు నసీం షా, దహీనీ, హరీస్ రౌఫ్, షాదబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు...
shaheen
148 పరుగుల లక్ష్యఛేదనలో భారత జట్టు ఆఖరి ఓవర్ నాలుగో బంతి వరకూ బ్యాటింగ్ చేసింది. షాహీన్ ఆఫ్రిదీ ఉండి ఉంటే టీమిండియాకి మరోసారి ఓటమి దక్కేదని కామెంట్లు చేస్తూ, పోస్టులు పెడుతున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్...