- Home
- Sports
- Cricket
- ఆసియా కప్ 2018లో అట్టర్‌ఫ్లాప్... ఇప్పుడు వాళ్లపైనే బోలెడు ఆశలు పెట్టుకున్న టీమిండియా...
ఆసియా కప్ 2018లో అట్టర్‌ఫ్లాప్... ఇప్పుడు వాళ్లపైనే బోలెడు ఆశలు పెట్టుకున్న టీమిండియా...
ఆసియా కప్ 2022 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగుతోంది భారత జట్టు. 2018లో టీమిండియాకి టైటిల్ అందించిన రోహిత్ శర్మ ఈసారి కూడా భారత జట్టుకి సారథిగా వ్యవహరించబోతున్నాడు. గత ఆసియా కప్ ఆరంభానికి ముందు పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లీ, ఆ ఎడిషన్‌కి దూరంగా ఉన్నాడు. ఆ సీజన్‌లో ఆడిన కొందరు ప్లేయర్లు, 2022 ఆసియా కప్‌లోనూ ఆడబోతున్నారు...

ఆసియా కప్ 2018 (వన్డే ఫార్మాట్) టోర్నీలో 5 మ్యాచుల్లో 2 సెంచరీలతో 342 పరుగులు చేసిన శిఖర్ ధావన్, ఈసారి ఆసియా కప్ ఆడడం లేదు. గబ్బర్‌ని టీ20లకు దూరంగా పెట్టిన టీమిండియా, వన్డేల్లో మాత్రమే కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ, గత ఆసియా కప్‌లో 105.67 సగటుతో 317 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
Image credit: PTI
గత సీజన్‌లో మిడిల్ ఆర్డర్‌లో 175 పరుగులు చేసిన అంబటి రాయుడు, ఈ సీజన్‌లో జట్టుకి అందుబాటులో లేడు. అయితే దినేశ్ కార్తీక్ మాత్రం అన్యూహ్యంగా జట్టులోకి వచ్చాడు. 2018 ఎడిషన్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో 146 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, ఈసారి టీమిండియాకి ఫినిషర్ రోల్ పోషించబోతున్నాడు...
కెఎల్ రాహుల్‌కి గత ఎడిషన్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన కెఎల్ రాహుల్ 60 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈసారి కెఎల్ రాహుల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత బ్యాటు పట్టిన కెఎల్ రాహుల్, జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో పెద్దగా మెరుపులు మెరిపించలేదు...
Image credit: PTI
అయితే ఈసారి ఆసియా కప్ 2022 టోర్నీకి వైస్ కెప్టెన్‌గా ఎంపికైన కెఎల్ రాహుల్, ఓ రేంజ్‌లో ఇరగదీస్తాడని భావిస్తోంది బీసీసీఐ. ఏదైనా అనుకోని కారణాల వల్ల రోహిత్ శర్మ ఆడలేకపోతే వైస్ కెప్టెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్ కెప్టెన్సీలోనే ఆసియా కప్ ఆడాల్సి ఉంటుంది భారత జట్టు...
గత సీజన్‌లో టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కుల్దీప్ యాదవ్. 2018 ఎడిషన్‌లో 6 మ్యాచుల్లో 10 వికెట్లు పడగొట్టాడు కుల్దీప్. అలాగే జస్ప్రిత్ బుమ్రా 4 మ్యాచులు ఆడి 8 వికెట్లు తీశాడు. ఈ ఇద్దరూ ఈసారి బరిలో దిగడం లేదు. బుమ్రా గాయం కారణంగా ఆసియా కప్‌కి దూరం కాగా, కుల్దీప్ యాదవ్‌కి ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదు...
Ravindra Jadeja
గత ఎడిషన్‌లో 4 మ్యాచుల్లో 7 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా, బ్యాటుతో కూడా పెద్దగా మెప్పించలేకపోయాడు. అయితే ఈసారి జడ్డూపై బోలెడు ఆశలు పెట్టుకుంది భారత జట్టు. ముఖ్యంగా అతని బ్యాటు నుంచి మెరుపులు చూడాలని ఆశిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. ఐపీఎల్ 2022లో అట్టర్ ఫ్లాప్ పర్పామెన్స్ ఇచ్చిన జడ్డూ... ఈసారి ఆల్‌రౌండర్‌గా అదరగొట్టాలని అనుకుంటున్నాడు...
గత ఆసియా కప్‌లో 5 మ్యాచులు ఆడిన భువనేశ్వర్ కుమార్, 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ వంటి ప్లేయర్లు లేకపోవడంతో సీనియర్ భువీపై అదనపు బాధ్యతలు పడ్డాయి. ఇప్పుడు భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని నడిపించాల్సిన బాధ్యత భువీదే...
Image credit: PTI
ఆసియా కప్ 2022లో యజ్వేంద్ర చాహాల్ 5 మ్యాచులు ఆడి 6 వికెట్లు మాత్రమే తీశాడు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో చోటు దక్కించుకోలేకపోయిన చాహాల్, ఈసారి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడాలంటే మధ్యలో ఉన్న ఆసియా కప్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వాల్సిందే...