పాకిస్తాన్‌కి ఛాన్సే లేదు.. ఈసారి ఆసియా కప్ ఫైనల్ చేరేది ఈ రెండు జట్లేనా...
ఆసియా కప్ 2022 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగింది టీమిండియా. భారత జట్టు 7 సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిస్తే, 5 సార్లు టైటిల్ గెలిచిన శ్రీలంక పెద్దగా ఫామ్‌లో లేదు. సీనియర్లు రిటైర్ అయిన తర్వాత అరకోర విజయాలు అందుకోవడానికే ఆపసోపాలు పడుతోంది లంక.
afghanistan
శ్రీలంక పెద్దగా ఫామ్‌లో లేకపోవడం, సంచలన విజయాలు అందుకుని టాప్ టీమ్స్‌కి షాక్ ఇచ్చే బంగ్లాదేశ్ పరిస్థితి కూడా బాగోలేకపోవడంతో ఈసారి ఆసియా కప్‌లో భారత్, పాక్ మధ్యే ఫైనల్ జరుగుతుందని అనుకున్నారంతా... కానీ అన్యూహ్యంగా రేసులోకి దూసుకొచ్చింది ఆఫ్ఘనిస్తాన్...
Image credit: Getty
గ్రూప్ బీలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై ఘన విజయాలు అందుకున్న ఆఫ్ఘనిస్తాన్, ఆసియా కప్ 2022లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. దీంతో ఆఫ్ఘాన్ చేతుల్లో పాక్ ఓటమి ఖాయమని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...
Afghanistan
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని 105 పరుగులకి ఆలౌట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్, ఆ లక్ష్యాన్ని 11 ఓవర్లలో ఊది పడేసింది. పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసిన ఆఫ్ఘాన్, మిగిలిన టీమ్స్‌కి గట్టి హెచ్చరికలే జారీ చేసింది...
Afghanistan
ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ ఆఫ్ఘాన్ ఇరగదీసే పర్ఫామెన్స్ ఇచ్చింది. 128 పరుగుల టార్గెట్‌ని 19 ఓవర్లలో ఛేదించిన ఆఫ్ఘాన్, ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్లింది. నజబుల్లా జాడ్రాన్ 17 బంతుల్లో 6 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 43 పరుగులు చేసి ఇరగదీశాడు...
india
ఈ పర్ఫామెన్స్‌తో భారత్, పాక్ టీమ్స్‌కి గట్టి పోటీగా తయారైంది ఆఫ్ఘనిస్తాన్. టీ20ల్లో ఆఫ్ఘాన్‌కి ఘనమైన రికార్డు ఉంది. ఆ టీమ్‌లో మ్యాచ్ విన్నర్లకు కూడా కొదవ లేదు. దీంతో ఆఫ్ఘాన్ తలుచుకుంటే పాక్‌ని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...
Getty
టీమిండియా స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇస్తే, ఆసియా కప్ 2022 ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ కాకుండా భారత్, ఆఫ్ఘనిస్తాన్ చూసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. అయితే పాకిస్తాన్‌ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు... ఓసారి అలా తక్కువ అంచనా వేసి భారీ మూల్యం చెల్లించుకున్న టీమిండియా, దాన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఆడాలని అంటున్నారు ఫ్యాన్స్..