MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • ఉస్మాన్ ఖవాజా అరుదైన రికార్డు.. ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఓపెనర్

ఉస్మాన్ ఖవాజా అరుదైన రికార్డు.. ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఓపెనర్

Ashes 2023: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.  ఈ టెస్టులో అతడు ప్రతీ రోజు బ్యాటింగ్ చేశాడు. 

2 Min read
Author : Srinivas M
| Updated : Jun 21 2023, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image credit: PTI

Image credit: PTI

టీ20ల యుగంలో టెస్టు మ్యాచ్ లు ఆడేవారే కరువయ్యారంటే   ఒక  బ్యాటర్  ఐదు రోజుల పాటు  బ్యాటింగ్ చేయడం గమనార్హం.    సెంచరీలు,  డబుల్ సెంచరీలు కూడా మంచినీళ్లు తాగిన చందంగా బాదుతూ  అవి ముగిసిన వెంటనే  పెవిలియన్‌కు చేరుతున్న  ఈ కాలంలో  ఓ బ్యాటర్ ఐదు రోజులు బ్యాటింగ్ చేయడం కచ్చితంగా విశేషమే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆ అరుదైన ఘనతను   ఆసీస్  ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అందుకున్నాడు.  యాషెస్ టెస్టు సిరీస్ లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా  ముగిసిన తొలి టెస్టులో  ఖవాజా ఐదు రోజులూ బ్యాటింగ్ చేశాడు.  ఈ క్రమంలో అతడు అరుదైన రికార్డును  సొంతం చేసుకున్నాడు. 

37

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ తొలి రోజు 78 ఓవర్లు ఆడి ఫస్ట్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా నాలుగు ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.  తొలి రోజు ఖవాజా మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు సాధించాడు.  రెండో రోజు..  రోజంతా బ్యాటింగ్ చేసి  126 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 

47

మూడో రోజు అదే ఆటను కొనసాగిస్తూ తొలి సెషన్ లో  ఓవర్ నైట్ స్కోరు (126)కు  మరో 15 పరుగులు (141) జోడించి ఔటయ్యాడు.  ఈ రోజు వర్షం కారణంగా మ్యాచ్ రెండో సెషన్ నుంచే రద్దు అయింది. నాలుగో రోజు ఇంగ్లాండ్  రెండో ఇన్నింగ్స్ లో  273 పరుగులకు ఆలౌట్ అయింది.  దీంతో చివరి సెషన్ లో ఆసీస్ మళ్లీ బ్యాటింగ్ కు రావాల్సి వచ్చింది.  

57

నాలుగో రోజు చివరి సెషన్ లో ఖవాజా..  34 పరుగులు చేశాడు. ఐదో రోజు  కూడా దానికి కొనసాగింపుగా బ్యాటింగ్ చేసి మరో 31 పరుగులు జోడించి ఔట్ అయ్యాడు.  మొత్తంగా తొలి ఇన్నింగ్స్ లో 141,  రెండో ఇన్నింగ్స్ లో  65 పరుగులు చేశాడు ఖవాజా.. 

67

ఇలా టెస్టు క్రికెట్ లో ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన  వారిజాబితాలో ఖవాజా 13వవాడు.  భారత్ కు చెందిన  ఎం. జయసింహా, జెఫ్రీ బాయ్‌కాట్ (ఇంగ్లాండ్), కిమ్  హ్యూగ్స్ (ఆసీస్) , అలియన్ లంబ్ (ఇంగ్లాండ్), రవిశాస్త్రి (ఇండియా), ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లాండ్), పీటర్సన్ (సౌతాఫ్రికా)  పుజారా (ఇండియా), బ్రాత్‌వైట్ (న్యూజిలాండ్)  లు ఇంతకుముందు ఈ జాబితాలో ఉన్నారు.

77

అయితే వీరిలో  మ్యాచ్ గెలిచిన  ఆటగాళ్లలో మాత్రం ఇద్దరే ఉండటం గమనార్హం.  జెఫ్రీ బాయ్‌కాట్.. 1977 యాషెస్ సిరీస్ లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా  ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో  ఐదు రోజులూ బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 107 పరుగులు చేసిన బాయ్‌కాట్.. రెండో ఇన్నింగ్స్‌లో 80 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.   ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. తాజాగా  ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో కూడా ఆసీస్.. ఇంగ్లాండ్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో ఖవాజాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుదక్కింది. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved