టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్ కు రంగం సిద్దం, వారెంట్ జారీ... ఎందుకో తెలుసా?
భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన అరెస్ట్ కు పోలీసులు సిద్దమయ్యారు. ఇంతకూ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యేంత తప్పు ఏం చేసారో తెలుసా?
Robin Uthappa
Robin Uthappa : భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అరెస్ట్ కు వారెంట్ జారీ అయ్యింది. ప్రావిడెంట్ ఫండ్(PF) విషయంలో ఈ మాజీ క్రికెటర్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే పీఎఫ్ రిజినల్ కమీషనర్ గోపాల్ రెడ్డి సీరియస్ యాక్షన్ కు సిద్దమయ్యారు. ఆయన ఆదేశాల మేరకు పులకేశినగర్ పోలీసులు రంగంలోకి దిగారు... ఊతప్ప అరెస్ట్ కు సిద్దమయ్యారు.
Robin Uthappa
ఊతప్ప చేసిన నేరమేంటి?
అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపిఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఊతప్ప బిజినెస్ మ్యాన్ గా మారాడు. ప్రస్తుతం సెంచురీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ ప్రైవేట్ కంపనీని నడుపుతున్నారు.
రాబిన్ ఊతప్పకు చెందిన ఈ కంపనీలో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరి సాలరీల్లోంచి ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) పేరుతో డబ్బులు కట్ చేసుకుంటున్నారు... కానీ వాటిని ఆ ఉద్యోగులు పిఎఫ్ ఖాతాలో జరమచేయడంలేదు. ఇలా ఇప్పటివరకు ఉద్యోగులకు చెందిన రూ.23 లక్షల పిఎఫ్ డబ్బులు తన సొంత అకౌంట్లో జమచేసుకున్నారట రాబిన్ ఊతప్ప.
సెంచురీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల పీఎఫ్ డబ్బుల అవకతవకలపై పీఎఫ్ రిజినల్ కమీషనర్ గోపాల్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఈ నెల ఆరంభంలో అంటే డిసెంబర్ 4న రాబిన్ ఊతప్పకు అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కమీషనర్ పోలీసులను ఆదేశించారు. ఇలా టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్ కు రంగం సిద్దం చేసారు.
అయితే ఊతప్ప అడ్రస్ కు పంపిన ఈ అరెస్ట్ వారెంట్ తిరిగి పిఎఫ్ ఆఫీసుకు చేరింది. దీంతో ఊతప్ప ఇళ్లు మారినట్లు గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. చట్టప్రకారం ఊతప్పపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమయ్యారు.
Robin Uthappa
టీమిండియా క్రికెటర్ గా రాబిన్ ఊతప్ప కెరీర్ :
కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాబిన్ ఊతప్ప క్రికెటర్ గా చాలాకాలం టీమిండియాకు సేవలు అందించాడు. 2006లో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి వన్డేలోనే అద్భుతమైన బ్యాటింగ్ తో 86 పరుగులు చేసాడు. దీంతో మొదటి మ్యాచ్ కే మంచి గుర్తింపు వచ్చింది... అతడి టాలెంట్ కు అభిమానులను ఫిదా అయ్యారు.
ఇలా 2006 నుండి 2015 వరకు ఊతప్ప టీమిండియాలో ఆడారు. భారత జట్టు తరపున 46 మ్యాచులు ఆడిన ఊతప్ప 25.94 యావరేజ్ తో 934 పరుగులు చేసాడు. అయితే అతడు మొదటి మ్యాచ్ లో సాధించిన 86 పరుగులే హయ్యెస్ట్ స్కోర్. టీ20 లో ఫార్మాట్ లోకి 2007 లో ఎంట్రీ ఇచ్చిన ఊతప్ప 13 మ్యాచులాడి 249 పరుగులు చేసాడు.
ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడారు ఊతప్పు. అయితే 2022 లో అతడు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత సొంతంగా బిజినెస్ ప్రారంభించారు.