MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అనుష్కను పెళ్లి చేసుకునేందుకు ‘రాహుల్’లా మారిన విరాట్ కోహ్లీ... సీక్రెట్ మ్యారేజ్ వెనక...

అనుష్కను పెళ్లి చేసుకునేందుకు ‘రాహుల్’లా మారిన విరాట్ కోహ్లీ... సీక్రెట్ మ్యారేజ్ వెనక...

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. క్రికెట్ వరల్డ్‌లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే  పెళ్లి ఫోటోలను ఈ సెలబ్రిటీ కపుల్ సోషల్ మీడియాలో షేర్ చేసేదాకా, ఈ విషయం ఎవ్వరికీ తెలీదు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 13 2022, 03:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

2017, డిసెంబర్ 11న ఇటలీలోనీ ఓ విలసవంతమైన రిసార్టులో అతికొద్ది మంది ఆత్మీయులు, స్నేహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ... టీమిండియా కెప్టెన్ పెళ్లికి భారత క్రికెటర్లు ఎవ్వరూ హాజరు కాలేదు...

27

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఢేటింగ్ చేస్తున్నాడని చాలా ఏళ్లు ప్రచారం జరిగింది. బహిరంగంగానే ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే ఈ ఇద్దరి పెళ్లి మాత్రం చాలా సీక్రెట్‌గా జరిగింది...

37

పెళ్లిని సీక్రెట్‌గా ఉంచేందుకు ఏర్పాట్ల సమయంలో మారుపేర్లను వాడారట విరుష్క జోడి. విరాట్ కోహ్లీ తన పేరుకి బదులుగా రాహుల్ అనే పేరుతో పెళ్లి ఏర్పాట్లు చేయాల్సిందిగా తన మేనేజర్‌కి సూచించాడట...

47

అలాగే అనుష్క శర్మ పేరుకు బదులుగా ఐశ్వర్య అని వాడరట. అలా ఎంతో సీక్రెట్‌గా సదరు హోటల్ యాజమాన్యానికి కూడా జరగబోతున్నది భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల పెళ్లి అని తెలియకుండా జాగ్రత్త పడ్డారట...

57

ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టింది విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ. ‘మేం పెళ్లి ఏర్పాట్లు చేసేటప్పుడు ఫేక్ నేమ్స్‌ని వాడాం. విరాట్ కోహ్లీ పేరు రాహుల్, నా పేరు ఐశ్వర్య...’ అంటూ చెప్పుకొచ్చింది అనుష్క...

67

ఈ ఇద్దరూ పెళ్లైన మొదటి ఏడాది కేవలం 28 రోజులే కలిసి ఉన్నారు. సినిమాలతో అనుష్క శర్మ, క్రికెట్ టూర్లతో విరాట్ కోహ్లీ బిజిబిజీగా గడిపేశారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ ఇద్దరూ కలిసి గడిపేందుకు సమయం దొరికింది...

77

కరోనా లాక్‌డౌన్‌ని సరిగ్గా వాడుకున్న విరుష్క జోడీకి, 2021 జనవరి 11న వామిక జన్మించింది. కూతురిని సోషల్ మీడియాకి దూరంగా పెంచాలని నిర్ణయం తీసుకున్న అనుష్క, విరాట్... ఆమె ఫోటోలను బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు... 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Rinku Singh: కేకేఆర్‌కు అతిపెద్ద సమస్యగా మారాడు ! ఏమైంది రింకూ భయ్యా
Recommended image2
Team India : రోహిత్ కంటే డేంజర్.. టీమిండియా ఓపెనర్లుగా ఆ నలుగురు కుర్రాళ్లు రెడీ
Recommended image3
IPL : ఆర్సిబి కెప్టెన్ పాటిదార్ మామూలోడు కాదు.. అతడి నెట్ వర్త్ ఎంతో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved