- Home
- Sports
- Cricket
- కెప్టెన్సీ గురించి చెప్పగానే, ‘యస్... నేను రెడీ’ అన్నాడు! రోహిత్ శర్మ రూమ్‌కి వెళ్లగానే.. - అనిల్ కుంబ్లే
కెప్టెన్సీ గురించి చెప్పగానే, ‘యస్... నేను రెడీ’ అన్నాడు! రోహిత్ శర్మ రూమ్‌కి వెళ్లగానే.. - అనిల్ కుంబ్లే
రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్‌ని రెండు భాగాలుగా విడదీయాలంటే అది ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్ కాకముందు, కెప్టెన్ అయ్యాక అని విడదీయాల్సి ఉంటుంది. అప్పుడెప్పుడో 2007లోనే అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసినా స్థిరమైన స్థానం మాత్రం సంపాదించుకోలేకపోయాడు రోహిత్ శర్మ...

టీమ్‌లోకి వచ్చి పోతూ, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, స్పిన్ ఆల్‌రౌండర్‌గా సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన రోహిత్ శర్మ... ముంబై ఇండియన్స్‌కి ఓపెనర్‌గా మారిన తర్వాత స్టార్ ప్లేయర్‌గా అవతరించాడు. ముంబై ఇండియన్స్‌కి 8 సీజన్లలో ఐదు టైటిల్స్ అందించి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు...
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత టీమిండియాకి త్రీ ఫార్మాట్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రోహిత్ శర్మ. 35 ఏళ్ల లేటు వయసులో రోహిత్‌కి కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం కూడా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతని సక్సెస్ రేటే...
Image credit: IPL
2013లో ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రికీ పాంటింగ్, 6 మ్యాచుల్లో 3 విజయాలు మాత్రమే అందుకున్నాడు. దీంతో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని రికీ పాంటింగ్ నిర్ణయించుకోవడంతో ఆ బాధ్యతలు సీజన్ మధ్యలో రోహిత్ శర్మకు దక్కాయి...
2013లో ముంబై ఇండియన్స్‌కి మెంటర్‌గా వ్యవహరించిన అనిల్ కుంబ్లే, రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఎలా అప్పగించామనే విషయాన్ని బయటపెట్టాడు.
‘2013 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి సరైన ఆరంభం దక్కలేదు. 2009లో రాయల్ ఛాలెంజర్స్ ఎలాగైతే ఆరంభంలో మ్యాచులు ఓడి, ఆ తర్వాత వరుస విజయాలతో ఫైనల్‌కి వెళ్లిందో 2013లో ముంబై విషయంలోనూ అదే జరిగింది. మొదటి నాలుగు మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచాం...
Rohit Sharma
రికీ పాంటింగ్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను ఫామ్‌లో కూడా లేడు. అందుకే కెప్టెన్‌ని మార్చాలని అనుకున్నాం. అప్పుడే వేరే ప్లేయర్‌ని తుది జట్టులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తే, సుదీర్ఘ కాలం టీమ్‌కి కెప్టెన్‌ని వెతకాల్సిన అవసరం ఉండదని నిర్ణయం తీసుకున్నాం..
కోచ్‌గా ఉన్న జాన్ రైట్, బలమైన సపోర్టింగ్ టీమ్‌ని తీసుకొచ్చాడు. టీమ్‌లో మంచి వాతావరణాన్ని నెలకొల్పాడు. రికీ పాంటింగ్ కెరీర్ ఎండింగ్‌లో ఉంది. అతను వరల్డ్ కప్స్ గెలిచాడు. వరల్డ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. అందుకే అతన్ని వేలంలో కొనుగోలు చేశాం..
అయితే అతను ఫామ్‌లో లేక చాలా ఇబ్బంది పడ్డాడు. అతని ప్లేస్‌లో మరో విదేశీ ప్లేయర్‌ని టీమ్‌లోకి తీసుకురావాలనే ఆలోచన వచ్చాకే కెప్టెన్‌ని మార్చాలని నిర్ణయం తీసుకున్నాం. నేను, జాన్ రైట్ కలిసి రోహిత్ శర్మ రూమ్‌కి వెళ్లాం...
కెప్టెన్సీ గురించి చెప్పాగానే.. ‘యస్... ఐ యామ్ రెడీ’ అనేశాడు. ఏ మాత్రం ఆలోచించలేదు. అతని నమ్మకం చూసి ఆశ్చర్యమేసింది. కెప్టెన్‌కి అలాంటి నమ్మకం ఉండాలి. తాను టీమ్‌ని నడిపించగలనని అతనిపై అతనికి పూర్తి నమ్మకం ఉంది. అందుకే అతన్ని ఎంపిక చేశాం...
రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్,కిరన్ పోలార్డ్, లసిత్ మలింగ వంటి సీనియర్ ప్లేయర్లు టీమ్‌లో ఉన్నారు. వాళ్లను కెప్టెన్సీ చేయడమంటే మామూలు విషయం కాదు. అయినా రోహిత్ శర్మ ఏ మాత్రం ఆలోచించలేదు, భయపడలేదు...
రోహిత్ శర్మ టీమ్‌ని నడిపించిన విధానం అద్భుతం. చాలా కూల్‌గా, ఎంతో పక్కాగా, తాను ఏం చేస్తున్నాడో పూర్తి క్లారిటీతో చేశాడు. అతను పట్టిందల్లా బంగారం అయ్యింది. అయితే ఆ విజయాల్లో జాన్ రైట్ పాత్ర కూడా చాలా ఉంది. గెలవడానికి కావాల్సిన అన్ని దినుసులను అతను, రోహిత్ శర్మకు సమకూర్చి పెట్టాడు...
ముంబై ఇండియన్స్, రోహిత్ కెప్టెన్సీలో తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌షిప్ గెలిచింది. అప్పటి నుంచి రోహిత్ శర్మ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.. సీనియర్లు తప్పుకున్నాక జూనియర్లను స్టార్లుగా మలిచాడు... మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు..’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే..