MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • APL: విశాఖ లో ఘ‌నంగా ప్రారంభ‌మైన ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్ 4.. ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి రామ్మోహన్‌, హీరో వెంకటేష్‌

APL: విశాఖ లో ఘ‌నంగా ప్రారంభ‌మైన ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్ 4.. ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి రామ్మోహన్‌, హీరో వెంకటేష్‌

Andhra Premier League Season 4: ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్ (ఏపీఎల్) సీజన్ 4 విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక‌గా మొత్తం 25 మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌వేశం ఉచితం కావడం విశేషం.

2 Min read
Mahesh Rajamoni
Published : Aug 08 2025, 10:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విశాఖలో ఘ‌నంగా ప్రారంభ‌మైన ఏపీఎల్ 4
Image Credit : Facebook/AndhraPremierLeagueACA

విశాఖలో ఘ‌నంగా ప్రారంభ‌మైన ఏపీఎల్-4

విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-4 ఘనంగా ప్రారంభ‌మైంది. ప్రారంభ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ప్ర‌ముఖ న‌టుడు, టాలీవుడ్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ లు ముఖ్య అతిథులుగా హాజరై ట్రోఫీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని శివనాథ్ (చిన్ని), శ్రీభరత్, భారత మాజీ మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ లు కూడా పాల్గొన్నారు.

ప్రారంభ కార్య‌క్ర‌మంలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ డాన్స్ షో, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల లైవ్ మ్యూజిక్ షో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షోలు ఆకట్టుకున్నాయి.

From the beautiful beaches of #Vizag to the tranquil banks of Tungabhadra to pristine Rayalaseema, all of #AndhraPradesh is getting padded up. 

The Andhra Premier League cricket championship is taking off soon! Are you ready? 🚀🚀#DhummuLepu@theacatweets#APL2025pic.twitter.com/kUI7F7Bt03

— Lokesh Nara (@naralokesh) August 7, 2025

DID YOU
KNOW
?
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి మూడు సీజన్ల విజేతలు వీరే
2022లో కోస్తా రైడర్స్ మొదటి టైటిల్ గెలిచింది. 2023లో రాయలసీమ కింగ్స్ విజేతగా నిలిచింది. 2024లో వైజాగ్ వారియర్స్ ఉత్తరాంధ్ర లయన్స్‌ను 87 పరుగులతో ఓడించి ఏపీఎల్ టైటిల్ గెలిచింది.
25
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 లో త‌ల‌ప‌డ‌నున్న 7 జట్లు
Image Credit : Facebook/AndhraPremierLeagueACA

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 లో త‌ల‌ప‌డ‌నున్న 7 జట్లు

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-4 లో మొత్తం 7 జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 25 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 21 లీగ్ మ్యాచులు, 4 ప్లే ఆఫ్స్‌లు ఉండబోతున్నాయి. ఈ టోర్నీలో విజయవాడ సన్ షైనర్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, అమరావతి రాయల్స్, కాకినాడ కింగ్స్, భీమవరం బుల్స్ జట్లు తలపడనున్నాయి.

ఐపీఎల్ మాదిరిగా రాష్ట్ర స్థాయిలో ఈ లీగ్ నిర్వహించడం ద్వారా యంగ్ క్రికెటర్లకు అంతర్జాతీయ ప్రాతినిధ్యం కోసం అవకాశం కల్పించాలన్నది ఏపీఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.

Related Articles

Related image1
iQOO Z10R: 4K కెమెరా, AI, గేమింగ్ ఫీచర్లతో రూ.20K లో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్.. హాట్ డీల్
Related image2
PM E-Drive Scheme: గుడ్ న్యూస్.. పీఎం ఈడ్రైవ్‌ పథకం 2028 వరకు పొడిగింపు.. దీని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటి?
35
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 కు ఫ్రీ ఎంట్రీ
Image Credit : Andhra Premier League, APLFacebook/AndhraPremierLeagueACA

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 కు ఫ్రీ ఎంట్రీ

క్రికెట్ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించేందుకు ఏసీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉచితం ప్ర‌వేశం ఉంటుంది. స్టేడియం గేట్ నంబర్ 15 నుంచి లోపలికి ప్రవేశం ఉంటుంది. స్టేడియంలోని మౌలిక వసతులను ఆధునీకరించిన నేపథ్యంలో, ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.

45
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 బ్రాండ్ అంబాసిడర్ గా హీరో వెంకటేష్‌
Image Credit : Facebook/AndhraPremierLeagueACA

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 బ్రాండ్ అంబాసిడర్ గా హీరో వెంకటేష్‌

ఈసారి ఏపీఎల్‌కు సినీ నటుడు విక్టరీ వెంకటేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. క్రికెట్ అంటే ఎంతో ఇష్ట‌ప‌డే వెంకీ ఉండ‌టం లీగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. మ్యూజిక్, డ్యాన్స్, తారల సమాహారంతో ప్రారంభోత్సవం మెగా సినీ ఈవెంట్ ను త‌ల‌పించింది.

55
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 విజేత‌కు రూ.35 ల‌క్ష‌లు
Image Credit : Facebook/AndhraPremierLeagueACA

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 విజేత‌కు రూ.35 ల‌క్ష‌లు

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 విజేత జట్టుకు రూ. 35 లక్షలు, రన్నరప్ జట్టుకు రూ. 20 లక్షల నగదు బహుమతిని అందిస్తారు. ఈ లీగ్‌ను చూడటానికి ఐపీఎల్ సెలెక్టర్లు కూడా హాజరయ్యే అవకాశం ఉండటంతో యంగ్ ప్లేయర్లకు క్రికెట్ కెరీర్‌లో ఎదగడానికి ఇదొక మంచి అవకాశంగా ఉంది. 

డీఆర్ఎస్ వంటి ఆధునిక సాంకేతికతను కూడా ఈసారి లీగ్‌లో ప్రవేశపెట్టారు. అలాగే, మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఆంధ్ర ప్రదేశ్
విశాఖపట్నం
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved