MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • iQOO Z10R: 4K కెమెరా, AI, గేమింగ్ ఫీచర్లతో రూ.20K లో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్.. హాట్ డీల్

iQOO Z10R: 4K కెమెరా, AI, గేమింగ్ ఫీచర్లతో రూ.20K లో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్.. హాట్ డీల్

Super Deal Of The Week: iQOO Z10R స్మార్ట్‌ఫోన్‌ను భారత్ లో విడుదల అయింది. Dimensity 7400 చిప్‌సెట్, ఫ్రంట్, బ్యాక్ 4K కెమెరా సెటప్, 5700mAh బ్యాటరీ, గేమింగ్ ఏఐ ఫీచర్లతో ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్ ఇది.  

2 Min read
Mahesh Rajamoni
Published : Aug 08 2025, 09:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సూపర్ ఫీచర్లతో iQOO Z10R
Image Credit : X/IqooInd

సూపర్ ఫీచర్లతో iQOO Z10R

iQOO Z10R: ఎక్కువగా ఫెర్మార్మెన్స్, గేమింగ్ ను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ లోకి ఫోన్ల‌ను తీసుకువ‌చ్చే ఐక్యూ ఈ సారి అదిరిపోయే ఆల్ రౌండ‌ర్ ఫోన్ తీసుకొచ్చింది. అది కూడా 20 వేల లోపు బ‌డ్జెట్ తో మంచి ఫీచ‌ర్ల‌తో తీసుకొచ్చింది.

భారతదేశంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన iQOO తన కొత్త మిడ్‌రేంజ్ 5G ఫోన్ iQOO Z10R ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ డివైస్ వినియోగదారులకు ఆధునిక ఫీచర్లను సరసమైన ధరకు అందించడమే లక్ష్యంగా పెట్టుకుని తీసుకొచ్చారు. దీని ప్రారంభ ధర రూ. 19,499 కాగా, ఇత‌ర ఆఫర్లతో మరింత త‌క్కువ ధ‌ర‌కే పొందవచ్చు.

iQOO Z10R మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో బెస్ట్ ఫీచర్లను అందించే ఓ శక్తివంతమైన ఎంపికగా నిలుస్తుంది. అత్యాధునిక కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్, దీర్ఘకాలిక బ్యాటరీతో ఈ ఫోన్ విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్లు, సాధారణ వినియోగదారులతో పాటు లైట్ గేమింగ్ ప్రియుల‌కు కూడా మంచి ఎంపిక‌గా ఉంది. ఐక్యూ జె10 ఆర్ ఫీచ‌ర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

DID YOU
KNOW
?
IP68 & IP69 రేటింగ్ తో iQOO Z10R
iQOO Z10R IP68 & IP69 రేటింగ్ తో పాటు మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, SGS 5-స్టార్ యాంటీ ఫాల్ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంది. దీంతో దుమ్ము, వర్షం, ప్రమాదవశాత్తు పడిపోయినప్పుడు కూడా ఇది ఎంతో సురక్షితంగా ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ప్రత్యేకతలతో వస్తుంది.
26
iQOO Z10R లో AMOLED డిస్‌ప్లే, సూప‌ర్ డిజైన్
Image Credit : X/IqooInd

iQOO Z10R లో AMOLED డిస్‌ప్లే, సూప‌ర్ డిజైన్

iQOO Z10R లో 6.77 అంగుళాల క్వాడ్ కర్వుడ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది FHD+ (2392x1080) రెజల్యూషన్ కలిగి ఉండి, 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో HDR10+ సపోర్ట్ చేస్తుంది. అలాగే, Schott Xensation Alpha గ్లాస్ ప్రొటెక్షన్ తో వ‌చ్చింది. ఈ ఫోన్ ఆక్వామరైన్, మూన్‌స్టోన్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

Related Articles

Related image1
Income Tax Bill 2025: కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లును కేంద్రం ఎందుకు వెనక్కి తీసుకుంది?
Related image2
Bank Locker Rules: బ్యాంక్ లాకర్‌లో గోల్డ్ పెడుతున్నారా? ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే
36
iQOO Z10R పెర్ఫార్మెన్స్, స్టోరేజ్ వివ‌రాలు
Image Credit : X/IqooInd

iQOO Z10R పెర్ఫార్మెన్స్, స్టోరేజ్ వివ‌రాలు

iQOO Z10R మీడియా టెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity) 7400 5G చిప్‌సెట్ (4nm ఫాబ్రికేషన్) ను క‌లిగి ఉంది. ఇది 8GB, 12GB LPDDR4X RAM వేరియంట్లలో లభిస్తుంది. అంతేకాకుండా 128GB, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉంది. సాధారణ వినియోగం, కంటెంట్ చూడ‌టం, లైట్ గేమింగ్‌, కంటెంట్ క్రియేట‌ర్ల‌కు మంచి ఎంపిక‌గా ఉంది.

46
iQOO Z10R కెమెరా ఫీచర్లు
Image Credit : X/IqooInd

iQOO Z10R కెమెరా ఫీచర్లు

ఐక్యూ జెడ్ 10 ఆర్ వెనుక భాగంలో 50MP Sony IMX882 ప్రైమరీ కెమెరా (OIS తో), 2MP డెప్త్ సెన్సార్ కెమెరా సెటప్ తో ఉంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ముందు, వెనుక రెండు కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేయడం దీని ప్రత్యేకత. 

Aura Light ఫీచర్ ద్వారా రాత్రి ఫొటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండర్ వాటర్ ఫోటోగ్రఫీకి కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి కంటెంట్ క్రియేటర్లకు, ఫోటోలు, వీడియోలు తీయడం ఇష్టపడే వారికి ఈ ప్రైస్ ధరలో మంచి ఎంపిక ఇది.

56
ఐక్యూ జెడ్ 10 ఆర్ బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు
Image Credit : iQOO India | X

ఐక్యూ జెడ్ 10 ఆర్ బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు

iQOO Z10R లో 5700mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్టు చేస్తుంది. ఫోన్‌ను 33 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ చేయవచ్చు. గేమింగ్ సమయంలో బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ సహాయపడుతుంది. దీని వల్ల ఫోన్ వేడెక్కకుండా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఒక రోజంతా కూడా మీరు ఛార్జ్ చేయకుండా ఉపయోగించవచ్చు.

66
ఐక్యూ జెడ్10 ఆర్ సాఫ్ట్‌వేర్, అదనపు ఫీచర్లు
Image Credit : X/IqooInd

ఐక్యూ జెడ్10 ఆర్ సాఫ్ట్‌వేర్, అదనపు ఫీచర్లు

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 తో ర‌న్ అవుతుంది. ఇందులో AI Note Assist, Circle to Search, AI Erase 2.0, AI Screen Translation, Photo Enhance, AI Transcript Assist వంటి ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ చెబుతున్నదాని ప్రకారం 2 సంవత్సరాలు OS అప్‌గ్రేడ్‌లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు వస్తాయి.

iQOO Z10R ధర ఎంత?

iQOO Z10R ప్రస్తుతం భారతదేశంలో అమెజాన్ (Amazon), ఫ్లిప్ కార్ట్ (Flipkart), అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తుంది. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 19,499 గా ఉంది. బ్యాంక్ ఆఫర్లు ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved