MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐసీఎల్‌ ఆడి, ఆలస్యంగా ఐపీఎల్‌లోకి అంబటి రాయుడు... అక్కడ హైదరాబాద్ హీరోస్‌కి టైటిల్ గెలిచి...

ఐసీఎల్‌ ఆడి, ఆలస్యంగా ఐపీఎల్‌లోకి అంబటి రాయుడు... అక్కడ హైదరాబాద్ హీరోస్‌కి టైటిల్ గెలిచి...

ప్రపంచ క్రికెట్‌లో సంచలన మార్పులు తీసుకొచ్చింది ఐపీఎల్‌. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కంటే ముందే ఇండియన్ లీగ్ క్రికెట్ (ఐసీఎల్) అనే పేరుతో ఓ లీగ్ వచ్చిందనే విషయం చాలామందికి తెలీదు. బీసీసీఐ, ఐసీసీ గుర్తింపు లేకుండా జరిగిన ఈ లీగ్‌లో ఆడిన ప్లేయర్లపై బ్యాన్ కూడా వేసింది బీసీసీఐ...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 31 2023, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జీ ఎంటర్‌టైన్‌మెంట్ 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్‌)ని తీసుకొచ్చింది. ఇందులో వరల్డ్ ఎలెవన్‌తో పాటు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్లేయర్లు పాల్గొన్నారు. దీనికి బీసీసీఐ, ఐసీసీ నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కలేదు.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

2008లో బీసీసీఐ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ని తీసుకురావడంతో ఐసీఎల్‌ని రెబల్ లీగ్‌గా చూశారు. ఆ తర్వాత 2009లో ఇండియన్ క్రికెట్ లీగ్ పూర్తిగా రద్దయ్యింది. ఈ లీగ్‌లో ఆడిన భారత ప్లేయర్లను బీసీసీఐ బ్యాన్ చేసింది. అయితే శ్రీలంక, బంగ్లాదేశ్ బోర్డులు కూడా ఇండియన్ క్రికెట్ లీగ్‌లో ఆడిన ప్లేయర్లను ఏడాది పాటు దేశానికి ఆడనివ్వలేదు..

36

ఇందులో హైదరాబాద్ హీరోస్ పేరుతో ఉన్న టీమ్‌కి ఆడాడు అంబటి రాయుడు. అంబటి రాయుడితో పాటు అబ్దుల్ రజాక్, స్టువర్ట్ బిన్నీ, క్రిస్ హారీస్ వంటి ప్లేయర్లు హైదరాబాద్ టీమ్‌కి ఆడి, 2007-08 సీజన్‌లో ఐసీఎల్ గ్రాండ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచారు...

46

ఐసీఎల్ ఆడిన ప్లేయర్లకు, ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించింది బీసీసీఐ. ఈ కారణంగానే 2008, 2009 సీజన్లలో అంబటి రాయుడు, ఐపీఎల్‌లో పాల్గొనలేదు. 2009లో ఇండియన్ క్రికెట్ లీగ్‌ని రద్దు చేసిన తర్వాత ఏడాదికి ఆ ప్లేయర్లను ఐపీఎల్ ఆడేందుకు అనుమతించింది బీసీసీఐ...

56

అలా ఇండియన్ క్రికెట్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్స్ గెలిచిన ఏకైక క్రికెటర్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు అంబటి రాయుడు.. 

66
ambati rayudu

ambati rayudu

ఇండియన్ క్రికెట్ లీగ్‌‌లో మూడు సీజన్లు ఆడి, ఐపీఎల్‌లో 200లకు పైగా మ్యాచులు ఆడిన ఏకైక ప్లేయర్ కూడా అంబటి రాయుడే... రోహన్ గవాస్కర్, స్టువర్ట్ బిన్నీ వంటి భారత క్రికెటర్లు కూడా ఇండియన్ క్రికెట్ లీగ్‌లో ఆడినా, ఐపీఎల్‌లో కనీసం 100 మ్యాచులు కూడా ఆడలేకపోయారు. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Most Sixes Record: బాదుడే బాదుడు.. ఒక్క ఏడాదలోనే 100 సిక్సర్లు బాదిన బ్యాటర్లు వీరే
Recommended image2
IND vs WI: భారత జట్టు ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే.. ఈ తప్పులే కొంపముంచాయి !
Recommended image3
IND vs WI: వెస్టిండిస్ సంచ‌ల‌న విజ‌యం.. చివ‌రి వ‌న్డేలో చెల‌రేగిన హోప్ సేన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved