Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అక్షర్ పటేల్‌ని కావాలనే తప్పించారా? సెన్సేషనల్ పోస్ట్ చేసి డిలీట్ చేసిన ఆల్‌రౌండర్..

అక్షర్ పటేల్‌ని కావాలనే తప్పించారా? సెన్సేషనల్ పోస్ట్ చేసి డిలీట్ చేసిన ఆల్‌రౌండర్..

క్రికెట్‌లో గాయాలు సహజం. అయితే కొన్నిసార్లు ఆటగాళ్లను తప్పించడానికి కూడా గాయాలు ఓ సాకుగా మారతాయి. సూర్యకుమార్ యాదవ్‌ని ఆడించడానికి శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్‌ని ఆడించడానికి ఇషాన్ కిషన్‌ని ఇలా గాయం వంకతో సైడ్ చేసింది టీమిండియా మేనేజ్‌మెంట్..  

Chinthakindhi Ramu | Published : Sep 29 2023, 03:53 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

తాజాగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు అక్షర్ పటేల్ గాయంతో టీమ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆసియా కప్ 2023 టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు అక్షర్ పటేల్..
 

28
Axar Patel-Ashwin

Axar Patel-Ashwin

ఈ గాయం కారణంగానే ఫైనల్ మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌కి చోటు దక్కలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఆడలేకపోయాడు అక్షర్. అక్షర్ పటేల్ సమయానికి కోలుకోకపోవడంతో అతన్ని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ నుంచి తప్పించి, అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌కి ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ..

38
Asianet Image

అయితే ఈ రిప్లేస్‌మెంట్ ప్రకటన వచ్చిన తర్వాత అక్షర్ పటేల్ చేసిన పోస్ట్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

48
Asianet Image

‘కామర్స్ బదులుగా సైన్స్ చదివి ఉంటే బాగుండేది. ఇంకా ఓ మంచి పీఆర్‌ని పెట్టుకుని ఉంటే బాగుండేది..’ అంటూ గుండె పగిలిన ఎమోజీని ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్‌గా పెట్టాడు అక్షర్ పటేల్. కొద్దిసేపటికే ఈ స్టోరీని డిలీట్ చేశాడు. అయితే అప్పటికే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అయిపోయింది..

58
Asianet Image

అక్షర్ పటేల్ పోస్ట్ చూస్తుంటే, తాను గాయం నుంచి కోలుకున్నా.. కావాలనే అతన్నే వరల్డ్ కప్‌ నుంచి తప్పించారని ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తోంది. మంచి పీఆర్ ఉండడం వల్లే రవిచంద్రన్ అశ్విన్‌కి వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం దక్కిందని కూడా ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్ చేస్తున్నట్టు ఉంది..

68
Asianet Image

ఈ పోస్ట్ అతని కెరీర్‌పై తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇంతకుముందు ఇలా టీమిండియా మేనేజ్‌మెంట్‌ని, సెలక్టర్లను ప్రశ్నించిన అంబటి రాయుడు, వృద్ధిమాన్ సాహా.. టీమ్‌లో ఎక్కువ కాలం నిలవలేకపోయారు.

78
Image credit: PTI

Image credit: PTI

అక్షర్ పటేల్ ఆవేదనలో అర్థం ఉంది. ఎందుకంటే అతను ఇలా వన్డే వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ కోల్పోవడం ఇది మూడో సారి. 

88
Image credit: PTI

Image credit: PTI

2015 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఎంపికైన రిజర్వు బెంచ్‌లోనే కూర్చున్న అక్షర్ పటేల్, 2019 వరల్డ్ కప్‌కి ఎంపిక కాలేదు. 2023 వరల్డ్ కప్‌కి ఎంపికైనా గాయం వంకతో మళ్లీ జట్టులో చోటు కోల్పోయాడు అక్షర్ పటేల్.. 

Chinthakindhi Ramu
About the Author
Chinthakindhi Ramu
 
Recommended Stories
RCB: బెంగళూరు తొక్కిసలాట బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఆర్సీబీ
RCB: బెంగళూరు తొక్కిసలాట బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఆర్సీబీ
RCB: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. ఆర్సీబీపై కేసు నమోదు
RCB: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. ఆర్సీబీపై కేసు నమోదు
RCB Stampede: నా కొడుకు మృత‌దేహాన్ని నాకిచ్చేయండి.. కంట‌త‌డి పెట్టిస్తోన్న తండ్రి విజ్ఞ‌ప్తి
RCB Stampede: నా కొడుకు మృత‌దేహాన్ని నాకిచ్చేయండి.. కంట‌త‌డి పెట్టిస్తోన్న తండ్రి విజ్ఞ‌ప్తి
Top Stories
Telugu news live updates: PM Modi - ఆ కల ఈ రోజుతో నిజమైంది.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Telugu news live updates: PM Modi - ఆ కల ఈ రోజుతో నిజమైంది.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
starlink: మ‌స్క్ మామ ఎంట్రీ క‌న్ఫామ్‌.. ఇండియాలో శాటిలైట్ ద్వారా ఇంట‌ర్నెట్‌, ధ‌ర‌లు ఎలా ఉంటాయో తెలుసా?
starlink: మ‌స్క్ మామ ఎంట్రీ క‌న్ఫామ్‌.. ఇండియాలో శాటిలైట్ ద్వారా ఇంట‌ర్నెట్‌, ధ‌ర‌లు ఎలా ఉంటాయో తెలుసా?
Telangana Cabinet meet: తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
Telangana Cabinet meet: తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Hot on Web
  • Nara Chandrababu Naidu
  • Pawan Kalyan
  • Telugu News
  • District News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Nellore News
  • Guntur News
  • Hyderabad News
  • Popular Categories
  • Life Style
  • International News
  • Entertainment
  • Fact Check
  • Sports
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved