- Home
- Sports
- Cricket
- పృథ్వీషా కెప్టెన్సీలో అజింకా రహానే, ముంబై టీమ్‌కి మెంటర్‌గానూ... సౌరాష్ట్ర జట్టులో ఛతేశ్వర్ పూజారా...
పృథ్వీషా కెప్టెన్సీలో అజింకా రహానే, ముంబై టీమ్‌కి మెంటర్‌గానూ... సౌరాష్ట్ర జట్టులో ఛతేశ్వర్ పూజారా...
ఆస్ట్రేలియా టూర్ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత సీనియర్లు ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే... రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. ఫామ్‌ని నిరూపించుకునేందుకు రంజీ ట్రోఫీలో పాల్గొనాల్సిందిగా సూచించింది బీసీసీఐ...

ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ 2022 సీజన్ రెండు ఫేజ్‌లుగా జరగనుంది. మొదటి సీజన్‌లో గ్రూప్ మ్యాచులు ముగిసిన తర్వాత నాకౌట్ మ్యాచులు ఐపీఎల్ ముగిసిన తర్వాత జరుగుతాయి...
రంజీ ట్రోఫీలో పాల్గొనబోయే ప్లేయర్లను ఇప్పటికే ప్రకటించిన జట్లు, ఫిబ్రవరి 9-10లోగా అందరు ప్లేయర్లు క్యాంపులో కలవాల్సిందిగా సూచించాయి...
ఫిబ్రవరి 14 వరకూ ప్లేయర్లు అందరూ తప్పనిసరి క్వారంటైన్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత రెండు రోజులు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనే ప్లేయర్లు, ఆ తర్వాత మ్యాచుల్లో పాల్గొంటారు...
మార్చి 12 నుంచి 16 వరకూ ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచులు మార్చి 12 నుంచి 16 వరకూ జరుగుతాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచులు ఐదు రోజులకు బదులుగా, నాలుగు రోజుల మ్యాచులుగా జరుగుతాయి...
41 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై జట్టుకి పృథ్వీషా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. భారత సీనియర్ ప్లేయర్ అజింకా రహానే, పృథ్వీషా కెప్టెన్సీలో ఆడబోతున్నాడు...
‘అజింకా రహానే వంటి ప్లేయర్‌కి కెప్టెన్సీ ముఖ్యం కాదు. కెప్టెన్‌గా రహానే అసాధ్యమైన రికార్డులెన్నో సాధించాడు. ముంబైకి మెంటర్‌గా వ్యవహరించేందుకు కూడా రహానే అంగీకరించాడు.
పృథ్వీషా కెప్టెన్సీలో ఆడడానికి అజింకా రహానేకి ఎలాంటి ఈగో ఇష్యూలు లేవు... అజింకా రహానే సేవలు, ముంబై జట్టుకి ఎంతో అమూల్యమైనవి...’ అంటూ తెలియచేశాడు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎమ్‌సీఏ) అధికారి...
పృథ్వీషా కెప్టెన్సీలో విజయ్ హాజారే ట్రోఫీ 2021 టైటిల్‌ను సాధించింది ముంబై. ఆ సీజన్‌లో నాలుగు సెంచరీలతో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు పృథ్వీషా...
టీమిండియా టెస్టు టీమ్‌లో చోటు కోల్పోయిన భారత టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా, రంజీ ట్రోఫీ డిఫెండింగ్ ఛాంపియన్ సౌరాష్ట్ర టీమ్ తరుపున బరిలో దిగబోతున్నాడు...
జయ్‌దేవ్ ఉనద్కడ్ కెప్టెన్సీలో రంజీ ట్రోఫీ 2022 సీజన్ బరిలో దిగుతున్న సౌరాష్ట్ర జట్టులో షెల్డన్ జాక్సన్, చేతన్ సకారియా వంటి ప్లేయర్లకు చోటు దక్కింది...