- Home
- Sports
- Cricket
- వేదాంత ఫిలాసఫీ... క్రికెటర్ అజింకా రహానే కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్‌కి అదే కారణమట...
వేదాంత ఫిలాసఫీ... క్రికెటర్ అజింకా రహానే కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్‌కి అదే కారణమట...
అజింకా రహానే... కూల్ అండ్ కామ్ పర్సనాలిటీ. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఏ మాత్రం భావోద్వేగాలకు లోను కాకుండా భారత జట్టును అద్భుతంగా నడిపించి, విమర్శకులను ఫిదా చేసేశాడు. ఆటగాళ్లకు గాయాలు చేస్తూ, నోటికి పని చెప్పిన ఆస్ట్రేలియన్లను గౌరవిస్తూ, దిమ్మతిరిగే సమాధానం చెప్పిన రహానే... అంత ప్రశాంతంగా ఉండడానికి కారణం వేదాంత ఫిలాసఫీ ఫాలో అవ్వడమేనట...

ఆడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయ్యి, ఘోర పరాజయం మూటకట్టుకున్న తర్వాత కూడా సిరీస్ సొంతం చేసుకుంది టీమిండియా...

ఈ చారిత్రక విజయం తర్వాత కూడా ఎంతో ప్రశాంతంగా, వినయంగా నడుచుకున్నాడు అజింకా రహానే. ఇలాంటి విజయం వేరే కెప్టెన్‌కి దక్కితే, అతని గర్వం ఆకాశాన్ని తాకేది... ఆవేశంతో ఊగిపోయేవారు. కానీ రహానే చాలా కూల్‌గా కనిపించాడు...

ఆస్ట్రేలియాలో చారిత్రక విజయం సాధించిన తర్వాత కూడా తనకూ, కోహ్లీకి మధ్య ఎలాంటి కెప్టెన్సీ లేదని చెప్పిన అజింకా రహానే, విరాట్ ఎప్పుడూ తన కెప్టెన్ అంటూ సగర్వంగా ప్రకటించాడు.

ఐపీఎల్ 2020 విజయం తర్వాత రోహిత్ శర్మ మాట్లాడిన దానికీ, ఆస్ట్రేలియా టూర్‌లో విజయం తర్వాత రహానే మాట్లాడిన మాటలకు చాలా వ్యత్యాసం ఉంది.

భారత టీ20 కెప్టెన్సీ ఇస్తే కాదనను అని రోహిత్ మనసులో మాట బయటపెడితే, ఆసీస్ టెస్టు సిరీస్ విజయం చరిత్రలో కలిసిపోయింది, ఇప్పుడు నేను కేవలం ప్లేయర్‌నే అంటూ ప్రకటించాడు రహానే...

అజింకా రహానే ఈ యాటిట్యూడ్‌తోనే అందరి మనసులు గెలచుకున్నాడు. ప్రత్యర్థిని కూడా గౌరవించే ఆయన మనస్తత్వానికి కారణం వేద పారాయణమేనట...

‘నేను ఏడేళ్లుగా వేదాంత ఫిలాసఫీని అవుతున్నా... నాకు పుట్టుకతోనే ఈ స్వభావం వచ్చిందనుకుంటా... గెలుపు, ఓటములను ఒకేలా చూసేలా ఈ ఫిలాసఫీ నా ఆలోచనను మార్చేసింది...

లాక్‌డౌన్‌లో కూడా వేదాంత ఫిలాసఫీని నేర్చుకోవడానికే ఎక్కువ సమయం గడిపాను... జీవితంలో ఏది ముఖ్యం, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో మనకి స్పష్టంగా తెలిసినప్పుడు అనవసరంగా భావోద్వేగాలకు లోనుకావాల్సిన అవసరం ఉండదు...

నా విషయంలో ఈ వేదాంత ఫిలాసఫీ సరిగ్గా పనిచేస్తోంది. ఇది జీవితం గురించి. క్రికెట్‌కి సంబంధించింది కాదు. కానీ ఒత్తిడిని ఎలా జయించాలో నేర్పించింది...

ఓడిపోతున్నప్పుడు ప్రశాంతంగా, పాజిటివ్ దృక్ఫథంతో ఉండాలి... నేను ఆటను గౌరవిస్తాను. నా దృష్టిలో ఆట కంటే ఏదీ ముఖ్యం కాదు... క్రికెట్ కంటే నేనెప్పుడూ గొప్పవాడిని కాదు...

ఆటలో ప్రతీ ఆటగాడు సమానమే. నేను కెప్టెన్‌ని అయినా జట్టులో ఓ భాగం మాత్రమే. సారథి, ఉపసారథిని ఆలోచిస్తే, ఓ ఆటగాడిగా జట్టుకి కావాల్సిన 100 శాతం ఇవ్వలేం...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నప్పుడు వాటర్ బాయ్‌గా కూడా చేశాను... చాలామంది నాపైన సింపథీ చూపించారు. కానీ నేను ఎప్పుడూ అలా అనుకోలేదు...

అవకాశం కోసం ఎదురుచూడాలి, అది వచ్చినప్పుడు అందుకోవాలి... ఫలితం కోసం నూటికి 200 శాతం కష్టపడాలి. ఫలితం వచ్చాక దాన్ని చరిత్రగా మరిచిపోవాలి.. అప్పుడే మరో లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్లగలుగుతాం...’ అంటూ చెప్పుకొచ్చాడు అజింకా రహానే..