రహానే కెప్టెన్సీకి ఆస్ట్రేలియా ఫిదా అయిపోయింది... రికీ పాంటింగ్‌తో సహా... సునీల్ గవాస్కర్ కామెంట్...
First Published Dec 30, 2020, 3:52 PM IST
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ... ఇలా స్టార్ క్రికెటర్లు ఎవ్వరూ లేకపోయినా టాప్ టీమ్ ఆస్ట్రేలియాను ఓడించి, బాక్సింగ్ డే టెస్టులో అద్భుత విజయాన్ని అందుకుంది టీమిండియా. తొలి టెస్టులో రెండు రోజుల ఆధిక్యం తర్వాత ఘోర పరాజయం చెందిన టీమిండియా, టెస్టు సిరీస్‌లో క్లీన్ స్వీప్ అవుతుందని భావించారు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత విజయం అందుకుంది భారత జట్టు.

తొలి టెస్టు పరాజయం తర్వాత టీమిండియా ఒక్క టెస్టు కూడా గెలవలేదని, 4-0 తేడాతో క్లీన్ స్వీప్ అవుతుందని కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ వాన్...

విరాట్ కోహ్లీ లేకుండా టెస్టు మ్యాచ్ గెలిస్తే, టీమిండియా ఏడాది మొత్తం సంబరాలు చేసుకోవచ్చని చులకనగా కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ హస్సీ...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?