- Home
- Sports
- Cricket
- అజింకా రహానే చేసిన కామెంట్లు ఎవరి గురించి... విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి మధ్య సోషల్ మీడియాలో...
అజింకా రహానే చేసిన కామెంట్లు ఎవరి గురించి... విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి మధ్య సోషల్ మీడియాలో...
భారత మాజీ టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానేకి కెప్టెన్‌గా మంచి రికార్డు ఉంది. కెప్టెన్‌గా ఒక్క టెస్టు కూడా ఓడిపోని అజింకా రహానే, భారత జట్టుకి నాలుగు అత్యద్భుత విజయాలు అందించాడు. అయితే పేలవ ఫామ్‌తో టెస్టుల్లో వైస్ కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయిన అజింకా రహానే చేసిన కొన్ని కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి...

ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిలైడ్ టెస్టులో 36/9 స్కోరుతో ఘోర పరాభవం ఎదుర్కొన్న తర్వాత పెటర్నిటీ లీవ్ మీద స్వదేశానికి తిరిగి వచ్చేశాడు భారత రెగ్యూలర్ టెస్టు సారథి విరాట్ కోహ్లీ...
ఈ సమయంలో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న అజింకా రహానే, మెల్‌బోర్న్ టెస్టులో అద్భుత సెంచరీతో చెలరేగి... జట్టులో నూతనత్సాహం నింపాడు. సిడ్నీ టెస్టును డ్రా చేసుకున్న భారత జట్టు, గబ్బాలో తిరుగులేని విజయం అందుకుని 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది...
ఈ సిరీస్ విజయంలో ఎక్కువ క్రెడిట్ అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు టెస్టు టీమ్‌ను తయారుచేయడంలో కృషి చేసిన అప్పటి టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీలతో పాటు ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్‌కి దక్కింది...
‘కెప్టెన్‌గా తాను తీసుకున్న నిర్ణయాలకు క్రెడిట్ వేరేవాళ్లు తీసుకున్నారు. అయితే నాకు క్రెడిట్ ముఖ్యం కాదు, సిరీస్ గెలవడమే ముఖ్యం. అందుకే అవన్నీ పట్టించుకోలేదు...’ అంటూ కామెంట్ చేశాడు అజింకా రహానే...
అయితే అజింకా రహానే చేసిన కామెంట్లు ఎవరి గురించి... కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి అన్నాడా? లేక మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి గురించి అన్నాడా? అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు...
దీంతో సోషల్ మీడియాలో అజింకా రహానే వర్సెస్ విరాట్ కోహ్లీ, అజింకా రహానే వర్సెస్ రవిశాస్త్రిలను ట్రెండ్ చేస్తూ, రెండు వర్గాలుగా విడిపోయి, పోస్టులు చేస్తున్నారు అభిమానులు...
ఆడిలైడ్ విజయం తర్వాత మెల్‌బోర్న్ టెస్టు విజయంలో అజింకా రహానేకి కచ్చితంగా క్రెడిట్ దక్కుతుంది. ఆ తర్వాత సిడ్నీ టెస్టులో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ దాదాపు మూడున్నర గంటల పాటు వికెట్లకు అడ్డుగా నిలబడి... భారత జట్టుకి చారిత్రక డ్రా అందించారు...
తొలి టెస్టులో మహ్మద్ షమీ, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్, మూడో టెస్టులో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, ప్రాక్టీస్ సెషన్స్‌లో కెఎల్ రాహుల్ గాయపడడంతో అందుబాటులో ఉన్న రిజర్వు ప్లేయర్లతో గబ్బా టెస్టు బరిలో దిగింది భారత జట్టు...
ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ సక్సెస్ కావడంతో మయాంక్ అగర్వాల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించారు. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అందుబాటులో ఉన్న కుర్ర స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కి అవకాశం ఇచ్చారు..
మొదటి టెస్టులో ఫెయిల్ కావడంతో పృథ్వీషాకి ఆ తర్వాత అవకాశం ఇవ్వలేదు... ఇలాంటి నిర్ణయాలే గబ్బా టెస్టులో భారత జట్టుకి ద్విగ్విజయాన్ని అందించాయి...
ఈ నిర్ణయాలు తీసుకోవడంలో అజింకా రహానే పాత్ర ఉండొచ్చేమో కానీ టెస్టు సిరీస్‌ను ప్లేయర్లను ఎంపిక చేయడంలో సెలక్టర్లు, వారితో పాటు కోచ్, కెప్టెన్‌యే కదా ప్రధాన పాత్ర పోషించేది అంటున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్...
ఆ మాటకి వస్తే ఆడిలైడ్ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 74 పరుగుల వద్ద విరాట్ కోహ్లీని రాంగ్ కాల్‌తో రనౌట్ చేశాడు అజింకా రహానే. విరాట్ రనౌట్ కాకపోయి ఉంటే, తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు మరింత ఆధిక్యం సంపాదించే అవకాశం దక్కేది...
ఓ రకంగా విరాట్ కోహ్లీని రనౌట్ చేసి, భారత జట్టుకి భారీ ఆధిక్యం దక్కకుండా చేసి, ఘోర పరాభవానికి అజింకా రహానే కారణమయ్యాడని అంటున్నారు టీమిండియా అభిమానులు...
ఫామ్‌లో లేక వరుసగా విఫలమవుతున్నా తనకి అవకాశాలు ఇచ్చి మద్ధతుగా నిలుస్తూ వచ్చిన విరాట్ కోహ్లీని అజింకా రహానే ట్రోల్ చేసే అవకాశం ఉండకపోచ్చని, మాజీ కోచ్ రవిశాస్త్రి గురించే ఈ కామెంట్లు చేసి ఉంటాడని కామెంట్లు పెడుతున్నారు...
మెల్‌బోర్న్ టెస్టు తర్వాత పరుగులు చేయలేక వైస్ కెప్టెన్సీ కోల్పోయి, జట్టులో ప్లేస్ కోల్పోయిన అజింకా రహానే, ఇలాంటి కామెంట్లు చేయడం కంటే ఫామ్‌ని తిరిగి సాధించడంపైన ఫోకస్ పెట్టి ఉంటే... ఈపాటికి టీమిండియా కెప్టెన్ అయ్యేవాడని అంటున్నారు అభిమానులు...