- Home
- Sports
- Cricket
- రహానేకి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు, విరాట్ కోహ్లీని తిరిగి కెప్టెన్‌గా చేయొచ్చుగా... బీసీసీఐ మాజీ సెలక్టర్..
రహానేకి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు, విరాట్ కోహ్లీని తిరిగి కెప్టెన్‌గా చేయొచ్చుగా... బీసీసీఐ మాజీ సెలక్టర్..
17 నెలల తర్వాత టెస్టు టీమ్‌లోకి రీఎంట్రీ ఇస్తూనే, వెస్టిండీస్ టూర్‌లో టెస్టులకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు అజింకా రహానే. దీంతో టెస్టుల్లో తిరిగి విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఇవ్వాలని సూచిస్తున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్..

Rohit-Kohli Test
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్‌ని నియమించబోతుందని ప్రచారం జరిగింది. శుబ్‌మన్ గిల్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా.. ఇలా చాలామంది పేర్లు, టీమిండియా ఫ్యూచర్ టెస్టు కెప్టెన్లుగా వినిపించాయి...
Ajinkya Rahane
అయితే రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్‌గా కొనసాగించిన సెలక్టర్లు, అతనికి డిప్యూటిగా అజింకా రహానేని సెలక్ట్ చేశారు. ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్...
‘రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్‌గా కొనసాగించడం కరెక్టా? కాదా? అంటే నేను సమాధానం చెప్పలేను. ఈ వయసులో రోహిత్ శర్మకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ ఇవ్వడం భారమే. అందుకే టీ20ల్లో హార్ధిక్ పాండ్యాని కెప్టెన్‌గా కొనసాగిస్తున్నట్టు ఉన్నారు..
సెలక్టర్ల మైండ్‌సెట్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. 2025 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకూ ఆలోచిస్తే, రోహిత్‌ని టెస్టు కెప్టెన్‌గా కొనసాగించడం కరెక్ట్ కాదు. అయినా టీమిండియాకి కొత్త కెప్టెన్‌ని వెతకాల్సిన అవసరం ఏముంది..
Image credit: PTI
విరాట్ కోహ్లీ ఉన్నాడు. అజింకా రహానేకి తిరిగి టెస్టు వైస్ కెప్టెన్సీ ఇచ్చినప్పుడు, విరాట్ కోహ్లీని తిరిగి టెస్టు కెప్టెన్‌గా చేయొచ్చుగా.. అయితే కెప్టెన్సీ విషయంలో ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆలోచన ఎలా ఉందనేది అవసరం..
కోహ్లీ తిరిగి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి సిద్దంగా ఉంటే, సెలక్టర్లు అతన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ మరో మూడు, నాలుగేళ్లు టెస్టుల్లో కొనసాగగలడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్..