- Home
- Sports
- Cricket
- అతని టాలెంట్‌ను టీమిండియా సరిగా వాడుకోవడం లేదు, ఐపీఎల్ 2022 సీజన్‌లో... కేకేఆర్ మెంటర్ డేవిడ్ హుస్సీ!
అతని టాలెంట్‌ను టీమిండియా సరిగా వాడుకోవడం లేదు, ఐపీఎల్ 2022 సీజన్‌లో... కేకేఆర్ మెంటర్ డేవిడ్ హుస్సీ!
ఐపీఎల్ 2022 సీజన్‌కి ఇంక ఎంతో సమయం లేదు, మార్చి 26న మొదలయ్యే ఈ మెగా క్రికెట్ సమయం... 74 రోజుల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయనుంది. టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న యంగ్ క్రికెటర్లకు, చోటు కోల్పోయిన సీనియర్లకు ఐపీఎల్ పర్ఫామెన్స్ కీలకంగా మారనుంది...

దాదాపు నాలుగేళ్ల క్రితం వైట్ బాల్ క్రికెట్ ఆడిన అజింకా రహానే, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సౌతాఫ్రికా టెస్టు సిరీస్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్‌లోనూ చోటు కోల్పోయాడు...
ఇంతకుముందు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లకి ఆడిన అజింకా రహానే, ఈ సీజన్‌లో కేకేఆర్ తరుపున ఆడబోతున్నాడు...
ఐపీఎల్‌లో 3900లకు పైగా పరుగులు చేసిన అజింకా రహానే, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టీమ్‌కి కీ ప్లేయర్ అవుతాడని అంటున్నాడు కేకేఆర్ మెంటర్ డేవిడ్ హుస్సీ...
‘అజింకా రహానే ఓ క్లాస్ ప్లేయర్. భారత జట్టు తరుపున దశాబ్దానికి పైగా ఆడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరుపున రహానే అద్భుతంగా రాణించాడు కూడా...
అతనిలో ఇంకా చాలా టాలెంట్ ఉంది. నా వరకూ రహానే టాలెంట్‌ను టీమిండియా సరిగా వాడుకోవడం లేదని అనుకుంటున్నా... ఈ మధ్య కాలంలో అతని ఫామ్ సరిగా లేకపోవచ్చు, పరుగులు చేయలేకపోవచ్చు...
అయితే కేకేఆర్ క్యాంపులో అతను ప్రాక్టీస్‌లో పడుతున్న శ్రమను చూస్తుంటే... ఈసారి రహానే సూపర్ సక్సెస్ అవుతాడని అనుకుంటున్నా. ఐపీఎల్‌లో రహానే డామినేషన్ చూస్తారు...
అజింకా రహానేలో ఓ అద్భుతమైన లీడర్ కూడా ఉన్నాడు. ఫీల్డ్ పర్ఫామెన్స్ మాత్రమే కాకుండా ఆఫ్ ఫీల్డ్ యువ క్రికెటర్లకు సలహాలు, సూచనలు ఇస్తూ చురుగ్గా ఉంటున్నాడు.
అతను మరో 5 నుంచి 10 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడగలడు... అజింకా రహానే లాంటి ప్లేయర్, కేకేఆర్‌లో ఉండడం చాలా సంతోషంగా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మెంటర్ డేవిడ్ హుస్సీ...