MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కామ్‌‌గా కనిపించే అజింకా రహానే, పెళ్లికి ముందు ఇంత కథ నడిపించాడా.. రాధికాతో కలిసి...

కామ్‌‌గా కనిపించే అజింకా రహానే, పెళ్లికి ముందు ఇంత కథ నడిపించాడా.. రాధికాతో కలిసి...

ఫామ్‌లో లేక టీమ్‌లో చోటు కోల్పోయి, వైస్ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు అజింకా రహానే. గాయం కారణంగా ఐపీఎల్ మధ్యలో నుంచే తప్పుకున్న అజింకా రహానే, ఆస్ట్రేలియా టూర్ 2020-21 కెప్టెన్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు. ఆడిలైడ్ పరాజయం తర్వాత రహానే కెప్టెన్సీలో టీమిండియా కమ్‌బ్యాక్ ఇచ్చి, సిరీస్ గెలిచిన తీరు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది...  

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Jun 06 2022, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

కామ్ అండ్ కూల్ యాటిట్యూడ్‌తో టీమిండియాను అద్భుత విజయ తీరాలకు చేర్చిన అజింకా రహానే... కెప్టెన్‌గా ఇప్పటిదాకా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోలేదు...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

క్రీజులో కూల్‌గా కామ్‌గా కనిపించే అజింకారహానే, వ్యక్తిగత జీవితంలో మాత్రం అంత కామ్ పర్సనాలిటీ కాదండోయ్... రహానే ప్రేమ కథ తెలిసిన వారేవ్వరైనా... అమ్మో... మనోడు ఇంత కథ నడిపించాడా? అని ఆశ్చర్యపోవాల్సిందే...

310

తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా దొపావ్కర్‌ను సెప్టెంబర్ 26, 2014లో పెళ్లి చేసుకున్నాడు అజింకా రహానే... అయితే రాధికా, రహానే లవ్ కమ్ ఆరేంజ్డ్ మ్యారేజ్ వెనక ఓ పెద్ద ఇంట్రెస్టింగ్ ప్రేమ కథ ఉంది...

410

రహానే భార్య రాధిక కుటుంబం పూణే నుంచి వచ్చి ముంబైలో సెటిల్ అయ్యింది. రహానే ఇంటి పక్కనే రాధికా వాళ్ల ఫ్యామిలీ ఉండేది...  చిన్నతనం నుంచి రాధికా, రహానేకి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.. వయసు పెరిగే కొద్దీ ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది...

510

రోజూ కాలేజీకని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి, బయట ఎంచక్కా సినిమాలు, పార్కులు తిరుగుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేసేవాళ్లు రాధికా, అజింకా రహానే...

610

ఓ రోజు ఈ ప్రేమ పక్షలు కాలేజీ డుమ్మా కొట్టి, సినిమాకి వెళ్లారు... తిరిగి వస్తుండగా ఇద్దరినీ రోడ్డు మీదే చూసింది రాధికా తల్లి... అంతే భయంతో ఆమె నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రహానే ఓ ఆటోను కూడా ఢీకొట్టాడు... ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లండించాడు రహానే...

710

ఈ సంఘటన తర్వాత రాధికా, రహానే తల్లిదండ్రులకు వీరి ప్రేమ విషయం తెలిసిపోయింది... ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు...

810

పెళ్లి తర్వాత తన జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ ఆమె ఒక్కత్తే అంటూ రాధికా గురించి చెప్పుకొచ్చాడు అజింకా రహానే. తన ఫస్ట్ లవ్ కూడా ఆమేనంటూ రాసుకొచ్చాడు...

910

కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్‌తో అందర్నీ ఆకట్టుకునే రహానే, ఆయన భార్య రాధికాలకు 2019లో ఓ పాప జన్మించింది. ఆమెకు ఆర్య అని పేరు పెట్టారు రహానే అండ్ ఫ్యామిలీ...

1010

టీమిండియాలో చోటు కోల్పోయిన అజింకా రహానే త్వరలో రీఎంట్రీ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నాడు. 34 ఏళ్ల అజింకా రహానే, అన్ని సరిగ్గా ఉండి ఉంటే ఈపాటికి టీమిండియా టెస్టు కెప్టెన్‌గా అయ్యేవాడే..

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved