MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • జనవరిలో పెళ్లి..? అతియాశెట్టి లేకుండానే ఆలయాల వెంట తిరుగుతున్న కెఎల్ రాహుల్

జనవరిలో పెళ్లి..? అతియాశెట్టి లేకుండానే ఆలయాల వెంట తిరుగుతున్న కెఎల్ రాహుల్

KL Rahul Wedding: టీమిండియా ఓపెనర్,  ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న  కెఎల్ రాహుల్ త్వరలోనే పెళ్లికొడుకు కాబోతున్నాడు. ఈ మంగళూరు  బుల్లోడు  బాలీవుడ్ నటి అతియా శెట్టితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.  

2 Min read
Author : Srinivas M
Published : Nov 24 2022, 02:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీ20 ప్రపంచకప్ లో దారుణ వైఫల్యం తర్వాత  స్వదేశానికి తిరిగొచ్చిన టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్  త్వరలోనే  పెళ్లి చేసుకోబోతున్నాడు.  బాలీవుడ్  వెటరన్ హీరో సునీల్ శెట్టి కుమార్తె  అతియాశెట్టిని రాహుల్ వివాహమాడనున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

డిసెంబర్ చివర్లో లేదా జనవరి మొదటివారంలో వీళ్ల పెళ్లి ఉండొచ్చని బీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు  ఇరు కుటుంబాలు పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారని.. ఖండాలాలో ఉన్న  సునీల్ శెట్టి   మాన్షన్ లో  రాహుల్ - అతియాల వివాహం ఘనంగా జరుగనుందని తెలుస్తున్నది. 

36

అయితే పెళ్లికి ముందే  రాహుల్   ఆలయాల బాట పట్టాడు. రెండ్రోజుల క్రితం పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లిన రాహుల్.. బుధవారం కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం  కుక్కె సుబ్రహ్మణ్యస్వామి గుడికి వెళ్లాడు. 

46

మంగళూరులోనే పుట్టి పెరిగిన  రాహుల్.. తన మిత్రులతో కలిసి  సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నాడు.  ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు రాహుల్ కు ప్రత్యేక దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయితే రాహుల్ కాబోయే భార్య అతియా శెట్టి మాత్రం  అతడితో ఆలయాలకు రావడంలేదు. విదేశీ టూర్ల కోసం  రాహుల్ ఎక్కడికెళ్తే అక్కడ ఉండే అతియా.. ఇటీవల అతడితో కలిసి  ఆస్ట్రేలియాలో కూడా ప్రత్యక్షమైంది.

56

సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించిన తర్వా త రాహుల్ మంగళూరు స్పెషల్ ఐస్ క్రీమ్ అయిన గడ్బడ్  ఐస్ క్రీమ్ తింటూ తన మిత్రులతో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గడిపాడు.   మంగళూరులో క్రికెట్ ఆడే రోజుల్లో రాహుల్  ఈ ఐస్ క్రీమ్ ను చాలా ఇష్టంగా తినేవాడట. 
 

66
Image credit: PTI

Image credit: PTI

టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ బంగ్లాదేశ్ టూర్ కు వెళ్లాల్సి ఉంది.  న్యూజిలాండ్ పర్యటన ముగిశాక  భారత జట్టు.. బంగ్లాతో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ  రెండు సిరీస్ లలోనూ రాహుల్ సభ్యుడిగా ఉన్నాడు.  ఈ పర్యటన ముగిసిన తర్వాత  రాహుల్ - అతియాల వివాహం ఉంటుందని తెలుస్తున్నది. 

About the Author

SM
Srinivas M
Latest Videos
Recommended Stories
Recommended image1
Ishan Kishan: బ్యాంకు ఉద్యోగిగా మారిన టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్.. నెలకు జీతం ఎంతంటే?
Recommended image2
Most Educated Cricketer : ధోనీ, కోహ్లీ, రోహిత్ కాదు.. టీమిండియాలో అత్యంత విద్యావంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా?
Recommended image3
Preity Zinta Brett Lee: ప్రీతి జింటాతో సీక్రెట్ లవ్? 16 ఏళ్ల తర్వాత షాకింగ్ నిజం చెప్పిన బ్రెట్ లీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved