MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • యాషెస్‌కు ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్..! అండర్సన్‌కు గాయం.. స్టార్ పేసర్లందరిదీ అదే పరిస్థితి

యాషెస్‌కు ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్..! అండర్సన్‌కు గాయం.. స్టార్ పేసర్లందరిదీ అదే పరిస్థితి

Ashes 2023: గతేడాది ఆస్ట్రేలియా వేదికగా  ముగిసిన యాషెస్ సిరీస్ లో దారుణంగా ఓడిన ఇంగ్లాండ్ ఈ ఏడాది స్వదేశంలో బదులు తీర్చుకునేందుకు సిద్ధమవుతుండగా ఆ జట్టుకు ఊహించని షాకులు తాకుతున్నాయి. 

2 Min read
Author : Srinivas M
| Updated : May 15 2023, 08:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ ఏడాది  జూన్ 16 నుంచి  ఆస్ట్రేలియాతో  స్వదేశంలో  జరుగబోయే యాషెస్ సిరీస్‌కు ముందు  ఇంగ్లాండ్‌కు  వరుస షాకులు తప్పడం లేదు. ఆ  జట్టు స్టార్ పేసర్లు గాయాల పాలవుతున్నారు.  ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్  గాయపడటం ఇంగ్లాండ్ ను ఆందోళనకు గురి చేస్తున్నది. 

26

ఇంగ్లాండ్ లో కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడుతున్న అండర్సన్..  లంకాషైర్ వర్సెస్ సోమర్‌సెట్ మ్యాచ్ లో గాయపడ్డాడు.  మాంచెస్టర్ ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా   సోమర్‌సెట్ తో జరిగిన మ్యాచ్ లో  ఆండర్సన్..  14 ఓవర్లు వేసి  16 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.   

36

మొదటి రోజు    14 ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత  అండర్సన్ మళ్లీ  ఫీల్డ్ లోకి రాలేదు.  కుడి కాలికి గజ్జల్లో గాయం కారణంగా  అతడు  మళ్లీ బౌలింగ్ కు రాలేదు.  కాగా అండర్సన్ గాయంపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు  (ఈసీబీ) దృష్టి సారించింది.   వచ్చే నెల  1 నుంచి  ఇంగ్లాండ్  ఐర్లాండ్ తో  టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కు అండర్సన్ ను దూరంగా ఉంచాలని  ఈసీబీ భావిస్తున్నది. 

46

ఈసీబీ  వర్గాల సమాచారం మేరకు   అండర్సన్  కు గాయం   తీవ్రత బాగానే ఉందని అతడు  వచ్చే యాషెస్ లోపు కోలుకోవడం కూడా అనుమానమేనని తెలుస్తున్నది.  బర్మింగ్‌‌హామ్ వేదికగా  జూన్ 16 నుంచి  జరుగబోయే  ఫస్ట్ టెస్టు వరకు  అండర్సన్ అందుబాటులోకి రాకుంటే ఇంగ్లాండ్ కు  తిప్పలు తప్పవు. 

56

ఇదివరకే ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్  ఫిట్నెస్ ఇష్యూస్ తో  ఐపీఎల్ నుంచి తప్పుకుని  ఈసీబీ పర్యవేక్షణలో రిహాబిటేషన్ లో ఉన్నాడు.  అతడు యాషెస్ వరకు కోలుకునేది  అనుమానమే.   

66
Image credit: PTI

Image credit: PTI

ఆర్చర్ మాత్రమే కాదు ఇంగ్లాండ్ టెస్టు సారథి బెన్ స్టోక్స్ కూడా మోకాలి గాయం కారణంగా  ఇంకా ఫిట్నెస్ సాధించలేదు.  ఐపీఎల్ లో అతడు   రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. తర్వాత గాయం కారణంగా   మళ్లీ   బరిలోకి దిగలేదు. ఆర్చర్, స్టోక్స్ తర్వాత ఒలీ స్టోన్  కూడా  కౌంటీ ఛాంపియన్‌షిప్ లో  భాగంగా  ఇటీవలే  గాయపడ్డాడు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India : టీమిండియాను శాసించిన మన తెలుగు క్రికెటర్లు వీరే !
Recommended image2
IND vs NZ : ధోనీ, కోహ్లీ వల్లే కాలేదు.. సూర్య భాయ్ కొట్టి చూపిస్తాడా?
Recommended image3
T20 World Cup టెన్షన్ లో భారత్.. న్యూజిలాండ్‌పై బుమ్రా మ్యాజిక్ పనిచేయదా? కారణమేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved