- Home
- Sports
- Cricket
- టీ20ల్లో చోటు లేదు! ఇప్పుడు టెస్టుల్లో కూడా పాయే! కెఎల్ రాహుల్ ఇక వన్డేలకే పరిమితమా...
టీ20ల్లో చోటు లేదు! ఇప్పుడు టెస్టుల్లో కూడా పాయే! కెఎల్ రాహుల్ ఇక వన్డేలకే పరిమితమా...
టీమిండియా తరుపున మూడు ఫార్మాట్లు ఆడే ప్లేయర్ల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్... ముగ్గురూ టీమిండియా తరుపున మూడు ఫార్మాట్లు ఆడేవాళ్లు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పూర్తిగా టీ20లకు దూరంగా ఉంటున్నారు. ఈ ఇద్దరు సీనియర్లకు టీమ్ మేనేజ్‌మెంట్, టీ20ల నుంచి రెస్ట్ ఇచ్చిందా? లేక వీళ్లు వన్డేలపైన ఫోకస్ పెట్టడానికి పొట్టి ఫార్మాట్ నుంచి దూరంగా ఉన్నారా? అనేది తేలాల్సి ఉంది..
టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడుతూ మెయిడిన్ ఓవర్లు ఇస్తున్న కెఎల్ రాహుల్‌ని టీ20ల నుంచి తప్పించింది టీమిండియా. ఇప్పుడు టెస్టుల్లో కూడా చోటు కోల్పోయాడు కెఎల్ రాహుల్. మొదటి రెండు టెస్టులకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, మూడో టెస్టుకి ముందు ఆ పదవి కోల్పోయాడు...
KL Rahul
మూడో టెస్టులో కెఎల్ రాహుల్ స్థానంలో శుబ్‌మన్ గిల్‌కి అవకాశం ఇచ్చింది టీమిండియా. సూపర్ ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 18 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. భారీ స్కోరు చేయకపోయినా క్రీజులో ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడు...
Image credit: Getty
శుబ్‌మన్ గిల్‌ని ఒక్క టెస్టు ఆడించి పక్కనబెట్టడం వీలుకాదు. ఫిట్‌గా ఉంటే ఆఖరి టెస్టులో కూడా అతనికి అవకాశం దక్కడం ఖాయం. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎలా ఆడినా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయడం దాదాపు ఖాయమే...
ఎలా చూసినా శుబ్‌మన్ గిల్ రాకతో కెఎల్ రాహుల్‌కి టెస్టుల్లో కూడా ప్లేస్ పోయినట్టే... ఇంతకుముందు మయాంక్ అగర్వాల్ కారణంగా రెండేళ్ల పాటు రిజర్వు బెంచ్‌లో కూర్చున్నాడు కెఎల్ రాహుల్. 2021 ఇంగ్లాండ్ టూర్‌లో మయాంక్ అగర్వాల్ గాయపడడంతో అనుకోకుండా టీమ్‌లోకి వచ్చి వైస్ కెప్టెన్‌గా సెటిల్ అయ్యాడు...
శుబ్‌మన్ గిల్ రాకతో ఏడాదిన్నరలో మళ్లీ టెస్టుల్లో చోటు కోల్పోయాడు కెఎల్ రాహుల్. రంజీ ట్రోఫీలో 990 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, టెస్టు టీమ్ నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నాడు. అలా చూసినా రాహుల్ ఇప్పట్లో తిరిగి టెస్టు టీమ్‌లోకి రావడం కష్టమే...
రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడడంతో వన్డేల్లో మాత్రం కెఎల్ రాహుల్ ప్లేస్‌కి ఇప్పట్లో వచ్చిన ముప్పు అయితే లేదు. వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా రాహుల్, భారత జట్టుకి మిడిల్ ఆర్డర్‌లో ఆడతాడు. ఇషాన్ కిషన్ ఆ ప్లేస్‌ని బాగా వాడుకుని రిప్లేస్ చేస్తే మాత్రం... అక్కడ కూడా రాహుల్‌కి చెక్ పడుతుంది...