- Home
- Sports
- Cricket
- నన్నే తీసేస్తారా..? నేనేంటో ఇండియా సిరీస్ లో చూపిస్తా.. సన్ రైజర్స్ చేసిన పనికి కోపంతో ఊగిపోతున్న కేన్ మామ
నన్నే తీసేస్తారా..? నేనేంటో ఇండియా సిరీస్ లో చూపిస్తా.. సన్ రైజర్స్ చేసిన పనికి కోపంతో ఊగిపోతున్న కేన్ మామ
IPL 2023 Retention: ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023లో భాగంగా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ చేసిన పని న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ కు కోపం తెప్పించింది. దీంతో అతడు తానేంటో నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో డేవిడ్ వార్నర్ అంత కాకపోయినా కేన్ విలియమ్సన్ కూడా ఫేమస్ పర్సనాలిటీనే. హైదరాబాద్ అభిమానులంతా ‘కేన్ మామ’అని పిలుచుకునే ఈ న్యూజిలాండ్ వెటరన్ ఆటగాడికి ఈ సీజన్ నుంచి ఎస్ఆర్హెచ్ తో సంబంధాలు తెగిపోయాయి.
ఐపీఎల్ రిటెన్షన్ లో భాగంగా హైదరాబాద్ యాజమాన్యం.. 2015 నుంచి జట్టుతో ఉంటున్న కేన్ విలియమ్సన్ ను పక్కకుబెట్టింది. అతడిని వేలంలోకి వదిలేసింది. 2021 సీజన్ లో డేవిడ్ వార్నర్ ను పక్కనబెట్టి మరీ కేన్ మామకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పిన హైదరాబాద్.. 2022 సీజన్ లో అతడిని రూ. 14 కోట్లకు దక్కించుకుని అందరికీ షాకిచ్చింది.
అయితే 2022 సీజన్ లో కేన్ మామ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ సీజన్ లో హైదరాబాద్ సారథి.. 13 ఇన్నింగ్స్ లో 93.50 సగటుతో 216 పరుగులు మాత్రమే చేశాడు.ఇది జట్టు యాజమాన్యం తో పాటు అభిమానులకూ ఆగ్రహం తెప్పించింది. అదీగాక కేన్ మామ ఆట కూడా టెస్టులను తలపించింది.
దీంతో ఎస్ఆర్హెచ్ రూ 14 కోట్లు బూడిదలో పోసిన పన్నీరనే కామెంట్లు వినిపించాయి. అదీగాక ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో కూడా కేన్ మామ ఆటను చూశాక అసలు ఇది టీ20 ఆటేనా..? అనే అనుమానాలూ కలిగాయి.
ఇక హైదరాబాద్ తనను రిలీజ్ చేసిన వార్త తెలియగానే కేన్ మామ కూడా బాగా ఫీలయ్యాడట. తనను జట్టు నుంచి తప్పించిన హైదరాబాద్ యాజమాన్యానికి తగిన బుద్ది చెప్పాలని ఫిక్స్ అయ్యాడట. అందుకు ఇండియాతో సిరీస్ నే వేదికగా ఎంచుకున్నాడు కేన్.
ఈ సిరీస్ లో ధాటిగా ఆడి తనలో ఇంకా సత్తువ తగ్గలేదని నిరూపించడానికి కేన్ మామ సిద్ధమయ్యాడట. ఈ మేరకు వెల్లింగ్టన్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. ‘వాస్తవానికి ఇండియాతో టీ20 సిరీస్ కు కేన్ దూరంగా ఉందామనుకున్నాడు.కానీ ఈ వార్త (రిటెన్షన్) తెలియగానే అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తన టీ20 స్కిల్స్ ను ప్రశ్నిస్తున్న వారికి బ్యాట్ తోనే సమాధానం చెప్పడానికి తన బ్యాట్ కు పని చెప్పనున్నాడు..’ అని తెలిపింది.