- Home
- Sports
- Cricket
- అప్పుడు రోహిత్ శర్మ, ఇప్పుడు విరాట్ కోహ్లీ... అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ముందు...
అప్పుడు రోహిత్ శర్మ, ఇప్పుడు విరాట్ కోహ్లీ... అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ముందు...
అండర్-19 వరల్డ్‌కప్ 2022 టోర్నీలో భారత యువ జట్టు ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. అద్భుత విజయాలతో ఐదో టైటిల్‌కి అడుగు దూరంలో నిలిచిన అండర్-19 టీమిండియాతో ఆన్‌లైన్ ద్వారా ముచ్చటించాడు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ...

అండర్-19 ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడినా, ఆ తర్వాత అత్యద్భుత విజయాలతో టైటిల్ సాధించింది భారత అండర్-19 టీమ్...
అదే జోరుతో వరల్డ్‌కప్ టోర్నీని ఆరంభించి, క్వార్టర్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి, గత అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.
సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయాన్ని అందుకున్న భారత యువ జట్టు, వరుసగా నాలుగోసారి అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి అర్హత సాధించింది...
అండర్-19 వరల్డ్ కప్ టోర్నీకి వెస్టిండీస్‌కి బయలుదేరి వెళ్లే ముందు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో టీమిండియా నయా సారథి రోహిత్ శర్మ, యువ భారత జట్టుతో ముచ్చటించి విలువైన సలహాలు సూచనలు ఇచ్చాడు..
గాయం కారణంగా సౌతాఫ్రికా టూర్‌కి దూరమైన రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజా కూడా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్టుల్లో పాల్గొన్నారు...
తాజాగా ఫైనల్ మ్యాచ్‌కి టీమిండియా మాజీ కెప్టెన్, అండర్-19 వరల్డ్‌కప్ 2008 విన్నింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ... కుర్రాళ్లతో ఆన్‌లైన్ ద్వారా సమావేశమయ్యాడు...
ఆన్‌లైన్ ద్వారా అండర్-19 వరల్డ్‌కప్ 2022 టీమ్ సభ్యులతో మాట్లాడిన విరాట్ కోహ్లీ, వారికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు...
అండర్-19 టీమ్ ఆఫ్ స్పిన్నర్ కుశాల్ తంబేతో పాటు ఆల్‌రౌండర్ రాజవర్థన్ హంగేర్కర్, విరాట్ కోహ్లీతో ఆన్‌లైన్ సమావేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు...