గెలిచినా ఓడినా కెప్టెన్‌దే బాధ్యత! మ్యాచ్ మొదలయ్యాక నాదేం లేదు.. టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్...
క్రికెట్ కెరీర్‌ని ఎలాంటి మచ్చ లేకుండా ముగించాడు రాహుల్ ద్రావిడ్. అయితే టీమిండియా హెడ్ కోచ్ అయ్యాక రాహుల్ ద్రావిడ్ తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈ అనుభవంతో ద్రావిడ్, వన్డే వరల్డ్ కప్ అయ్యాక హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటాడని సమాచారం..
Virat Kohli Rahul Dravid
రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాక విరాట్ కోహ్లీని బీసీసీఐ బలవంతంగా వన్డే కెప్టెన్సీ తప్పించడం, టీమిండియా స్వదేశంలో మునుపటిలా మ్యాచులను గెలవలేకపోవడం ట్రోలింగ్‌కి కారణంగా మారాయి..
అదీకాకుండా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రెండేళ్లలో ఏడుగురు కెప్టెన్లను మార్చింది భారత పురుషుల క్రికెట్ జట్టు. ఇంతకుముందు ఎప్పుడూ ఏ జట్టు కూడా ఇంత తక్కువ కాలంలో ఇంత మంది కెప్టెన్లు మార్చలేదు..
Rahul Dravid-Hardik Pandya
‘నిజం చెప్పాలంటే ఒక్కసారి మ్యాచ్ మొదలయ్యాక అది కెప్టెన్ టీమ్. ఏం జరిగినా చూసుకోవాల్సింది అతనే. గెలిచినా, ఓడినా అతనిదే బాధ్యత. డ్రెస్సింగ్ రూమ్‌లో తీసుకున్న నిర్ణయాలను, గ్రౌండ్‌లో అమలు చేయాల్సింది కెప్టెనే...
Shubman Gill-Rahul Dravid
కోచ్‌గా నా బాధ్యత సరైన ప్లేయర్లను తీసుకోవడం, టీమ్ కాంబినేషన్ సెట్ చేయడం, జట్టును ధృడంగా మార్చడం, టీమ్ గెలవడానికి ఏం చేయాలో ప్రణాళికలు రూపొందించడమే. అది డ్రెస్సింగ్ రూమ్‌తోనే అయిపోతుంది.
మ్యాచ్ మొదలయ్యాక కోచ్, గీత దాటడానికి ఉండదు. గీత అవతల ఉన్న వాళ్లే ఆడాలి, గెలవాలి. కోచ్ ఒక్క పరుగు కూడా చేయడు, ఒక్క వికెట్ కూడా తీయడు. మేం చేసేది, చేయగలిగింది ప్లేయర్లను సపోర్ట్ చేయడం మాత్రమే..
Rahul Dravid-Rohit Sharma
విదేశాల్లో పిచ్‌ల కంటే ఇండియాలో పిచ్‌లు క్లిష్టంగా ఉంటాయి. ఎర్రమట్టి నేల, నల్ల మట్టి నేల, రెండూ కలిసినవి.. ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి భారత్‌లో ప్రపంచ కప్ గెలవడం మిగిలినదేశాల కంటే కష్టం..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్..