- Home
- Sports
- Cricket
- బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో టాప్ 6లోకి విరాట్ కోహ్లీ ఎంట్రీ... మళ్లీ టాప్ ప్లేస్‌కి దక్కించుకోగలడా?...
బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో టాప్ 6లోకి విరాట్ కోహ్లీ ఎంట్రీ... మళ్లీ టాప్ ప్లేస్‌కి దక్కించుకోగలడా?...
విరాట్ కోహ్లీ, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కొన్నేళ్ల పాటు టాప్ పొజిషన్‌ని అనుభవించిన క్రికెటర్. అయితే 2020 ఏడాది తర్వాత పెద్దగా వన్డేలు ఆడని విరాట్ కోహ్లీ, ఆడిన మ్యాచుల్లో కూడా పెద్దగా పర్ఫామెన్స్ చూపించలేకపోయాడు...

Image credit: PTI
2021 ఏడాది నెం.1 వన్డే బ్యాటర్‌గా మొదలెట్టిన విరాట్ కోహ్లీ... పేలవ ఫామ్‌తో వరుసగా విఫలం కావడంతో 2022 ఏడాది చివరకి టాప్ 12కి పడిపోయాడు. అయితే గత ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో సెంచరీ చేసి మూడేళ్ల బ్రేక్‌ని బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ...
virat kohli
తాజాగా శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలోనూ సెంచరీ బాదాడు విరాట్ కోహ్లీ. వన్డే కెరీర్‌లో వెంటవెంట మ్యాచుల్లో సెంచరీలు బాదడం విరాట్ కోహ్లీకి ఇది 11వ సారి. ఏబీ డివిల్లియర్స్ 7 సార్లు, బాబర్ ఆజమ్ 6 సార్లు, రోహిత్ శర్మ 5 సార్లు ఈ ఫీట్ సాధించి... కోహ్లీ తర్వాతి ప్లేసుల్లో ఉన్నారు...
అత్యంత వేగంగా వన్డేల్లో 12500 పరుగులు అందుకున్న బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో, శ్రీలంకతో మ్యాచ్‌లోనూ సరిగ్గా 113 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
సచిన్ టెండూల్కర్ 73 అంతర్జాతీయ సెంచరీలు అందుకోవడానికి 549 ఇన్నింగ్స్‌లు తీసుకోగా విరాట్ కోహ్లీ 541 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. వన్డేల్లో 45 సెంచరీలు పూర్తి చేసుకోవడానికి సచిన్ 424 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే విరాట్ కోహ్లీ 257 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు...
Image credit: PTI
వరుస సెంచరీలతో కమ్‌బ్యాక్ ఇచ్చిన విరాట్ కోహ్లీ, ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దుమ్మురేపాడు. బంగ్లాతో సెంచరీ తర్వాత టాప్ 8లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, లంకతో సెంచరీ తర్వాత టాప్ 6లోకి ఎగబాకాడు...
శ్రీలంకతో మొదటి వన్డేలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఓ స్థానం ఎగబాకి టాప్ 8లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2021 ఏడాది ఆరంభంలో విరాట్ టాప్ 1లో ఉంటే రోహిత్ శర్మ టాప్ 2లో ఉన్న విషయం తెలిసిందే..
virat kohli
విరాట్ కోహ్లీ మళ్లీ టాప్ ప్లేస్ దక్కించుకోవాలంటే శ్రీలంకతో జరిగిన మిగిలిన రెండు వన్డేలతో పాటు న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో మంచి పర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది...
ఈ రెండు సిరీసుల్లో విరాట్ బ్యాటు నుంచి మెరుపులు వస్తే టాప్ 3లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో విరాట్ విశ్వరూపం చూపిస్తే టాప్ ప్లేస్‌ని మళ్లీ కైవసం చేసుకోవచ్చు..