- Home
- Sports
- Cricket
- AFG vs SA: దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్ గెలిచేది ఎవరు? డ్రీమ్11 ఫాంటసీ, పిచ్ రిపోర్టు, జట్ల వివరాలు ఇవిగో
AFG vs SA: దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్ గెలిచేది ఎవరు? డ్రీమ్11 ఫాంటసీ, పిచ్ రిపోర్టు, జట్ల వివరాలు ఇవిగో
Afghanistan vs South Africa: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ శుక్రవారం కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియంలో తన తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. పిచ్ రిపోర్టు, ప్లేయింగ్ 11, డ్రీమ్ 11 ఫాంటసీ వివరాలు ఇలా ఉన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
AFG vs SA Dream11 prediction: కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మూడో మ్యాచ్ లో తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఒక్కో జట్టుకు కేవలం మూడు గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లు మాత్రమే ఉండే ఈ హై-ప్రెజర్ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు తమ ఎంట్రీని గెలుపుతో ప్రారంభించాలని చూస్తున్నాయి.
AFG vs SA డ్రీమ్ 11 అంచనాలు:
ఆఫ్ఘనిస్తాన్ - దక్షిణాఫ్రికాలు వన్డేల్లో ఐదుసార్లు తలపడ్డాయి. ఇందులో మూడు సార్లు సౌతాఫ్రికా విజయం సాధించగా, రెండు మ్యాచ్ లలో ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది. అయితే, ఆఫ్ఘనిస్తాన్ ఇటీవల సెప్టెంబర్ 2024లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో దక్షిణాఫ్రికాను 2-1తో ఓడించి సంచలనం రేపింది. అంటే రషీద్ ఖాన్ టీమ్ ను ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయలేము. సౌతాఫ్రికా ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడే ప్లేయర్లతో టైటిల్ ఫేవరెట్ గా ఉంది.
Image Credit: Getty Images
ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా మ్యాచ్ వివరాలు:
మ్యాచ్ జరిగే తేదీ: 21 ఫిబ్రవరి 2025
మ్యాచ్ జరిగే సమయం: IST మధ్యాహ్నం 2:30
మ్యాచ్ జరిగే వేదిక: నేషనల్ స్టేడియం, కరాచీ, పాకిస్తాన్
మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ ఎక్కడ చూడొచ్చు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో హాట్ స్టార్ యాప్ & వెబ్ సైట్
Rashid Khan
ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా: పిచ్, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి?
కరాచీ నేషనల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్-బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. అయితే, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడానికి ముందు పేసర్లకు సహకరిస్తుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ కొద్దీ, స్పిన్నర్లు కొంతవరకు అనుకూలంగా మారవచ్చు. దీంతో రెండవ ఇన్నింగ్స్‌లో స్ట్రోక్-మేకింగ్ కష్టమవుతుంది. పరిస్థితులు ఎక్కువగా మేఘావృతమై 31°C ఉష్ణోగ్రతలు ఉంటాయని భావిస్తున్నారు. వర్షం పడే అవకాశం చాలా తక్కువ.
ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా ప్రివ్యూ:
ఇటీవల యూఏఈలో దక్షిణాఫ్రికాపై 2-1 తేడాతో సిరీస్ విజయాన్ని సాధించిన ఆఫ్ఘనిస్తాన్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఆ టీమ్ లో రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్ళు ఉన్నారు. వారు జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తారు. అయితే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ ఫేవరెట్ గా ఉన్న సౌతాఫ్రికాను ఓడించడం అంత ఈజీ కాదు.
మరోవైపు, దక్షిణాఫ్రికా ప్రపంచ క్రికెట్‌లో చాలా బలమైన జట్లలో ఒకటిగా ఉంది. ఐసీసీ టోర్నమెంట్లలో నిలకడగా రాణిస్తున్న ప్రోటీస్ జట్టు 2023 ODI ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్స్, 2024 T20 ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరుకున్నారు. టెంబా బావుమా నేతృత్వంలో ప్రోటీస్ ఒత్తిడిలో రాణించడానికి హెన్రిచ్ క్లాసెన్, కగిసో రబాడా, ఐడెన్ మార్క్రామ్ వంటి అనుభవజ్ఞులైన స్టార్లను కలిగి ఉంది.
ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా డ్రీమ్ 11 అంచనా:
వికెట్ కీపర్లు: హెన్రిచ్ క్లాసెన్, రహ్మానుల్లా గుర్బాజ్
బ్యాటర్స్: రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, ఇబ్రహీం జడ్రాన్, డేవిడ్ మిల్లర్
ఆల్ రౌండర్లు: మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్
బౌలర్లు: కగిసో రబాడ, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూకీ, లుంగి ఎంగిడి
కెప్టెన్ ఎంపికలు: మార్కో జాన్సెన్, రషీద్ ఖాన్
వైస్-కెప్టెన్ ఎంపికలు: హెన్రిచ్ క్లాసెన్, కగిసో రబడ
అఫ్గానిస్తాన్ vs దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI అంచనాలు:
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్.
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా, టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రామ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి, తబ్రైజ్ షమ్సీ.