MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • మేం పులులను చూడటానికి వెళ్తే అందరూ ద్రావిడ్‌ను చూస్తున్నారు.. ఈ ప్రపంచంలో 4 వేల పులులుండొచ్చు.. కానీ అతడొక్కడే

మేం పులులను చూడటానికి వెళ్తే అందరూ ద్రావిడ్‌ను చూస్తున్నారు.. ఈ ప్రపంచంలో 4 వేల పులులుండొచ్చు.. కానీ అతడొక్కడే

Ross Taylor: ప్రపంచ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత తన పుస్తకంతో సంచలనాలు సృష్టిస్తున్నాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్. తాజాగా టేలర్.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

2 Min read
Author : Srinivas M
Published : Aug 14 2022, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

న్యూజిలాండ్ మాజీ  క్రికెటర్ రాస్ టేలర్ క్రికెట్ నుంచి వైదొలిగినా సంచలనాలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన ఈ మిడిలార్డర్ బ్యాటర్.. తాజాగా తన  జీవిత చరిత్రకు సంబంధించిన ‘బ్లాక్ అండ్ వైట్’  పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇప్పటికే కివీస్ క్రికెట్ లో వివక్ష,  దాని కారణంగా తాను ఎదుర్కున్న సమస్యలపై ఏకరువు పెట్టిన టేలర్.. ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ ఓనర్ ఒకరు తనపై చేయి చేసుకున్నట్టు కూడా వెల్లడించి అందరినీ షాక్ కు గురి చేశాడు.  ఇక తాజాగా టేలర్.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ద్రావిడ్ ఒక్కడే 4 వేల పులులతో సమానమని, భారత్ లో ప్రజలు అతడిని ఎంతగా ఆరాధిస్తారో తాను స్వయంగా చూశానని పేర్కొన్నాడు.  

38

టేలర్ తన పుస్తకంలో.. ‘‘నేను ఒకసారి ద్రావిడ్‌తో  నువ్వు ఇదివరకు ఎన్ని పులులను చూశావు..? అని అడిగా. అప్పుడు ద్రావిడ్.. ‘నేను ఇప్పటివరకు పులిని చూడటానికి 21 సార్లు అడవికి వెళ్లాను. కానీ ఒక్కసారి కూడా చూడలేకపోయా..’ అని అన్నాడు. అది విన్న నాకు ఆశ్చర్యమేసింది. ఒకవేళ నాకే అలాగే జరిగిఉంటే నేను  నేను డిస్కవరీ ఛానెల్ చూస్తా అనుకున్నా. 

48

ఒకసారి మేము (ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తో ఈ ఇద్దరూ కలిసే ఆడారు)  రాజస్తాన్ లోని ఓ నేషనల్ పార్కుకు వెళ్లాం.  అక్కడ టీ-17 అనే ట్యాగ్ ఉన్న పులిని చూశాం. దానిని చూసిన తర్వాత ద్రావిడ్ చాలా థ్రిల్ ఫీలయ్యాడు. 21 సఫారీలలో పులిని చూడని ద్రావిడ్.. అరగంట ప్రయాణంలోనే పులిని చూశాడు.. 

58

మేము పులిని చూడటానికి వెళ్లినప్పుడు అక్కడొక ఆసక్తికర ఘటనను చూశా నేను. మేము పులిని చూడటానికి ఒక ఓపెన్ టాప్ ఎస్‌యూవీలో వెళ్లాం. అక్కడ పులిని దాదాపు 100 మీటర్ల దూరం నుంచే చూశాం. మేం పులిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. 
 

68

మాతో పాటు పులిని చూడటానికి అక్కడికి కొంతమంది వచ్చారు. వారంతా పులిని చూడకుండా వాళ్ల కెమెరాలలో రాహుల్ ద్రావిడ్ ఫోటోలు తీశారు. అతడిని కలవడానికి  ఉత్సాహపడుతున్నారు. అది చూసి నేను షాక్ కు గురయ్యా. అక్కడున్నవారికి  పులిని చూసిన ఆనందం కంటే రాహుల్ ద్రావిడ్ ను చూశామన్న ఆనందం ఎక్కువగా ఉంది. 

78

నాకప్పుడు అనిపించింది. ఈ ప్రపంచం మొత్తమ్మీద 4 వేల పులులు ఉండొచ్చు. కానీ రాహుల్ ద్రావిడ్ మాత్రం ఒక్కడే. రాహుల్ క్రేజ్ ను  నేను ప్రత్యక్షంగా చూసిన ఘటన అది’ అని తన పుస్తకంలో రాసుకొచ్చాడు టేలర్. 

88

ద్రావిడ్-టేలర్‌లు 2008 నుంచి 2011 వరకు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడారు. ఆ తర్వాత  2011 సీజన్‌లో ఈ ఇద్దరూ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడారు. అప్పట్నుంచి వీరి మధ్య మంచి స్నేహభావం ఉంది. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved