- Home
- Sports
- Cricket
- ఊరించే లక్ష్యం, చేతిలో 9 వికెట్లు... అయినా విరాట్ కోహ్లీని వెంటాడుతున్న సెంటిమెంట్...
ఊరించే లక్ష్యం, చేతిలో 9 వికెట్లు... అయినా విరాట్ కోహ్లీని వెంటాడుతున్న సెంటిమెంట్...
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువగా ఉంది. ఆఖరి రోజు మరో 157 పరుగులు చేస్తే చాలు... తొలి టెస్టులో విజయాన్ని అందుకుని, టెస్టు సిరీస్‌లో 1-0 లీడ్ దక్కించుకోవచ్చు. అయితే అభిమానుల్లో ఏదో తెలియని భయం, ఆందోళన...

నాటింగ్‌హమ్‌లో ఇప్పటివరకూ ఛేదించిన అత్యధిక స్కోరు 208 పరుగులు. అది జరిగి కూడా 60 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు టీమిండియా, 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం అందుకుంటే, సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది...
కెప్టెన్ జో రూట్ సెంచరీ చేసిన ఏ మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్ జట్టు ఓడిపోలేదు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన జో రూట్, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీతో భారత్ జట్టు ముందు మంచి లక్ష్యాన్ని పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు...
టెస్టుల్లో 21 సెంచరీలు చేసిన జో రూట్, తాను సెంచరీ చేసిన ప్రతీ మ్యాచ్‌లో విజయాన్ని లేదా డ్రాని అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లాండ్, రెండో ఇన్నింగ్స్‌లో 200+ లీడ్ సాధించిందంటే రూట్ సెంచరీయే కారణం...
అన్నింటికీ మించి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు, ఏ విదేశీ టెస్టులోనూ నాలుగో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించి విజయం అందుకున్నది లేదు. కెప్టెన్‌గా విదేశాల్లో విరాట్ సేన అందుకున్న విజయాలన్నీ మొదట బ్యాటింగ్ చేసి, నాలుగో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి దక్కించుకున్నవే...
ఆస్ట్రేలియా టూర్‌లో గబ్బా టెస్టుల్లో 300+ లక్ష్యాన్ని ఛేజ్ చేసి చారిత్రక విజయాన్ని అందుకుంది టీమిండియా. అయితే ఆ టెస్టుకి అజింకా రహానే కెప్టెన్...
అయితే తొలి టెస్టులో ఓ పాజిటివ్ సెంటిమెంట్ కూడా టీమిండియాదే విజయమనే ఆశను కలిగిస్తోంది. అదేటంటే... భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా, ఒకే ఇన్నింగ్స్‌లో మూడు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏ మ్యాచ్‌లోనూ భారత జట్టు ఓడిపోలేదు...
తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. బుమ్రా ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది ఆరోసారి... ఈ ఆరు మ్యాచుల్లోనూ టీమిండియా విజయం అందుకుంది...
జో రూట్ సెంచరీతో ఇంగ్లాండ్ గెలుస్తుందా... లేక జస్ప్రిత బుమ్రా సెంటిమెంట్ టీమిండియాను గెలిపిస్తుందా... విరాట్ కోహ్లీని వెంటాడుతున్న బ్యాడ్‌లక్ ఇప్పటికైనా ముగుస్తుందా అని ఆసక్తిగా ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు...