MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • 7 సిక్సర్లు, 7 ఫోర్లు - జోష్ ఇంగ్లిస్ టీ20 ఫాస్టెస్ట్ సెంచ‌రీ

7 సిక్సర్లు, 7 ఫోర్లు - జోష్ ఇంగ్లిస్ టీ20 ఫాస్టెస్ట్ సెంచ‌రీ

Josh Inglis fastest T20 Century : స్కాట్లాండ్ తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 70 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. జోష్ ఇంగ్లిస్ అద్భుత సెంచరీతో ఆస్ట్రేలియాకు అద్బుత విజ‌యాన్ని అందించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Sep 07 2024, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Josh Inglis fastest T20 Century : ఎడిన్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో స్కాటిష్‌ల ఆశలను చిత్తు చేస్తూ జోష్ ఇంగ్లిస్ అద్భుతమైన సెంచరీని సాధించాడు. అంత‌ర్జాతీయ‌ టీ20 లలో అతనికి ఇది రెండో సెంచ‌రీ. ఒక ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ గా టీ20 క్రికెట్ లో అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీగా ఇది నిలిచింది. 

ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ 49 బంతుల్లో 7 ఫోర్లు, 7  సిక్సర్లతో సెంచ‌రీ కొట్టాడు. 103 ప‌రుగుల త‌న సెంచ‌రీ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా త‌ర‌ఫున టీ20 క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచ‌రీగా నిలిచింది.

197 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన స్కాట్లాండ్ కు అద్భుత‌మైన ఆరంభాన్ని అందించారు ఆ జ‌ట్టు ఓపెన‌ర్లు. అయితే, ఆ త‌ర్వాత ఛేజింగ్‌లో చాలా వెనుక‌ప‌డిపోయింది. వ‌రుస‌గా వికెట్లు కోల్పోయి ఓట‌మిపాలైంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

స్కాట్లాండ్‌తో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. తొలి టీ20లో ఆస్ట్రేలియా జట్టు భారీ విజయం సాధించగా, రెండో టీ20 మ్యాచ్ లో స్కాట్లాండ్ కెప్టెన్ రిచీ బెరింగ్టన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

తొలి మ్యాచ్ లో స్కాట్లాండ్ కు చుక్క‌వు చూపించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ లో పెద్ద ఇన్నింగ్స్ ను ఆడ‌లేక‌పోయాడు. చాలా త్వ‌ర‌గానే ఔట్ అయ్యాడు.

గత మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్.. ఈ మ్యాచ్‌లో తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ మెక్‌కర్గ్ 16 బంతుల్లో 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 

35

ఆ త‌ర్వాత‌ జోష్ ఇంగ్లిస్-కెమెరాన్ గ్రీన్ ఆస్ట్రేలియా కు మంచి భాగస్వామ్యాని అందించారు. ఒక ఎండ్‌లో కెమెరూన్ గ్రీన్ ప్రశాంతంగా ఆడటంతో మ‌రో ఎండ్ లో జోష్ ఇంగ్లిస్ యాక్షన్‌లో బిజీగా ఉన్నాడు.

జోష్ ఇంగ్లిస్ ప్రతి ఓవర్‌లో ఒక సిక్సర్, ఒక బౌండరీతో 20 బంతుల్లో తన హాఫ్ సెంచ‌రీని పూర్తి చేశాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు స్కోరు 10 ఓవర్లలో 100 పరుగులకు చేరుకుంది. జోష్ ఇంగ్లిస్ తర్వాత త‌న బ్యాటింగ్ గేర్ ను మార్చాడు.

45
Josh Inglis

Josh Inglis

త‌న దూకుడు పెంచుతూ బౌండ‌రీల వ‌ర్షం రురిపించాడు. స్టోయినిస్ రాకముందు కామెరాన్ గ్రీన్ 29 బంతుల్లో 36 పరుగులు చేశాడు. జోష్ ఇంగ్లిస్ 43 బంతుల్లో 7 సిక్సర్లు, 7 ఫోర్లతో సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో జోష్ ఇంగ్లిస్‌కి ఇది 2వ సెంచరీ.

జోష్ ఇంగ్లిష్ 103 పరుగుల వద్ద అవుట్ కావడంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ ఈ సెంచరీ చేయడం ద్వారా టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 47 బంతుల్లో సెంచ‌రీ కొట్టాడు. 

 

55

భారత జట్టుపై టీ20లో జోష్ ఇంగ్లిస్ ఇప్పటికే 47 బంతుల్లో సెంచరీ సాధించాడు. కాగా, ఇదివ‌ర‌కు జోష్ ఇంగ్లీస్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) ఏ జ‌ట్టు కూడా అత‌న్ని కోనుగోలు చేయ‌డానికి ఆస‌క్తి చూప‌లేదు.  ఇప్పుడు వ‌రుస‌గా అద్భుత‌మైన ఇన్నింగ్స్ లు ఆడుతున్న అత‌ను రాబోయే ఐపీఎల్ 2025 సీజ‌న్ మెగా వేలంలో డిమాండ్ ప్లేయ‌ర్ గా మారే అవ‌కాశ‌ముంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
CSK: మూడేళ్లుగా ప్లేఆఫ్స్ మిస్.. ఆరో ఐపీఎల్ ట్రోఫీ కోసం సీఎస్కే బిగ్ స్కెచ్
Recommended image2
ICC T20 Rankings: టీ20ల్లో నంబర్ 1.. అభిషేక్ శర్మ దెబ్బకు రికార్డులు షేక్
Recommended image3
Fastest T20 Fifty : 9 బంతుల్లో 50 పరుగులేంటి సామీ! టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిందెవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved