- Home
- Sports
- Cricket
- Cricket : చెడు అలవాట్లతో చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్న టాలెెంటెడ్ క్రికెటర్లు.. టాప్ 5 లిస్ట్
Cricket : చెడు అలవాట్లతో చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్న టాలెెంటెడ్ క్రికెటర్లు.. టాప్ 5 లిస్ట్
అద్భుతాలు చేసే టాలెంట్ ఉన్నా చెడు అలవాట్లతో కొందరు ఇంటర్నేషనల్ క్రికెటర్లు కెరీర్ ను నాశనం చేసుకున్నారు. ఇలా క్రికెట్ ఆడుతూ దారి తప్పిన ఐదుగురు క్రికెటర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఈ క్రికెటర్లు కెరీర్ ఎందుకు నాశనమయ్యిందంటే..
ప్రపంచ క్రికెట్‌లో బ్యాట్, బంతితో కొత్త చరిత్రలు రాసిన గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. కానీ మంచి ప్రతిభ ఉన్నా కొందరి కెరీర్ నాశనమైంది. ఇలా కెరీర్‌ను త్వరగా ముగించుకున్న టాలెంటెడ్ క్రికెటర్లు చాలామంది ఉన్నారు.
ఆటపైనే కాదు అలవాట్లపైన నియంత్రణ సాధించి లారా, సచిన్, విరాట్ కోహ్లీ, ధోని వంటివారు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచారు. మరికొందరేమో వీరితో పాటే కెరీర్ ప్రారంభించి మధ్యలోనే కనుమరుగయ్యారు. ఇలా చేజేతులా కెరీర్ ను నాశనం చేసుకున్న టాప్ 5 క్రికెటర్లు వీరే...
వినోద్ కాంబ్లీ
వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్ కలిసి క్రికెట్ ఆడారు. ఒక మ్యాచ్‌లో సచిన్ తో కలిసి 600 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ప్రపంచానికి చాలా గొప్పగా పనిచయం అయ్యాడు. భారతీయ క్రికెట్ కు సచిన్, కాంబ్లీ రూపంలో ఇద్దరు వజ్రాలు దొరికారని ఆ కాలంలో అందరూ భావించారు. కానీ కాలం గిర్రున తిరిగింది… తన ఆట, అలవాట్లతో సచిన్ క్రికెట్ గాడ్ గా మారారు… కానీ కాంబ్లీ తప్పుడు జీవనశైలి, క్రమశిక్షణారాహిత్యంతో కెరీర్ ను నాశనం చేసుకున్నాడు.
కెవిన్ పీటర్సన్
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అద్భుతమైన బ్యాటర్ … ప్రతిభకు ఏమాత్రం కొదవలేదు. అతని ఆటతీరు అభిమానులకు ఎంతగానో నచ్చేది. కానీ అహంకారం, టీమ్ మేనేజ్‌మెంట్‌తో గొడవల వల్ల తన కెరీర్‌ను పాడుచేసుకున్నాడు. తనను తాను గొప్పగా భావించడం అతనికి చేటు చేసింది.
మహ్మద్ ఆసిఫ్
క్రికెట్ ను ఫాలో అయ్యేవారికి పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్ గురించి తెలిసే ఉంటుంది. అతడి అద్భుతమైన స్వింగ్, పేస్ బౌలింగ్ కు అభిమానులు ఉండేవారు. అతని బౌలింగ్‌కు గొప్పగొప్ప బ్యాటర్లు కూడా తలవంచేవారు. కానీ క్రమశిక్షణారాహిత్యం, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో తన కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకున్నాడు.
హెర్షల్ గిబ్స్
దక్షిణాఫ్రికా ప్రమాదకర బ్యాటర్ హెర్షెల్ గిబ్స్ పరిస్థితి కూడా ఇదే. అతని దూకుడైన బ్యాటింగ్‌కు బౌలర్లు భయపడేవారు. కానీ మందు, పార్టీలు, చెడు జీవనశైలి అతని ప్రతిభను నాశనం చేశాయి. వన్డేల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఈ బ్యాటర్ కెరీర్ చాలా తొందరగా ముగిసింది.
ల్యూక్ పోమర్స్‌బాచ్
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ల్యూక్ పోమర్స్‌బాచ్ కు పెద్దగా పేరు రాకపోయినా, ప్రపంచ క్రికెట్‌ను ఏలేంత ప్రతిభ ఉంది. ఎడమచేతి వాటం బ్యాటర్‌గా అద్భుతంగా ఆడాడు. కానీ మందు క్రమశిక్షణారాహిత్యం వల్ల ఒకే ఒక్క T20 ఆడి కెరీర్ ముగించాడు.

