- Home
- Sports
- Cricket
- నేను చాలా బాగా ఆడాను, అయినా నన్ను ఎందుకు తీసేశారో తెలీదు... 3డీ ప్లేయర్ విజయ్ శంకర్ ఆవేదన...
నేను చాలా బాగా ఆడాను, అయినా నన్ను ఎందుకు తీసేశారో తెలీదు... 3డీ ప్లేయర్ విజయ్ శంకర్ ఆవేదన...
విజయ్ శంకర్... 2019 వన్డే వరల్డ్‌కప్‌కి ఎంపికైన త్రీడీ ప్లేయర్. వరల్డ్‌కప్‌లో వేసిన మొదటి బంతికే వికెట్ తీసి, రికార్డు క్రియేట్ చేసిన విజయ్ శంకర్, ఆ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఎంత బాగా ఆడినా, తనను ఎందుకు తీసేశారో తెలియడం లేదంటున్నాడు విజయ్ శంకర్...
- FB
- TW
- Linkdin
Follow Us

అంబటి రాయుడికి స్థానం ఇవ్వకుండా ఆ స్థానంలో విజయ్ శంకర్‌ని ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ‘విజయ్ శంకర్ ఫీల్డర్‌గా, బౌలర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా... మూడు రకాలుగా జట్టుకి ఉపయోగపడతాడని’ అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి.

2019 వన్డే వరల్డ్‌కప్ ఆడిన విజయ్ శంకర్... ‘నేను ఓ ఆల్‌రౌండర్‌ని కావడం వల్లే భారత జట్టులో ఉండాలని అనుకోవడం లేదు. నేను బ్యాట్‌తో పాటు బాల్‌తో బాగా రాణించాను.

నిజం చెప్పాలంటే నేను జట్టులో ఉండాలని, నాకంటే ఎక్కువగా సెలక్టర్లే భావించారు. వాళ్లు నా సామర్థ్యాలను అంతగా విశ్వసించారు. నాకు ఎప్పుడూ మరో ప్లేయర్‌తో పోల్చి చూడడం నచ్చదు. ఈ విషయం ఇంతకుముందు కూడా చెప్పాను.

కానీ నిజంగా నన్ను మరో ప్లేయర్‌తో పోల్చాలని చూస్తే.... మిగిలిన ఆల్‌రౌండర్ల కంటే నేను బాగా ఆడాను. అయినా నన్ను ఎందుకు జట్టులో నుంచి తీసేశారో తెలియడం లేదు...

ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ నాకు టీమిండియాలో చోటు దక్కుతుందని అనిపించడం లేదు. అది నా చేతుల్లో లేదు. నేను చేయగలిగిందల్లా నిరంతరం శ్రమిస్తూ, అవకాశం వచ్చినప్పుడు నా సామర్థ్యం మేరకు రాణించడానికి సిద్ధంగా ఉండడమే...

టీమిండియాకి ఆడాలనే ప్రతి ఒక్కరూ మళ్లీ జెర్సీ వేసుకోవాలని బలంగా కోరుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను కూడా అదే కోరుకుంటున్నా... నేను జట్టులో ఉన్నప్పుడు ఇచ్చిన పర్ఫామెన్స్ సంతృప్తినిచ్చింది..

అయితే అంత మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన తర్వాత కూడా సెలక్టర్లు, నన్ను పట్టించుకోకపోవడం నిరుత్సాహపరిచింది’ అంటూ కామెంట్ చేశాడు విజయ్ శంకర్.

టీమిండియా తరుపున 12 మ్యాచులు ఆడిన విజయ్ శంకర్, 223 పరుగులు చేసి, 4 వికెట్లు తీశాడు. 9 టీ20 మ్యాచుల్లో 101 పరుగులు చేసి 5 వికెట్లు తీశాడు.

30 ఏళ్ల విజయ్ శంకర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతున్నాడు. అయితే ఇప్పటిదాకా విజయ్ శంకర్, తన పర్ఫామెన్స్‌తో సన్‌రైజర్స్ జట్టుకి ఉపయోగపడిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టొచ్చు...

కేవలం విజయ్ శంకర్‌లాంటి ప్లేయర్లు సరిగ్గా రాణించకపోవడం వల్లే తేలిగ్గా గెలవాల్సిన మ్యాచుల్లో కూడా ఓటమిపాలైంది సన్‌రైజర్స్ హైదరాబాద్..

ఏ మాత్రం ఫిట్‌నెస్ మెయింటైన్ చేయకుండా, గెలవాల్సిన మ్యాచులను కూడా ఓడించే విజయ్ శంకర్... టీమిండియాలో చోటు గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందంటున్నారు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు...

వచ్చే సీజన్‌లో విజయ్ శంకర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి తీసి పక్కనపారేయాలని, అప్పుడు అతన్ని ఎవరు కొనుక్కుంటారో, ఎంతకి కొనుక్కుంటారో తెలుస్తుందని కామెంట్లు చేస్తున్నారు ఎస్ఆర్‌హెచ్ అభిమానులు...