20 ఓవర్లలో 344 పరుగులు.. జింబాబ్వే ప్రపంచ రికార్డుతో పాటు మరో 4 రికార్డులు బ్రేక్
Zimbabwe's 344 for 4 breaks the record : గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే తమ 20 ఓవర్లలో ఏకంగా 344/4 పరుగులు చేసింది. దీంతో అత్యధిక టీ20 పరుగులు సాధించి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.
Zimbabwe's 344 for 4 breaks the record: జింబాబ్వే చరిత్ర సృష్టించింది. క్రికెట్ వరల్డ్ లో అత్యధిక పరుగులు చేసిన టీ20 టీమ్ గా రికార్డు సాధించింది. బుధవారం నైరోబీలోని రురాకా స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్ గ్రూప్ బిలో గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే తమ 20 ఓవర్లలో ఏకంగా 344/4 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సాధించింది. ఒక జట్టుగా భారీ స్కోరు నమోదు చేయడంతో అంతర్జాతీయ టీ20ల చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సాధించింది.
2023లో మంగోలియాపై 20 ఓవర్లలో 314 పరుగులు చేసిన నేపాల్ పేరిట ఉన్న మునుపటి రికార్డును జింబాబ్వే ఈ మ్యాచ్ లో అధిగమించింది. ఈ రికార్డును సాధించడంలో సికిందర్ 43 బంతుల్లో ఏడు ఫోర్లు, 15 సిక్సర్లతో 133 పరుగుల సూపర్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు.
జింబాబ్వే ఈ నెల ప్రారంభంలో బంగ్లాదేశ్‌పై భారత్ హైదరాబాద్‌లో పోస్ట్ చేసిన 6 వికెట్లకు 297 పరుగులను అధిగమించి, అన్ని టెస్ట్ ఆడే దేశాలలో టీ20లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా అవతరించింది.
ఇప్పటి వరకు నేపాల్ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు (314), అత్యధిక సిక్సర్లు (26) కొట్టిన రికార్డును కలిగి ఉంది. దానిని జింబాబ్వే బ్రేక్ చేసింది. ప్రతిగా గాంబియా 54 పరుగులకే ఆలౌటైంది. దీంతో జింబాబ్వే టీ20లలో అతిపెద్ద విజయాన్ని (పరుగుల పరంగా) నమోదు చేసింది.
నైరోబీలోని రురాకా స్పోర్ట్స్ క్లబ్ మైదానం బుధవారం ఈ క్రికెట్ చరిత్రకు సాక్షిగా నిలిచిన జింబాబ్వే తొలి బంతి నుంచే అద్భుత ప్రదర్శన చేసింది. ఈ టీమ్ కేవలం 3.2 ఓవర్లలో యాభై పరుగులు సాధించింది. కేవలం 13 బంతుల్లోనే తాడివానాశే మారుమణి వేగంగా పరుగులు సాధించాడు. పవర్‌ప్లే పూర్తికాకముందే జట్టు వందకు చేరుకుంది.
అక్కడి నుండి వారు బంతిని స్టాండ్స్‌లోకి ఎంత దూరం పంపగలరనే దానిపైనే దృష్టి పెట్టారు. బౌండరీల మోత మోగించారు. ఓవరాల్‌గా ఇన్నింగ్స్‌లో 57 బౌండరీలు ఉన్నాయి ఇది టీ20 మ్యాచ్ క్రికెట్ లో మరో రికార్డు.
నలుగురు జింబాబ్వే బ్యాటర్లు యాభైకి పైగా స్కోర్‌లను సాధించారు. ఇది కూడా ఒక ప్రపంచ రికార్డు. బ్రియాన్ బెన్నెట్ 26 బంతుల్లో 50 పరుగులు చేసాడు. క్లైవ్ మాండండే 17 బంతుల్లో 53 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్స్ కొట్టాడు.
Zimbabwe
సికందర్ రజా ఈ మ్యాచ్ హీరోగా నిలిచాడు. ఫీల్డింగ్ ఆంక్షలు సడలించిన తర్వాత అతను ఏడో ఓవర్ చివరిలో బ్యాటింగ్‌లోకి వచ్చాడు, కానీ ఇన్నింగ్స్ దూకుడులో ఎటువంటి తేడా లేదు. అతను ఎదుర్కొన్న మూడో బంతిని సిక్స్‌గా కొట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించడం మొదలు పెట్టాడు.
టీ20 క్రికెట్ లో రెండో వేగవంతమైన సెంచరీ సాధించాడు. 33 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఫిబ్రవరి 2024లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా తరఫున అతని 33 బంతుల సెంచరీ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ ఇన్నింగ్స్ ను సమం చేశాడు.