- Home
- Sports
- Cricket
- 3 టూర్లు, 3 డిఫరెంట్ రోల్స్... ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి...
3 టూర్లు, 3 డిఫరెంట్ రోల్స్... ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి...
రవిశాస్త్రి పదవీకాలం ముగిసిన తర్వాత భారీ అంచనాలతో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రాహుల్ ద్రావిడ్. 8 నెలల కాలంలో ఆరుగురు కెప్టెన్లతో కలిసి పనిచేసిన రాహుల్ ద్రావిడ్‌కి, ఇంగ్లాండ్ టూర్‌లో అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది...

Rahul Dravid
హెడ్ కోచ్‌గా ఆడిన తొలి విదేశీ పర్యటనలో భారత జట్టు చిత్తుగా ఓడింది. సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన భారత జట్టు, వన్డే సిరీస్‌లో ఒక్క విజయం కూడా అందుకోలేకపోయింది. కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో మూడు వన్డేల్లోనూ వైట్ వాష్ అయ్యింది భారత జట్టు...
దీంతో పూర్తి స్థాయి టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌కి ఇంగ్లాండ్ పర్యటన కీలకం కానుంది. ఈ పర్యటనలో ఇంతకుముందు విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి కలిసి మొదలెట్టిన టెస్టు సిరీస్‌లో ఆఖరి టెస్టును ముగించబోతున్నారు రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ...
విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి హయాంలో విదేశాల్లో అద్భుత విజయాలు అందుకుని, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లకి కూడా చుక్కలు చూపించింది భారత జట్టు. దీంతో ఈసారి టీమిండియా ఎలా ఆడుతుందనేది ద్రావిడ్ కోచింగ్ ఎఫెక్ట్‌ని డిసైడ్ చేయనుంది...
రాహుల్ ద్రావిడ్, 1996 ఇంగ్లాండ్ పర్యటనలో లార్డ్స్ టెస్టులో ఆరంగ్రేటం చేశాడు. సౌరవ్ గంగూలీతో కలిసి టెస్టు ఆరంగ్రేటం చేసిన రాహుల్ ద్రావిడ్, తొలి మ్యాచ్‌లో 95 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు...
ఆ తర్వాత 2007 పర్యటనలో ఇంగ్లాండ్ పర్యటనలో కెప్టెన్‌గా వ్యవహరించాడు రాహుల్ ద్రావిడ్. ఈ పర్యటనలో ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో ఓడించి టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది భారత జట్టు. మొదటి, మూడో టెస్టులను డ్రా చేసుకున్న టీమిండియా, రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని 1-0 తేడాతో సిరీస్ గెలిచింది...
ఇప్పుడు హెడ్ కోచ్‌గా ఇంగ్లాండ్‌లో పర్యటించబోతున్నాడు రాహుల్ ద్రావిడ్. 1996లో ఆరంగ్రేటం చేసిన రాహుల్ ద్రావిడ్, 11 ఏళ్లకు కెప్టెన్‌గా ఇంగ్లాండ్ టూర్‌కి వెళితే... ఆ తర్వాత 15 ఏళ్లకు హెడ్ కోచ్‌గా ఆంగ్లేయుల గడ్డపై అడుగుపెడుతున్నాడు...
Image credit: PTI
బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఇంగ్లాండ్ టూర్‌లో సక్సెస్ సాధించిన రాహుల్ ద్రావిడ్, హెడ్ కోచ్‌గా రాణిస్తాడా? లేదా? అనేది భారత జట్టు ఆటతీరు బట్టి తేలనుంది. జూలై 1 నుంచి మొదలయ్యే ఐదో టెస్టుతో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ టూర్‌లో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది...