ఐపీఎల్ 2022కి ఆలస్యంగా 25 మంది విదేశీ ప్లేయర్లు... డేవిడ్ వార్నర్, రబాడాతో పాటు...
ఐపీఎల్ 2022 మెగా సమరానికి సర్వం సిద్ధమైంది. శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగించుకున్న ప్లేయర్లు, ఐపీఎల్ క్యాంపుల్లో చేరిపోయారు. మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2022 సీజన్ మొదటి వారంలో స్టార్ అట్రాక్షన్ మిస్ అవ్వనుంది...

ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు టెస్టు సిరీస్ ఆడుతోంది. వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లాండ్ జట్టు, సౌతాఫ్రికా పర్యటనలో బంగ్లా ప్లేయర్లు బిజీగా ఉన్నారు...
దీంతో పాకిస్తాన్ మినహా మిగిలిన ఐదు దేశాల క్రికెటర్లు, ఐపీఎల్ 2022 సీజన్ మొదటి వారం మ్యాచులకు దూరం కాబోతున్నారు...
ఆస్ట్రేలియా ప్లేయర్లు జోష్ హజల్‌వుడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, ఆరోన్ ఫించ్, ప్యాట్ కమ్మిన్స్, మార్కస్ స్టోయినిస్, జాసన్ బెహ్రేన్‌డ్రాఫ్, సీన్ అబ్బాట్, నాథన్ ఎల్లీస్... ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీలు ఆడే మొదటి రెండు మ్యాచులకు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది...
అలాగే సౌతాఫ్రికా ప్లేయర్లు అన్రీచ్ నోకియా, డ్వేన్ ప్రీటోరియస్, లుంగి ఇంగిడి, వాన్ దేర్ దుస్సేన్, మార్కో జాన్సెన్, అయిడిన్ మార్క్‌రమ్, కగిసో రబాడా, క్వింటన్ డి కాక్, డేవిడ్ మిల్లర్... ఆలస్యంగా ఐపీఎల్ 2022 సీజన్‌లో చేరబోతున్నారు...
ఇంగ్లాండ్ ప్లేయర్లు జానీ బెయిర్ స్టో, మార్క్ వుడ్‌లతో పాటు వెస్టిండీస్ ప్లేయర్ల కేల్ మేయర్స్, అల్జెరీ జోసఫ్, జాసన్ హోల్డర్... ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నారు...
వారం ముందుగా ఐపీఎల్ మ్యాచులు ఆరంభమవుతుండడంతో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల నుంచి ఐదేసి ప్లేయర్లు మిస్ అవ్వబోతున్నారు..
ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ చెరో ముగ్గురు ప్లేయర్లను మిస్ అవుతుంటే, కేకేఆర్ ఇద్దరు ప్లేయర్లను, సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్ చెరో ప్లేయర్లను ఆరంభ మ్యాచుల్లో మిస్ కానుంది.