25 ఫోర్లు, 7 సిక్సర్లు.. డబుల్ సెంచరీతో బౌలర్లను వణికించిన భారత ప్లేయర్
Explosive Double Century: భారత క్రికెట్ జట్టు తరఫున ఆడిన ప్లేయర్లలో సచిన్ టెండూల్కర్ తర్వాత త్యుత్తమ బ్యాటర్‌లలో ఒకరిగా గుర్తుంపు పొందిన ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. అద్భుతమైన ఇన్నింగ్స్ తో వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించాడు.
Team India,
Explosive Double Century: 2011లో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన ఫీట్ సాధించాడు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకరైన సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ తర్వాత వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో 200 పరుగుల మార్క్‌ను అధిగమించిన ఆటగాడిగా నిలిచాడు. 2010లో దక్షిణాఫ్రికాపై టెండూల్కర్ ఈ రికార్డును నమోదు చేశాడు. డిసెంబర్ 8, 2011న ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్ 219 పరుగుల అద్భుత నాక్‌ని ఆడాడు.
cricket virender sehwag
భారత ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్
టీమిండియా మాజీ స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను సైతం వణికించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వారి లైన్, లెంగ్త్ సూపర్ బౌలింగ్ ను చీల్చి చెండాడు. వీరేంద్ర సెహ్వాగ్ భారత్ తరఫున 251 వన్డేల్లో 15 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలతో సహా 8273 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో వీరూ అత్యుత్తమ స్కోరు 219. వీరేంద్ర సెహ్వాగ్ 104 టెస్ట్ మ్యాచ్‌లలో 49.34 సగటుతో 8586 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 319. ఇది కాకుండా, వీరేంద్ర సెహ్వాగ్ 19 టీ20 మ్యాచ్‌లలో 394 పరుగులు చేశాడు. ఇందులో 68 పరుగులు అతని అత్యధిక స్కోరు.
సెహ్వాగ్ వన్డేల్లో డబుల్ సెంచరీ ఇన్నింగ్స్
13 ఏళ్ల క్రితం ఇదే రోజున వీరేంద్ర సెహ్వాగ్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో రెండో డబుల్ సెంచరీ సాధించాడు. 8 డిసెంబర్ 2011న ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 219 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును వీరేంద్ర సెహ్వాగ్ బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. 24 ఫిబ్రవరి 2010న, సచిన్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన మొదటి డబుల్ సెంచరీని సాధించాడు. అయితే, 8 డిసెంబర్ 2011న, వీరేంద్ర సెహ్వాగ్ వన్డే క్రికెట్‌లో 219 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడటం ద్వారా సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు.
వీరేంద్ర సెహ్వాగ్ ప్రపంచ రికార్డు
కెప్టెన్‌గా, వీరేంద్ర సెహ్వాగ్ 8 డిసెంబర్ 2011న ఇండోర్‌లో వెస్టిండీస్‌పై 219 పరుగుల పేలుడు ఇన్నింగ్స్ ఆడాడు. వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ఈ ఇన్నింగ్స్ కెప్టెన్‌గా అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఆడిన అతిపెద్ద ఇన్నింగ్స్ గా నిలిచింది. వెస్టిండీస్‌తో జరిగిన ఆ వన్డే మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 149 బంతుల్లో 25 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 219 పరుగులు చేశాడు. ఆ సమయంలో, వీరూ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ప్రపంచంలో రెండవ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
sachin sehwag rohit gayle
కెప్టెన్‌గా అతిపెద్ద వ్యక్తిగత వన్డే ఇన్నింగ్స్ సేహ్వాగ్ దే
వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత వన్డే క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా రోహిత్ వన్డే క్రికెట్‌లో 208 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ని ఆడాడు. రోహిత్ శర్మ తర్వాత, శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య పేరు మూడవ స్థానంలో ఉంది. అతను తన కెరీర్‌లో కెప్టెన్‌గా వన్డేలో 189 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, మార్చి 2004లో ఆడిన ముల్తాన్ టెస్ట్ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్థాన్‌పై 309 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అప్పటి నుంచి వీరేంద్ర సెహ్వాగ్ "ముల్తాన్ సుల్తాన్" గా గుర్తింపు పొందాడు.