ప్రపంచ కప్ ఫైనల్ ఒకే మ్యాచ్‌లో 2 సార్లు టాస్.. ఏం జరిగిందో తెలుసా?
2 Times Toss in World Cup Final: ఒకే మ్యాచ్‌లో రెండు సార్లు టాస్ వేసిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ గురించి మీకు తెలుసా? ధోని ఏం చేశాడనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్
2011 వన్డే ప్రపంచకప్‌లో రెండుసార్లు టాస్: క్రికెట్ మ్యాచ్ లో సాధారణంగా టాస్ మ్యాచ్ కు ముందు ఉంటుంది. అది కూడా ఒకసారి మాత్రమే. కానీ, ఒక మ్యాచ్ లో రెండు సార్లు టాస్ వేశారు. అది కూడా ఐసీసీ ప్రపంచ కప్ టోర్నమెంట్ లో.. !
ఒకే మ్యాచ్‌లో రెండు సార్లు టాస్ వేసిన సంఘటన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో జరిగింది. ఈ టోర్నీని భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించాయి. భారత జట్టుకు కెప్టెన్ గా ఎంఎస్ ధోని, శ్రీలంక జట్టుకు కెప్టెన్ కుమార సంగక్కర ఉన్నారు.
2011 వన్డే ప్రపంచకప్
భారత్, శ్రీలంక మధ్య జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో రెండుసార్లు టాస్ వేశారు. దీనికి అంపైర్లే కారణం అని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ముంబై వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. స్టేడియం అంతా జనంతో నిండిపోయింది. ధోని, సంగక్కర టాస్‌కి రెడీగా ఉన్నారు. జెఫ్ క్రో అంపైర్‌గా, రవిశాస్త్రి టాస్ హోస్ట్‌గా ఉన్నారు.
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్
ముందుగా ధోని టాస్ వేశాడు. సంగక్కర టాస్ అడిగాడు. టాస్ పడిన తర్వాత ఇద్దరూ టాస్ గెలిచినట్టు అనుకున్నారు. కానీ అంపైర్ జెఫ్ క్రో, సంగక్కర టాస్ అడిగినది వినబడలేదు అన్నాడు. అంతా అయోమయం గా ఒకరినొకరు చూసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కెప్టెన్ల అంగీకారంతో మళ్ళీ టాస్ వేశారు. ఈసారి సంగక్కర టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
టీమ్ ఇండియా, 2011 వన్డే ప్రపంచకప్
ఈ మ్యాచ్ లో సెహ్వాగ్ 0, సచిన్ 18 పరుగులకే ఔట్ అయ్యారు. కోహ్లీ 35 పరుగులు చేశాడు. గాంభీర్ 97, ధోని 91 పరుగులు చేసి జట్టును గెలిపించారు. ధోని సిక్సర్ కొట్టి మ్యాచ్ ముగించాడు. ఆ సిక్సర్ పడిన చోటును వాంఖడే స్టేడియం ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటుంది.
చివరికి 48.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలోనే అశ్విన్‌తో జరిగిన సంభాషణలో అశ్విన్ ఆ సంఘటన గురించి అడగ్గా అక్కడ ఏం జరిగిందో చెప్పారు.
వన్డే ప్రపంచకప్, భారత్ vs శ్రీలంక
సంగక్కర అప్పటి సంఘటనపై మాట్లాడుతూ.. "ఇక్కడి స్టేడియం కోలాహలం ఎక్కువగా ఉంది. కానీ శ్రీలంకలో అలా ఉండదు. నేను టాస్ అడిగినది నాకు బాగా గుర్తు. అప్పుడు ధోనికి సరిగ్గా వినబడలేదు. 'నువ్వు టెయిల్ అడిగావా' అన్నాడు. నేను 'కాదు కాదు హెడ్' అన్నాను" అని చెప్పాడు.
దీంతో కాస్త గందరగోళం ఏర్పడింది. దాంతో మళ్ళీ టాస్ వేశారు. అప్పుడు నేను టాస్ గెలవడం అదృష్టమా కాదా అని నాకు తెలియదు. నేను టాస్ ఓడిపోయి ఉంటే భారతే బ్యాటింగ్ చేసి ఉండేది అని సంగక్కర అన్నాడు.
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్
కాగా, 2011 ప్రపంచకప్‌లో శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగక్కరను ఫిక్సింగ్ ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు. శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ ప్రపంచకప్ 2011 ఫైనల్ ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభి.. విచారణ కూడా చేసిందని పలు రిపోర్టులు పేర్కొన్నాయి. అప్పట్లో 'newswire.lk' ప్రకారం 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగక్కర 10 గంటలకు పైగా తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశాడు. అయితే, ఆ వివరాలు బయటకు వెల్లడించలేదు. 2011 జాతీయ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ అరవింద డి సిల్వా, ఓపెనర్ ఉపుల్ తరంగ తమ తమ స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేశారని కూడా పేర్కొన్నాయి.