MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • 36 బంతుల్లో 11 సిక్సర్లు.. సెంచ‌రీతో దుమ్మురేసిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ప్లేయ‌ర్

36 బంతుల్లో 11 సిక్సర్లు.. సెంచ‌రీతో దుమ్మురేసిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ప్లేయ‌ర్

IPL 2025 : 28 బంతుల్లో సెంచరీ సాధించిన కొద్ది రోజులకే, ఉర్విల్ పటేల్ SMAT 2024లో 36 బంతుల్లో మ‌రో సెంచరీతో అద‌ర‌గొట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ మాజీ బ్యాట్స్‌మెన్ ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 03 2024, 08:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలంలో త‌న‌ను ఎవ‌రూ కోనుగోలు చేయ‌లేద‌నే ప్ర‌తాప‌మో ఏమో గాని గుజ‌రాత్ టైటాన్స్ మాజీ ప్లేయ‌ర్ సెంచ‌రీల మోత మోగిస్తున్నారు. ఐపీఎల్ వేలం ముగిసిన త‌ర్వాత అరేరే ఎందుకు అత‌న్ని తీసుకోలేక‌పోయామ‌ని ఐపీఎల్ ప్రాంఛైజీలు అనుకునే విధంగా వ‌రుస సెంచ‌రీల‌తో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. అత‌నే ఉర్విల్ ప‌టేల్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గుజరాత్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ ప్ర‌స్తుతం సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2024లో అతని బ్యాట్ గర్జన‌ల‌కు బౌల‌ర్లు భ‌య‌ప‌డిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం 28 బంతుల్లోనే సెంచరీతో రికార్డుల మోత మోగించారు. మ‌రోసారి అలాంటి ఇన్నింగ్స్ ను ఆడాడు. మంగ‌ళ‌వారం ఉత్తరాఖండ్‌పై ఉర్విల్ ప‌టేల్ కేవలం 36 బంతుల్లో సెంచరీ సాధించాడు. 

36

గుజరాత్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన ఉర్విల్ ప‌టేట్.. త‌న ఇన్నింగ్స్ లో 11 సిక్స్‌లు, 8 ఫోర్లతో అజేయంగా 41 బంతుల్లో 115 పరుగులు చేశాడు. ఇండోర్‌లోని ఎమరాల్డ్ హైస్కూల్ గ్రౌండ్‌లో 183 పరుగుల లక్ష్యాన్ని ఎనిమిది వికెట్లు, 35 బంతులు మిగిలి ఉండగానే అందుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. అంతకుముందు ఈ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ 20 ఓవర్లలో 182/7 స్కోరు చేసింది. 

46
Urvil Patel

Urvil Patel

ఉర్విల్ ప‌టేల్ టీ20 క్రికెట్ లో రెండవ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డును కలిగి ఉన్నాడు, అయితే ఉత్తరాఖండ్‌పై 36 బంతుల్లో అతని సెంచరీ భారతీయ బ్యాట్స్‌మెన్ చేసిన నాల్గవ వేగవంతమైన సెంచరీగా నిలిచింది. రిషబ్ పంత్, రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. SMAT 2018లో హిమాచల్ ప్రదేశ్‌పై పంత్ 30 బంతుల్లో సెంచరీ సాధించగా, 2017లో శ్రీలంకపై రోహిత్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 

56
Urvil Patel

Urvil Patel

ఉర్విల్ ప‌టేల్ ఐపీఎల్ వేలం ముగిసిన త‌ర్వాతి రోజు అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో కేవ‌లం 28 బంతుల్లో సెంచరీ సాధించాడు. నవంబర్ 27న గుజరాత్, త్రిపుర మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ పటేల్ 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.  ఉర్విల్ చేసిన ఈ సెంచరీ టీ-20 క్రికెట్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. సైప్రస్‌పై కేవలం 27 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 

టీ20లో వేగవంతమైన సెంచరీ 

1. సాహిల్ చౌహాన్ (ఈస్టోనియా) – సైప్రస్‌పై 27 బంతుల్లో (2024)
2. ఉర్విల్ పటేల్ (గుజరాత్) – త్రిపురపై 28 బంతులు (2024)
3. క్రిస్ గేల్ (RCB) – 30 బంతుల్లో పుణె వారియర్స్‌పై (2013)
4. రిషబ్ పంత్ (ఢిల్లీ) – 32 బంతుల్లో హిమాచల్ పై (2018)
5. విహాన్ లుబ్బే (నార్త్-వెస్ట్) – లింపోపోపై 33 బంతులు (2018)

 

66

26 ఏళ్ల ఉర్విల్ పటేల్ ప్రాథమిక ధర  రూ. 30 లక్షలతో ఐపీఎల్ 2025 వేలంలో పాల్గొన్నాడు. అయితే అతడిని ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. అతను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. మెహ్సానా (బరోడా) నివాసి అయిన ఉర్విల్ ప‌టేల్ 2018లో రాజ్‌కోట్‌లో ముంబైతో జరిగిన టీ20 మ్యాచ్‌లో బరోడా తరఫున అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరంలో అతను లిస్ట్-ఎ క్రికెట్‌లోకి కూడా ప్రవేశించాడు. కానీ అతను రంజీ ట్రోఫీ చివరి ఎడిషన్‌లో అరంగేట్రం చేయడానికి ముందు అతనికి ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడటానికి ఆరు సంవత్సరాలు పట్టింది. గుజరాత్ టైటాన్స్ 2023 సీజన్‌కు ఉర్విల్‌ను రూ. 20 లక్షల ధరతో కొనుగోలు చేసింది, అయితే అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved