MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • ఒక్క ప్లేయర్, 11 మంది కెప్టెన్లు... రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ నుంచి హార్ధిక్ పాండ్యా దాకా...

ఒక్క ప్లేయర్, 11 మంది కెప్టెన్లు... రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ నుంచి హార్ధిక్ పాండ్యా దాకా...

ఐపీఎల్ 2022 సీజన్ పర్ఫామెన్స్‌తో దినేశ్ కార్తీక్ కెరీర్ గ్రాఫ్ అమాంతం మారిపోయింది. దాదాపు కెరీర్ ముగిసిపోయి, రిటైర్మెంట్ ఇవ్వడమే తరువాయి అనుకుంటున్న దినేశ్ కార్తీక్, ఊహించని రీతిలో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు... యంగ్ ప్లేయర్లకు పోటీ ఇస్తున్న దినేశ్ కార్తీక్, త్వరలో హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడబోతున్నాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 19 2022, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Image credit: PTI

Image credit: PTI

37 ఏళ్ల దినేశ్ కార్తీక్, 18 ఏళ్ల క్రితం 2004లో టీమిండియా తరుపున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. పార్థివ్ పటేల్ పేలవ పర్ఫామెన్స్‌తో అతని స్థానంలో టెస్టు టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్, తొలి మ్యాచ్‌లో  సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో మ్యాచ్ ఆడాడు...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అప్పటి హెడ్ కోచ్ గ్రెగ్ ఛాపెల్‌తో విభేదాలతో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, ఆ పొజిషన్‌లోకి రాహుల్ ద్రావిడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో 2007 వన్డే వరల్డ్ కప్ ఆడిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు దినేశ్ కార్తీక్...

39

వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్సీలో భారత జట్టు ఆడిన మొట్టమొదటి టీ20 మ్యాచ్‌లో సభ్యుడిగానూ ఉన్నాడు దినేశ్ కార్తీక్. ఈ మ్యాచ్ ఆడిన ఇరు జట్లలో దినేశ్ కార్తీక్ మినహా మిగిలిన ప్లేయర్లు అందరూ రిటైర్మెంట్ తీసుకున్నారు... 

49
Image credit: PTI

Image credit: PTI

2007 వన్డే వరల్డ్ కప్ ఘోర పరాభవం తర్వాత రాహుల్ ద్రావిడ్, టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో టీ20, వన్డే ఫార్మాట్‌లో బాధ్యతలను అందుకున్నాడు ఎమ్మెస్ ధోనీ... అనిల్ కుంబ్లే టెస్టు సారథిగా బాధ్యతలు తీసుకున్నాడు...

59
Image credit: PTI

Image credit: PTI

ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో వైట్ బాల్ మ్యాచులు ఆడిన దినేశ్ కార్తీక్, అనిల్ కుంబ్లే కెప్టెన్సీ టెస్టు మ్యాచులు కూడా ఆడాడు...

69
Image credit: PTI

Image credit: PTI

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆ పొజిషన్.‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ 2019 ఆడిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు దినేశ్ కార్తీక్...

79

ఎమ్మెస్ ధోనీ గైర్హజరీలో సురేష్ రైనా, అజింకా రహానే కెప్టెన్సీలో మ్యాచులు ఆడిన దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆసియా కప్ 2018 గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు...

89

దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసినప్పుడు రిషబ్ పంత్ వయసు ఏడేళ్లు. ఇప్పుడు రిషబ్ పంత్ కెప్టెన్సీలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న దినేశ్ కార్తీక్, ఈ సిరీస్ తర్వాత ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌లో హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడబోతున్నాడు...

99
Dinesh Karthik, Rohit Sharma

Dinesh Karthik, Rohit Sharma

సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, అజింకా రహానే, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా... ఇలా దినేశ్ కార్తీక్ ఒక్కడూ 11 మంది కెప్టెన్ల కెప్టెన్సీలో ఆడడం విశేషం. 

About the Author

CR
Chinthakindhi Ramu
రిషబ్ పంత్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved