Renault Duster: ఐకాన్ ఇజ్ బ్యాక్.. అదిరిపోయే అప్డేట్స్‌తో డస్టర్ దూసుకొస్తోంది
Renault Duster: రెనాల్ట్‌కి చెందిన డస్టర్ కారుకు అప్పట్లో మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కంపెనీ డస్టర్‌ను మళ్లీ తీసుకొస్తోంది. ఈసారి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ కారును లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.

వచ్చే నెలలోనే లాంచింగ్
రెనాల్ట్ మరోసారి భారత మార్కెట్‌లో తన పాపులర్ SUV డస్టర్‌ను కొత్త జనరేషన్‌తో తీసుకురాబోతోంది. కంపెనీ తాజాగా విడుదల చేసిన టీజర్ ప్రకారం, 26 జనవరి 2026న ఈ SUV అధికారికంగా లాంచ్ కానుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది పెద్ద అప్డేట్‌గా మారింది.
టీజర్‌లో కనిపించిన ముఖ్యమైన సంకేతాలు
Renault విడుదల చేసిన టీజర్‌లో పూర్తి డిజైన్ కనిపించకపోయినా, కొత్త Duster మరింత స్ట్రాంగ్‌గా కనిపించనుందన్న సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. వెడల్పుగా ఉండే స్టాన్స్, మోడ్రన్ SUV లుక్, గట్టిపాటి బాడీ డిజైన్ ఈసారి ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. లాంచ్ దగ్గర పడే కొద్దీ కంపెనీ మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
డిజైన్‌లో భారీ మార్పులు
కొత్త జనరేషన్ Duster లో ఎక్స్‌టీరియర్ భాగంలో కొత్త ఫ్రంట్ లుక్, LED హెడ్‌లైట్స్, కొత్త అలాయ్ వీల్స్ అందించే అవకాశం ఉంది. మొత్తం లుక్ గత మోడల్‌తో పోలిస్తే మరింత బోల్డ్‌గా ఉండనుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే డ్యూయల్ స్క్రీన్ సెటప్, కొత్త డాష్‌బోర్డ్ డిజైన్, మెరుగైన క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించనున్నట్లు సమాచారం. దీని వల్ల ప్రీమియం ఫీల్ మరింత పెరగనుంది.
ఆధునిక ఫీచర్లు, సేఫ్టీకి ప్రాధాన్యం
ఫీచర్ల పరంగా కొత్త Duster పెద్ద అప్‌గ్రేడ్‌గా మారనుంది. 360 డిగ్రీ కెమెరా, పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, అంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఇచ్చే అవకాశం ఉంది. సేఫ్టీ కోసం Level-2 ADAS టెక్నాలజీ కూడా అందించనున్నట్లు సమాచారం. కొత్త టచ్‌స్క్రీన్ సిస్టమ్, మోడ్రన్ AC వెంట్స్ కూడా ఇందులో భాగంగా ఉండనున్నాయి.
ఇంజన్ ఆప్షన్లు
కొత్త Renault Dusterలో 1.2 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇవ్వొచ్చని అంచనా. అదనంగా 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉండొచ్చు. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కారు ఇప్పటికే ఉన్న హ్యుండాయ్ క్రెటా, కియో సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా Hyryder, హోండా ఎల్వేట్ వంటి కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

